తన గాన మాధుర్యంతో 15 భారతీయ భాషాల్లో గానం చేసి శ్రోతలను అలరించిన గాన గంధర్వుడు శ్రీ పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు. గాత్రంలో ఒక ప్రత్యేకతను, విశిష్టతను పొంది ఉండి నవరసాలు పండించిన అపురూప గాయకుడు వారు. 50 ఏళ్లకు పైగా సినీ ప్రస్థానం, 40 వేలకు పైగా పాటలు, 40 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించి ప్రపంచంలోనే ఒక అరుదైన రికార్డును సృష్టించి, తన పేరు లేకుండా భారతీయ సినీ చరిత్ర లేదు అని అనిపించుకోవడమే కాదు, భారత దేశమంతా అభిమానులను సంపాయించుకున్నారు. మరి నేడు ఆ గాన గంధర్వుడు శాశ్వతంగా ఈ భువి నుంచి కదిలి దివికి చేరుకున్నాడు...వారి ఆత్మకు శాంతిని ప్రసాదించమని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఇంత మహోన్నతమైన వక్తిని కోల్పోయిన వారి కుటుంబము వారి ఆదర్శలతో ముందుకు సాగాలని కోరుతూ, నా ప్రగాఢ సంతాపాన్ని తెలియచేస్తున్నాను.
తను గానం చేసిన మధురమైన పాటలతో ప్రతి తెలుగు వారి గుండెల్లో ఎప్పటికి నిలిసి ఉంటారని విశ్వసిస్తూ....
👏👏👏👏👏