Adsense

Friday, March 13, 2026

సంతాన వరం ప్రసాదించే పవిత్ర స్థలం – విరింజిపురం శివక్షేత్రం

వెల్లూరు పట్టణానికి సమీపంలోని విరింజిపురంలో ఉన్న శ్రీ మార్గబండేశ్వర ఆలయం తమిళనాడులోని ప్రాచీన శైవక్షేత్రాలలో ఒకటి. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఈ ఆలయాన్ని 13వ శతాబ్దంలో చోళరాజులు నిర్మించారు. తరువాత బొమ్మ నాయకులు ఆలయాన్ని విస్తరించి మరిన్ని నిర్మాణాలు చేపట్టారు.


ఈ ఆలయంలో ప్రధాన దేవుడు శ్రీ మార్గబండేశ్వరర్ అనే స్వయంభూ శివలింగ రూపంలో వెలసి ఉన్నాడు. గర్భగుడిలో విద్యుత్ దీపాలు లేకపోయినా నూనె దీపాల వెలుగుతో దేవాలయం ఎంతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని కలిగిస్తుంది. విశేషం ఏమిటంటే ఈ శివలింగం కొద్దిగా ఈశాన్య దిశకు వంగి ఉన్నట్లు కనిపిస్తుంది.

ఆలయానికి సంబంధించిన పురాణ కథ

ఒకసారి సృష్టికర్త అయిన

శివుడి తల చూడలేకపోయినా చూసినట్లు అబద్ధం చెప్పాడని పురాణం చెబుతుంది. దీనివల్ల శివుడు బ్రహ్మకు ప్రత్యక్షం కావడానికి ఇష్టపడలేదు.

తర్వాత బ్రహ్మ ఈ ప్రాంతంలో శివశర్మన్ అనే పూజారి కుమారుడిగా జన్మించాడు. చిన్న వయస్సులోనే తండ్రి మరణించడంతో ఆలయ పూజా బాధ్యతలు అతనిపై పడాయి. అయితే బంధువులు అతని హక్కులను తీసుకోవాలని యత్నించారు.

ఆ సమయంలో శివశర్మ తల్లి

వారిని ప్రార్థించగా, శివుడు కలలో దర్శనమిచ్చి ఆశీర్వదించాడని చెబుతారు. మరుసటి రోజు బ్రహ్మ తీర్థంలో స్నానం చేసిన శివశర్మకు వృద్ధుడి రూపంలో శివుడు ప్రత్యక్షమై ఉపనయనం, బ్రహ్మోపదేశం చేసి ఆ తర్వాత మహాలింగంగా అదృశ్యమయ్యాడని పురాణగాథ.

తర్వాత శివశర్మ ఆలయంలో అభిషేకం చేయడానికి ప్రయత్నించినప్పుడు, అతను చిన్నవాడిగా ఉండడంతో శివలింగం తలను తాకలేకపోయాడు. అప్పుడు శివుడు తన తలను వంచి బాలుడి సేవను స్వీకరించాడని చెబుతారు. అందుకే ఈ ఆలయంలో శివలింగం కొద్దిగా వంగి కనిపిస్తుందని భక్తులు నమ్ముతారు.


దేవతలు మరియు ఉపాలయాలు

ఈ ఆలయంలో అమ్మవారు

రూపంలో ప్రత్యేక ఉపమందిరంలో దర్శనమిస్తారు.

అదే ప్రాంగణంలో మరిన్ని దేవతలు కూడా దర్శనమిస్తారు:

  • గణపతి
  • సుబ్రమణ్య స్వామి
  • దక్షిణామూర్తి
  • పంచముఖ లింగం
  • 63 నాయన్మార్లు
  • వాసుదేవ పెరుమాళ్
  • లక్ష్మీ, సరస్వతి
  • దుర్గాదేవి
  • చండికేశ్వరర్
  • కాల భైరవర్
  • నవగ్రహాలు

ముఖ్య పండుగలు

ఈ ఆలయంలో అనేక ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి.

  • బ్రహ్మోత్సవం – పంగుని మాసంలో 10 రోజుల పాటు
  • మహాశివరాత్రి – భారీగా జరుపుకుంటారు
  • నవరాత్రి – అమ్మవారికి ప్రత్యేక పూజలు
  • ఆదిపూరం ఉత్సవం
  • కార్తీక మాసంలో ప్రత్యేక తీర్థస్నానం

భక్తుల విశ్వాసం

ఈ ఆలయం ముఖ్యంగా సంతాన వరప్రాప్తి కోసం ప్రసిద్ధి చెందింది. పాలారు నదిలో స్నానం చేసి, బ్రహ్మ మరియు సింహ తీర్థాలలో పవిత్ర స్నానం చేసి స్వామిని ప్రదక్షిణ చేస్తే సంతానం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు.

అలాగే వివాహం ఆలస్యం అవుతున్నవారు, మంత్రవిద్యల ప్రభావాల నుండి విముక్తి కోరేవారు కూడా ఈ దేవాలయాన్ని దర్శించుకుంటారు.

ప్రత్యేక విశేషం

ప్రతి సంవత్సరం మార్చి నెలలో సూర్యకిరణాలు నేరుగా మార్గబండేశ్వర స్వామి విగ్రహంపై పడటం ఈ ఆలయ ప్రత్యేకత. ఈ సమయంలో వేలాది మంది భక్తులు దర్శనానికి తరలివస్తారు.

ఎలా చేరుకోవాలి

  • కాట్పాడి – సుమారు 19 కి.మీ
  • కాంచీపురం – సుమారు 81 కి.మీ
  • చిత్తూరు – సుమారు 51 కి.మీ

No comments: