Adsense

Wednesday, September 10, 2025

తల విరబోసుకొని తిరుగకూడదా?

తల విరబోసుకోవల్సిన పరిస్థితులు కొన్ని వున్నాయి. వెంట్రుకలు విరబోసుకొని భార్య భర్తకు కనిపించకూడదని శాస్త్రం. అలా కన్పించటం రాబోయే ఆపదలకు సూచనగా భావించాలని స్మృతుల వాక్యం.

నానాటికీ కాలం మారుతోంది గాబట్టి యిటువంటి నమ్మకాలు కూడా తుప్పు పట్టిపోతున్నాయి. అందరి జీవితాలు సినిమా మాధ్యమం అయి పోతున్నాయి. ఇప్పటి విపరీత పోకడలకు విచిత్ర విన్యాసాలకు చిత్రరంగమే దోషిగా వుంటున్నది.

వెంకటేశ్వర సుప్రభాతంతోనూ, నమశ్శివాయ మంత్రంతోనూ అర్ధనగ్న దుస్తులతో ప్రేమపాటలు పాడుతుంటే ఎవరైనా నోరెత్తి అడిగిన వారున్నారా? ఇతర మతస్థలైతే మనలా మౌనంగా వుండేవారా? ఏం చేద్దాం హిందుత్వం అనాధ అయింది.

గంధర్వ కాంతలకు తల విరబోసుకోవటం విరహ సంకేతం మానవకాంతలకు తలవిరబోసుకోవటం శోక సంకేతం.

స్త్రీ అయినా పురుషుడైనా తల విరబోసుకొని తిరుగటం మంచిదికాదు.

No comments: