Adsense

Showing posts with label చరిత్రలో ఈ రోజు ఆగస్ట్ - 03. Show all posts
Showing posts with label చరిత్రలో ఈ రోజు ఆగస్ట్ - 03. Show all posts

Thursday, August 3, 2023

చరిత్రలో ఈ రోజు ఆగస్ట్ - 03


సంఘటనలు:


1777: మిలన్ నగరంలో లా స్కాల ఒపేరా హౌస్నిప్రారంభించారు.

1858: విక్టోరియా సరస్సు (లేక్ విక్టోరియా), నైలు నదిమొదలు అయ్యే ప్రాంతం అని కనుగొన్నారు

1907: పోర్చుగల్లో ఆదివారం విశ్రాంతి దినంగా పేర్కొంటూ, రాజాజ్ఞ జారీ అయ్యింది.

1914: కొత్త పనామా కాలువ గుండా మొదటి ఓడ ప్రయాణించింది

1957: తుంకు అబ్దుల్ రహ్మాన్, స్వతంత్ర మలేషియా దేశానికి, దేశాధిపతిగా, 5 సంవత్సరాలకి ఎన్నికయ్యాడు.

1958: మొదటి అణు జలాంతర్గామి పేరు నాటిలస్అమెరికాకు చెందినది. ఇది మొదటిసారిగా, ఆర్కిటిక్ మహాసముద్రం నీటి అడుగునుంచి (నీటి లోపలి నుంచి), ప్రయాణం చేసి, ఉత్తర దృవాన్ని, దాటింది.

1978: ఇంగ్లాండ్ మహారాణి 11వ కామన్‌వెల్త్ గేమ్స్ని కెనడాలోని ఎడ్మంటన్ లో ప్రారంబింది.

1990: నెయిల్‌స్టోన్ వాతావరణ కేంద్రం (లీచెస్టర్ షైర్) మొదటిసారిగా, 37.1 సెంటిగ్రేడ్ (లేదా 99 ఫారెన్%హీట్) ఉష్ణోగ్రత ను, అత్యధిక ఉష్ణోగ్రతగా బ్రిటన్లో నమోదు చేసింది. 1911లో రికార్డు అయిన ఉష్ణోగ్రత కంటే, 1990లో 1 డిగ్రీ పారెన్‌హీట్ అధికంగా రికార్డు అయింది.

2003: అమెరికా లోని ఆంగ్లికన్ శాఖకు చెందిన, ఎపిస్కోపల్ ఛర్చ్, రెవరెండ్ జెనె రోబిన్సన్, అనే, హిజ్రా (కొజ్జా) ని బిషప్గానియమించింది. ఈ నియామకానికి, ప్రపంచవ్యాప్తంగా, మత పెద్దలు నిరసనలు తెలియచేసారు. 2003 ఆగష్టు 5 లో ఈ నియామకం అంగీకరించబడింది.

2008: హిమాచల్ ప్రదేశ్ లోని నైనాదేవి ఆలయంలో తొక్కిసలాట జరిగి 145 మంది భక్తులు మృతి చెందారు.

జననాలు:

1656: కాకునూరి అప్పకవి, తెలుగు లాక్షణిక కవి. 'ఆంధ్రశబ్ద చింతామణి ' ఆధారంగా 'ఆంధ్రశబ్దచింతామణి ' అను ఛందో గ్రంథానికి రచయిత.

1886: మైథిలీ శరణ్ గుప్త, హిందీ రచయిత (మ.1964)

1913: శ్రీపాద పినాకపాణి, శాస్త్రీయ సంగీత విద్వాంసుడు, వైద్యరంగంలో నిష్ణాతుడు. (మ.2013)

1921: లావు బాలగంగాధరరావు, భారత కమ్యూనిస్టు పార్టీ - మార్క్సిస్టు నాయకుడు. (మ.2003)

1931: సూరి బాలకృష్ణ, భూ భౌతిక శాస్త్ర శాస్త్రవేత్త (మ.1984)..

1948: వాణిశ్రీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినినటి.

1956: టి. మీనాకుమారి, న్యాయవాది. మేఘాలయ రాష్టానికి చెందిన తొలి ప్రధాన న్యాయమూర్తి.

మరణాలు:

2008: పువ్వుల లక్ష్మీకాంతం, తొలితరం సినిమా నటి, గాయని, నర్తకీమణి, రంగస్థల నటి.

2011: వేగుంట మోహనప్రసాద్, కవి, రచయిత. (జ.1942)

2013: ప్రియంవద, తెలంగాణ సాయుధ పోరాటయోధురాలు. (జ.1928)

2013: ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డి, మాజీ మంత్రి, రాజకీయ కురువృద్దుడు. (జ.1933)

2017 : జీడిపల్లి విఠల్ రెడ్డి, స్వాతంత్ర్య సమరయోధుడు. కామారెడ్డి శాసనసభ నియోజకవర్గ తొలి శాసనసభ్యుడు.

దినోత్సవాలు: 
 తల్లిపాల వారోత్సవాలు తెలంగాణ / ఆంధ్రప్రదేశ్ లో వారం రోజులు జరుగుతాయి (1 ఆగష్టు నుంచి 7 ఆగష్టు వరకు)

 1811: వెనెజుల దేశపు జెండా దినము. ( 1806 సంవత్సరం నుంచి, మార్చి నెల 12 వ తేదిన జరిపుకునేవారు) .

 1960: నైగర్ దేశపు స్వాతంత్ర్యదినోత్సవము.