తమిళ నాడు లోని కుంభ కోణం క్షేత్రానికి అతి సమీపం లో నవగ్రహ దేవాలయాలున్నాయి వీటిని దర్శించి గ్రహ పీడ లను భక్తులు తొలగించు కొంటారు .ఈ ఆలయాలనే నవగ్రహ స్థలాలు అంటారు
సూర్య దేవాలయం
నికి 15 కి.మీ.దూరం లో సూర్య దేవాలయం ఉంది .ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్అన్న సూక్తి మనకు తెలిసిందే .రవి సంపద ప్రదాత కూడా .1100 వ సంవత్సరం లో కులోత్తుంగ చోళ మహారాజు సూర్య దేవాలయాన్ని నిర్మించాడు .ప్రతి ఏడాది పంటలు చేతికి వచ్చే జనవరి మాసం లో సూర్యునికి కృతజ్ఞతలు తెలియ జేసేందుకు విశేషమైన ఉత్సవాన్ని ఇక్కడ నిర్వహిస్తారు .తమిళం లో సూర్యనార్ కోవిల్ అని పిలుస్తారు .
చంద్ర దేవాలయం
తిన్గాలూర్ కోవిల్ అని పిలువ బడే చంద్ర దేవాలయదర్శనం సుఖాన్ని, దీర్ఘాయుస్సును ప్రసాదిస్తుందని నమ్మిక .సెప్టెంబర్–అక్టోబర్ మాసాలలో వచ్చే ‘’పురుట్టాసి ‘’,మార్చి –ఏప్రిల్ లలో వచ్చే ఫల్గుని నక్షత్ర సమయాలలో చంద్ర కాంతి ఇక్కడి ఆలయం లోని శివలింగం పై ప్రసరించటం విశేషం .జ్యోతిష్ శాస్త్ర ప్రకారం మానసిక ఒత్తిడి ,దుఖాన్ని తగ్గించే వాడు చంద్రుడని చెబుతారు ఈ ఆలయం తిరువైయార్ కు అయిదు కిలో మీటర్ల దూరం లో ఉంది ..
అంగారక స్థలం
తిరువైయార్ కు ఆరు కిలోమీటర్ల దూరం లో కుజ దేవాలయం ఉంది దేనికి ‘’వైతీశ్వరన్ కోవిల్’’అని పేరు .అనేక వ్యాధులను అంగారకుడు పోగోడతాడని విశ్వాసం .ధైర్యం విజయం శక్తికి అన్గారకుడే కారణం .ఇక్కడే జటాయువు, గరుడుడు ,సూర్యుడు అంగారకుని పూజించారని స్థల పురాణం . వివాహం ఆలస్యం అయితే అంగారక క్షేత్రాన్ని దర్శిస్తే వెంటనే పెండ్లి అవుతుంది .
బుధాలయం
కుజాలయానికి పది కిలోమీటర్ల దూరం లో బుధుని దేవాలయం ఉంది .ఇక్కడి స్వామి స్వేతారన్యేశ్వరుడు .అమ్మవారు బ్రహ్మ విద్యాంబికా దేవి .వాల్మీకి రామాయణం లో ఈ దేవాలయం గురించి ఉంది అని చెబుతారు .కనుక ఈ ఆలయం సుమారు 3000 ఏళ్ళనాటి పురాతన ఆలయం అని తెలుస్తోంది .మెర్క్యురి అనే బుధునికి సంబంధిన ఆలయం గా దీనిని భావిస్తారు .బుద్ధి, తెలివి తేటలను బుధుడు ప్రసాదిస్తాడు
బృహస్పతి దేవాలయం
కుంభ కోణానికి 18 కి.మీ దూరం లోఆలన్గుడి లో ఈ గురు దేవాలయం ఉంది ఇక్కడి స్వామిని అరన్యేశ్వర లింగం అంటారు .ఇది స్వయంభు లింగం దీనికే ఆబాత్స గయేశ్వర అని కూడా పేరు .అమ్మవారు ఉమా దేవి .దీన్ని గురుస్థాన ఆలయం గా భావిస్తారు .ఇక్కడ దక్షిణా మూర్తి స్వామి వారి ఆరాధన చేస్తారు .పార్వతి అమ్మవారు ఇక్కడి ఆలయం లోపలున్న అమృత పుష్కరిణి లో పునర్జనం పొందిందని కధనం .ఇక్కడే శివుని లో ఐక్యమైఁనదని చెబుతారు .
శుక్ర దేవాలయం
వీనస్ అని పిలువ బడే శుక్ర గ్రహానికి ఈ క్షేత్రం ప్రసిద్ధ మైనది .కంచానూర్ లో సూర్య దేవాలయానికి మూడు కిలో మీటర్లలో ఉంది దీనికే ‘’పలాశ వనం ,బ్రహ్మ పరి ,అగ్నిస్థలం అని కూడా పేర్లున్నాయి .‘’ఇక్కడే బ్రహ్మ దేవుడు పార్వతీ పరమేశ్వరుల వివాహాన్ని దర్శించాడట ..భార్యల ఆరోగ్యం కోసం భర్తలు ఇక్కడికి వచ్చి ప్రార్ధనలు చేస్తారు .
శని స్థలం
తిరునల్లార్ లో శని స్థలం ఉంది .కుంభకోణానికి 53 కి.మీ.దూరం లో కరైకాల్ కు 5 కి.మీ దూరం లో ఈ ఆలయం ఉంది .శనికి అంకిత మైన దేవాలయం ఇదొక్కటే అని ఇక్కడి వారంటారు .లక్షాలాది భక్తులు శనిగ్రహానుగ్రహం కోసం ఇక్కడికి వచ్చి పూజలు నిర్వర్తిస్తారు .ఇక్కడే నల మహా రాజును శని పట్టుకొని పీడించటం ప్రారంభించాడని కధ. .ఇక్కడి ‘’నల తీర్ధం ‘’చాలా మహిమ కలిగింది ఇందులో స్నానం చేస్తే పాపాలన్నీ కొట్టుకు పోతాయి
రాహుస్థలం
కుంభకోణానికి అయిదు కిలోమీటర్ల దూరం లో తిరు నంగేశ్వరం లో ఈ దేవాలయం ఉంది .ఇక్కడి శివుడు నాగ నాద స్వామి .అమ్మవారు ‘’గిరి గుజాంబికా దేవి’’ .ఇక్కడ ఆదిశేషుడు ,దక్షుడు ,కారకోటుడు రాహువుస్థలమైన ఈ శివుడిని అర్చించారు .
కేతు స్థలం
కీజ పేరుం పల్లం అనే చోట ‘’పూం పుహార్’’ కు రెండు కిలో మీటర్ల దూరం లో కేతు స్థలము ఉంది ఇక్కడి శివుడు మహా మహిమాన్వితుడు .రాహు కేతువులు జంట సర్పాకారం లో కలిసి ఉండి , క్షీర సాగర మధనం లో శివునికి సాయం చేశారని ప్రతీతి .ఈ ఆలయం కేతుగ్రహానికి అంకిత మైంది .