*మైసూర్ బోండాలు హోటల్ స్టైల్ లో సింపుల్ గా ఇలా చేయండి*..
ఇంట్లో అమ్మలకు తొందరగా టిఫిన్ అయిపోవాలంటే ఇడ్లీలు వేస్తారు అలాగే దోసెలు ఉప్మా చాలా ఈజీగా చేసేస్తుంటారు కానీ మైసూర్ బోండా వేయాలంటే ఆలోచిస్తారు...
ఎందుకంటే మైసూరు బోండాలు వేసుకుంటే లోపల గట్టిగా వస్తాయి కదా అలా కాకుండా మనం హోటల్స్ లో చూస్తూ ఉంటాం లోపల చక్కగా గుల్లగా వస్తాయి అలా మనం ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఈ ఆర్టికల్ లో చూసి నేర్చుకుందాం ముందుగా దానికి కావలసిన పదార్థాలను తెలుసుకుందాం...
ఉదయం టిఫిన్ గా తీసుకోవచ్చు అలాగే సాయంత్రం స్నాక్స్ లాగా కూడా తీసుకుంటే చాలా బాగుంటుంది అదే చలికాలంలో అయితే దీన్ని బాగా ఎంజాయ్ చేయొచ్చు వేడి వేడిగా తింటే చాలా రుచిగా ఉంటాయి...
ఈ మైసూర్ బోండా లను కొబ్బరి చెట్నీ అలాగే వేరుసెనగ పప్పు చట్నీ ఇంకా అల్లం చట్నీ కారప్పొడి కాంబినేషన్ లో తింటే చాలా రుచిగా ఉంటాయి...
ఈ మైసూర్ బోండా లను తయారు చేసుకోవడానికి మనం మైదాపిండిని వాడుతున్నావు కదా ..
మైదాపిండి తొందరగా అరగదు కాబట్టి అది జీర్ణం అవ్వడానికి కొంచెం సోడా ఉప్పు అలాగే కొంచెం జీలకర్ర వాడుతున్నాం...
సోడా ఉప్పు వేయడం వల్ల ఏంటంటే గుల్ల గా రావడానికి ఉపయోగపడుతుంది..
కావలసిన పదార్థాలు - -
మైదాపిండి రెండు కప్పులు ,
ఉప్పు తగినంత,
బియ్యం పిండి అర కప్పు,
పెరుగు చిన్నకప్పు
సోడా ఉప్పు తగినంత
జీలకర్ర కొంచెం,
నూనె తగినంత..
తయారు చేసే విధానం-
ముందుగా ఒక గిన్నెలో కొంచెం పెరుగు సోడా ఉప్పు జీలకర్ర కొంచెం తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి బాగా కలిపిన తరువాత మైదాపిండి బియ్యం పిండి కొలతలు తీసుకుని ఉండలు లేకుండా బాగా కలపాలి..
ఈలోపు బాండీలో తగినంత నూనె పోసుకొని బాగా కాగనివ్వాలి ఈ కలిపిన పిండిని ఒక ఐదు నిమిషాలు అలాగే ఉంచాలి .
ఇప్పుడు నూనె బాగా కాగిన తరువాత మనం చక్కగా కలుపుకొన్న పిండి ని బొండాలు వేయడానికి వీలు గా తీసుకొని బాగా కాగిన నూనెలో వేసి బంగారు రంగు వచ్చే వరకు బాగా కలుపుకొని బాగా వేగిన తర్వాత నూనె తీసి వేరే ప్లేట్లో తీసుకొని లేదా పేపర్ లో తీసుకొని నూనె ఆ పేపరుకు అంటుకుంటుంది
అప్పుడు సులువుగా మనం వేరే ప్లేట్లో తీసుకుంటే తినడానికి మైసూర్ బోండా హోటల్ స్టైల్ లో రెడీ అయినట్టే...