Adsense

Saturday, November 29, 2025

ముఖ్యమైన_ఋణాలు_వాటి_నివారణోపాయాలు

శాస్త్రాల ప్రకారం ఋణాలు ఉంటె ఎం అవుతుంది? ఎప్పుడయినా ఋణం యొక్క ఊబిలో చిక్కుకున్నారా? ఋణం అనేది మనిషిని, పరిస్థితిని తనవశం చేసుకుంటుంది. దాని వల్ల వాళ్ళ స్వాభిమానాన్ని తాకట్లు పెట్టాల్సివస్తుంది. తరువాత అదే ఋణం వాళ్ళ మనస్సుపై ప్రతాపాన్ని చూపి రంధ్రాన్ని చేస్తుంది. లోలోపలే చెదలు పట్టిపోతుంది. కొన్ని ముఖ్యమైన ఋణాలు వాటి నివారణోపాయాలు చూద్దాము.
#మాతాపితా_ఋణం:-
మొదటిది తల్లిదండ్రుల ఋణం వ్యక్తి మీద ఎందుకు ఉందంటే వాళ్ళ కారణం వల్ల తనకు మనుష్య జన్మ వచ్చింది, మరియు జీవితంలో ఉన్న సుఖసంతోషా లన్ని వాళ్ళద్వారా లభించాయి. ఏ ఒక వ్యక్తి అయిన తల్లిదండ్రుల సేవ చేయనిపక్షంలో వానికి ‘ఋణదోషం’ ఫట్టుకుంటుంది. ఈ దోషాన్ని ఈ జన్మలో కాకపోయినా వచ్చే జన్మలోనైనా వదిలించుకోవాల్సి వస్తుంది.
#గురు_ఋణం:-
రెండవ ఋణం గురుఋణం. గురువు అంటే దీక్షని, జ్ఞానాన్ని, జీవితం యొక్క స్వరూపాన్ని కనులముందు ఉంచేవారు. ఆ గురువుకు తెలిసి తెలియక అన్యాయం జరిగినా, గురువుయొక్క వచనాలు అమలుచేయక పోవుట, గురువుకు సేవ చేయుటలో అశ్రద్ధ చూపుట, గురువు విషయంలో ఇంకా మనస్సు, మాట, పని మొదలగునవి ఏ విధమైన రూపంలోనైనా శ్రద్ధ చూపించకుండా ఉంటే అది గురువు ఋణం వెయ్యివరకు పెంచుతుంది. ఋణం అనేది వ్యక్తి యొక్క జీవితంలో ఏవిధంగా కలిసి పోతుందంటే అతని సంసార జీవితంలోని బాధలు పట్టులో చిక్కుకు పోతుంది. ఈ ఉడుం పట్టునుండి ముక్తి పొందాలంటే ఉపాయం ఆ గురువు వద్ద ఉంటుంది.
#లక్ష్మీ_ఋణం:-
మూడవ ఋణం ఆర్ధిక ఋణం. తన శక్తితో మన కోరికలు తీర్చుకునేందుకు కారణమైంది. సంసార భోగ విలాసాలలో మునగడానికి కారణమైనది. అబద్ధపు తళుకు బెళుకులు వృద్ధి చెందటానికి కారణమైనది. ఇవేకాకా అసత్యమైన మాటలు, సోమరి తనం, పనితనం లేకపోవడం, సాధించే మనస్తత్వం లేకపోవడం, వ్యక్తికి జీవితంలో ఆర్ధిక ఋణం యొక్క బరువును మోయవలసి వస్తుంది.
#పూర్వజన్మ_దోషం:-
పైన చెప్పిన మూడు ఋణాలలో మనిషి  తన జీవితంలో ఈ ఋణాలను పూర్తి చేయని పక్షంలో దానివల్ల వచ్చే దోషం వచ్చే జన్మమీద ప్రభావం చూపుతుంది. దీని కారణంవల్ల వ్యక్తి పేదరికంలో పుట్టడం అభివృద్ధిలోకి వచ్చేందుకు ఎలాంటి అవకాశాలుండవు. ఇంటివారి మధ్య కలహాలు కలుగవచ్చు. శారీరక, మానసిక విషయంలో బాధగా ఉంటాడు. నిజం చెప్పాలంటే ఆ వ్యక్తి జీవితం కష్టాలతో సాగుతూపోతూంటుంది.
.#ఋణదోషం_నివారణ:-
ఎంత పెద్ద జ్వరం ఉంటే అంత పెద్ద చికిత్స అవసరం లేదు, అన్నిసార్లు పెద్ద పెద్ద మందులు పని చేయవు. సాధారణ మందుతో రోగం తొందరగా తగ్గిపోతుంది. ఋణం యొక్క తల్లి పేరు నిర్ధనం దాన్ని నష్టం చేయడానికి శక్తిగల తల్లి లక్ష్మీదేవి, లక్ష్మిదేవికి సాధన చేసేవాడు. విశేష పూజ చేయకపోతే అతడు ఋణం నుంచి విముక్తి పొందడు. సాధనచేసే వ్యక్తి తను నిర్ధనాన్ని పోగోట్టటానికి సంకల్పిం చాలి. తను సమర్ధుడను అనుకోవాలి. లక్ష్మిని ఆరాధించడానికి సిద్ధంగా ఉన్నాను. అని అనుకొన్నప్పుడే అతను జీవితంలో దోషాలనుంచి విముక్తి పొందుతాడు. లక్ష్మి ఉపాసనలో బుణదోషం దూరం చేసుకోవడానికి చాలారకాల ప్రయోగాలు వేదోక్త గ్రంధాలలో ఉన్నాయి. విశ్వామిత్ర సంహితలో కూడా ఒక అత్యంత విలువైన ప్రయోగం ఉంది, కాని వ్యక్తి జీవితంలో ఎప్పటివరకు అయితే తల్లిదండ్రుల సేవా, గురువు సేవలను మించి ఋణం గురించి స్థానాన్ని ఇవ్వడో ఎక్కువగా భావించడో అప్పటి వరకు ధన ఋణమునుండి ముక్తి పొందలేడు.
#విశ్వామిత్రుడు_చేసిన_ఋణప్రయోగం:-
విశ్వామిత్రుడు రాజ్యాన్ని వదిలేసి సన్యాసం పుచ్చుకొన్న తర్వాత అతనికి ధనం లేకపోవడం వల్ల జనాలు ఎలా బాధలు పడుతున్నారో అతను చూశాడు. అందుకని అతను జ్యేష్టలక్ష్మి సాధన రచన జేశారు. ఈ ప్రయోగంలో సాధకుడు ఏడు రోజుల వరకు సంపన్నం చేస్తాడు. దాని తర్వాత జ్యేష్టలక్ష్యి మంత్రాన్ని రోజూ జపం చేస్తూ లక్ష సార్లు  ఉచ్ఛారణ చేస్తారు. దానివల్ల ఏదో ఒకవిధంగా లక్ష్మి అతన్ని నివారిస్తుంది. అప్పుడు ఋణం పోగొట్టుకోవడానికి సంసిద్ధుడు అవుతాడు.
ఈ సాధనలో మంత్రంతో తయారు చేయబడిన "జ్యేష్టలక్ష్మి యంత్రం” 'నవలక్ష్మి సిద్ధి శ్రీఫలం' అవసరం ఉంటుంది. దీని ఫలితం జ్యేష్టలక్ష్మి శక్తివల్ల సంభవిస్తుంది. దీని పూజ చాలా అవసరం.
#ప్రయోగాన్ని_వినియోగించే_విధానం:-
ఓం అస్యశ్రీ జ్యేష్టలక్ష్మి మంత్రస్య బ్రహ్మా ఋషిః అనుష్టుప్ ఛందః జ్యేష్టాలక్ష్మి దేవతా హ్రీం బీజమ్. శ్రీం శక్తిః మమాభీష్టసిద్ధ్యర్దే జపే #వినియోగః                                                                               
ఇప్పుడు జ్యేష్టలక్ష్మిని పూజ చేస్తూ యంత్రాన్ని తామ్రగిన్నెలో ఉంచాలి.
ఓం రక్త జ్యేష్టాయై విద్మహే నీల జ్యేష్టాయై ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్.
ఇప్పుడు సుగంధ వాసన వచ్చే పుష్పాన్ని తీసుకొని యంత్రం మీద జ్యేష్ట లక్ష్మిని దృష్టిలో ఉంచుకొని ఈ మంత్రాన్ని చదవాలి -

