శారీరక ప్రయోజనాలు:
🔅 బరువు తగ్గడానికి సహాయపడుతుంది.., ఎనిమిది ఆకారంలో నడవడం వల్ల సాధారణ నడక కంటే ఎక్కువ కేలరీలు కాలతాయి,
🔅 గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది…. క్రమం తప్పకుండా ఎనిమిది ఆకారంలో నడవడం వల్ల గుండె కండరాలు బలపడతాయి
🔅 వ్యాయామం పెరుగుతుంది…. ఎనిమిది ఆకారంలో నడవడం వలన చేతులు, కాళ్ళు మరియు కోర్ కండరాలకు వ్యాయామం లభిస్తుంది.
🔅 జాయింట్ల నొప్పిని తగ్గిస్తుంది….. ఎనిమిది ఆకారంలో నడవడం వల్ల మోకాళ్ళు మరియు కీళ్ళపై ఒత్తిడి తగ్గుతుంది,
🔅 శక్తిని పెంచుతుంది… క్రమం తప్పకుండా ఎనిమిది ఆకారంలో నడవడం వల్ల శక్తి స్థాయిలు పెరుగుతాయి
🔅 సమతుల్యత మరియు సమన్వయాన్ని మెరుగుపరుస్తుంది…. ఎనిమిది ఆకారంలో నడవడం వల్ల మెదడు మరియు శరీరం మధ్య సమన్వయం మెరుగుపడుతుంది.
🔅 మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది…. ఎనిమిది ఆకారంలో నడవడం వల్ల ఒత్తిడి, ఆందోళన మరియు నిరాశ లక్షణాలు తగ్గుతాయి.
🔅 నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది…. క్రమం తప్పకుండా ఎనిమిది ఆకారంలో నడవడం వల్ల నిద్రలోకి జారుకోవడం సులభమవుతుంది
🔹🔹 ఎనిమిది ఆకారంలో ఎలా నడవాలి ?
🔹 ఖాళీ ప్రదేశంలో రెండు చిన్న వృత్తాలను ఎనిమిది ఆకారంలో ఉంచండి.
🔹 ఒక వృత్తం చుట్టూ కుడివైపు నడవండి.
🔹 రెండవ వృత్తం వద్దకు వచ్చినప్పుడు, ఎడమవైపు నడవండి.
🔹 మొదటి వృత్తం వద్దకు వచ్చినప్పుడు, దిశను మళ్లీ మార్చండి మరియు కుడివైపు నడవండి.
🔹 30 నిమిషాలు లేదా అలసిపోయే వరకు ఇలా కొనసాగించండి.
🔹 చేతులను సహజంగా ఊపుతూ, వేగాన్ని సౌకర్యవంతంగా ఉంచుకోండి.
🔹 10-15 నిమిషాల పాటు ప్రారంభించండి క్రమంగా 30 నిముషాల వరకు సమయాన్ని పెంచుకోవచ్చు.