Adsense

Showing posts with label గడ్డం గీసుకునే బ్లేడు మధ్యలో. ఆ ఆకృతి ఎందుకు ఉంటుంది?. Show all posts
Showing posts with label గడ్డం గీసుకునే బ్లేడు మధ్యలో. ఆ ఆకృతి ఎందుకు ఉంటుంది?. Show all posts

Tuesday, December 10, 2024

గడ్డం గీసుకునే బ్లేడు మధ్యలో. ఆ ఆకృతి ఎందుకు ఉంటుంది?

1904 లో కింగ్ కాప్ జిల్లెట్ అనే ఆయన భద్రతా రేజర్ (safety razor) అనేదానిని కనుగొన్నాడు. పునర్వినియోగం కోసం పనికిరాని బ్లేడు, మంచి స్టీల్ తో కూడుకొన్న రేజర్.

హెన్రీ జె గైస్మెన్ అనే ఆయనకు కింగ్ కాప్ జిల్లెట్, బ్లేడ్ పేటెంట్ ల విషయం లో పెద్ద యుద్దమే జరిగింది. అదంతా వేరే కథ అనుకోండి. దానికి సమయం వచ్చినపుడు చెపుతాను

బ్లేడు ఈ ఆకారం లోనే ఎందుకు ఉంది ఆని చాలా మందికి ఉన్న ప్రశ్నే?

దానికి చాలా మంది చెప్పే సమాధానం , బ్లేడు ను సులభంగా రెండు ముక్కలు చేయడానికి వీలుగా,

కానీ అది తప్పు.

రేజర్ లోని స్క్రూ ను సమర్థవంతంగా పట్టి వుంచడం, పటిష్ఠమైన భద్రత కోసం ఇలా రూపకల్పన చేశారు.. ఇంకా బాగా అర్థం అవ్వడానికి ఈ క్రింద చిత్రం చూడండి.

1904 లో బ్లేడు ఆకారం ఇలా లేదు… దానికి ఎన్నో మార్పులు జరిగాయి. ఆ పరిణామ క్రమం కోసం కింద ఉన్న చిత్రాన్ని చూడండి.

ఇప్పుడంటే చాలా రకాల రేజర్ లు, ట్రిమ్మర్ లు వచ్చాయి, కానీ పాత రోజులలో స్టీల్ రేజర్ అంటే హోదాకు చిహ్నం. బాగా డబ్బు ఉన్న వాళ్ళే వాడేవారు. కొంత మంది బంగారం తో కూడా చేయించుకూనే వారని అని మా నాన్న గారు చేప్పే వారు. మా నాన్నగారు ఇత్తడి తో తయారు చేసిన లేజర్ ను వాడేవారు.

చిత్రాలు గూగుల్ నుంచి…*