ఓం నం విన్మయే పఠేదేవి పరామృత రసప్రియే                         
అనస్య దేహిజేష్టా పరివారాచార్య నామ యజ్ఞంమే.
తొమ్మిది శ్రీఫలాలను జ్యేష్టదేవికి సంబంధించిన తొమ్మిది శక్తులకు ప్రతీక అయిన వాటిని తూర్పుదిశలోనుంచి ప్రారంభం చేసి ఈ మంత్రాలను ఉచ్ఛారణ చేస్తూ స్థాపించాలి.
1. ఓం లోహితాక్షయై నమః 2. ఓం విరూపాయై నమః 3. ఓం కరాళ్యైనమః 4.ఓం నీలలోహితాయై నమః 5. ఓం నమా దాయై నమః 6. ఓం వారుణ్యయైనమః 7. ఓం పుష్పయై నమః 8. ఓం అమోఘాయై నమః 9. ఓం విశ్వమోహిన్యాయై నమః .         
ఇప్పుడు సాధనచేసే వ్యక్తి అష్టగంధంనుంచి సామాగ్రిని నాలుగు  వైపులా ఉంచి మరియు నాలుగు వైపులా నాలుగు దీపాలు ఉంచాలి. ఇచ్చిన జ్యేష్టలక్ష్మి మంత్రాలన్ని జపంచేయాలి.
#జ్యేష్ఠలక్ష్మీ_మంత్రం :
ఓం హ్రీం శ్రీం జ్యేష్టాలక్ష్మి స్వయంభువే హ్రీం జ్యేష్టాయై నమః దీని తర్వాత వస్తువులన్ని పళ్ళెంతో మూత పెట్టి వాటిని రెండవ రోజు ఉపయోగించాలి. ఈ విధంగా ఏడురోజులు చేసిన తర్వాత సాధన చేసేవారు కేవలం జ్యేష్టాలక్ష్మి మంత్రాన్ని జపించాలి. ఒక లక్ష మంత్రాన్ని ఎవరు జపిస్తారో వారు జీవితంలో ఋణంనకు సంబంధించిన బాధలను ఎదుర్కోవలసిన అవసరం రాదు. మంత్రం జపించిన తర్వాత మొత్తం సామాగ్రిని నదిలో లేక కాలువలో నిమజ్జనం చేయాలి.

No comments: