Adsense

Showing posts with label గణపతిబప్పా మోరియా అంటే ఏమిటి ? గణపతి ముందు గుంజిలు ఎందుకు తీస్తారు ?. Show all posts
Showing posts with label గణపతిబప్పా మోరియా అంటే ఏమిటి ? గణపతి ముందు గుంజిలు ఎందుకు తీస్తారు ?. Show all posts

Monday, September 16, 2024

గణపతిబప్పా మోరియా అంటే ఏమిటి ? గణపతి ముందు గుంజిలు ఎందుకు తీస్తారు ?

వినాయక చవితి వేడకల్లో ‘గణపతి బప్పా మోరియా’ అంటూ నినదిస్తాం. కానీ *మోరియా* అనే మాటకు అర్ధం ఎవరికి తెలియదు. మరి *మోరియా* అనే మాట నినాదంగా ఎలా మారింది? ఆ పదానికి గల అర్థం ఏమిటి ? దాని వెనక ఉన్న అసలు కథ ఏమిటో తెలుసుకుందాం.

15వ శతాబ్దంలో ‘మోరియా గోసాని’ అనే సాధువు ఉండేవాడు. అతను మహారాష్ట్రాలోని పుణెకు 21 కి.మీ. దూరంలో చించ్ వాడి అనే గ్రామంలో నివసించేవాడు. ఆయన గణపతికి పరమ భక్తుడు. గణపతిని పూజించేందుకు చించ్ వాడి నుంచి మోరే గావ్ వరకు రోజూ కాలినడకన వెళ్లేవాడు. ఓ రోజు మోరియా నిద్రపోతున్న సమయంలో గణేశుడు కలలో కనిపించి.. సమీపంలో ఉన్న నదిలో తన విగ్రహం ఉందనీ.. దాన్ని తీసుకువచ్చి ప్రతిష్టించమని చెప్పాడట.. కలలో గణపతి చెప్పిన మాట నిజమో కాదో వెంటనే తెలుసుకోవడానికి మోరియా అక్కడున్న నదికి వెళ్లాడు. కలలో గణపతి చెప్పినట్టుగానే నదిలో మోరియాకు వినాయకుడి విగ్రహం దొరికింది.

ఈ విషయం తెలుసుకున్న స్థానికులు మోరియా గోసావి ఎంత గొప్పవాడు కాకపోతే సాక్షాత్తు వినాయకుడు కలలో కనిపిస్తాడు అంటూ.. మోరియాను చూసేందుకు తండోపతండాలుగా వచ్చారట. మోరియా గోసావి పాదాలను తాకి మోరియా అనటం మొదలుపెట్టారు.. మోరియా గోసావి నిజంగా మంగళమూర్తియే అంటూ మొక్కారట.. నది నుండి తెచ్చిన గణపతి ప్రతిమను తెచ్చి గుడిని నిర్మించాడు. *మోరియా* గొప్ప భక్తుడు అయ్యాడు కాబట్టి నాటి నుంచి గణపతి ఉత్సవాల్లో మోరియా గోసావి పేరు గణపతి ఉత్సవాల్లో బాగమైపోయింది.. ఆనాటి నుంచి *గణపతి బప్పా మోరియా*..అనే నినాదం నిర్విరామంగా వినబడుతూనే ఉంది.. భక్త వల్లభుడైన వినాయకుడి సేవలలో మోరియా గోసావి తరించిపోయాడు అందుకే నదిలో నిమజ్జనం చేసే ముందు *గణపతి బప్పా మోరియా పూడ్చ వర్సీ లౌకర్ యా*.. అని మరాఠీ లో నినదిస్తాం.. ఎందుకంటే గణపతి ప్రతిమ మోరియకు మహారాష్ట్రలోని పూణే సమీపంలో ప్రవహించే నదిలోనే దొరికింది కాబట్టి.. దేవుడు తన కార్యం ఏదైనా భక్తుల ధ్వారనే నెరవేర్చుకుంటాడు అనడానికి మోరియా గోసావి జీవిత కథనే నిదర్శనం.



నిత్యజీవితంలో ఎన్నో దోషాలు కలుగుతాయి . మనకు తెలియకుండానే మనము పాపాలు చేస్తూ ఉంటాము .దీనివలన మనము చేసే కార్యాలకు విఘ్న ములు

ఏర్పడతాయి. గణపతి విఘ్న నివారకుడని మన అందరికీ తెలుసు మనము చేసిన చేసిన తప్పు లకు ప్రాయశ్చిత్తముగా ఆయన ముందు గుంజీలు తీసి మన జీవితంలో ఉన్న ఆటంక ములను నివారించాలని కోరుకుంటాం. కాబట్టే గణపతి ముందు గుంజీలు తీసే సంప్రదాయం ఉన్నది.