Adsense

Showing posts with label చరిత్రలో ఈరోజు (సెప్టెంబర్ 26). Show all posts
Showing posts with label చరిత్రలో ఈరోజు (సెప్టెంబర్ 26). Show all posts

Saturday, September 26, 2020

చరిత్రలో ఈరోజు (సెప్టెంబర్ 26)

సంఘటనలు
2018 - కామన్వెల్త్ క్రీడల్లో షూటింగ్ విభాగంలో బంగారు పతకం సాధించిన తొలి పిన్నవయస్కుడు అనీష్‌ భన్వాలా.

జననాలు..
1820: ఈశ్వరచంద్ర విద్యాసాగర్‌, బెంగాలీ కవి, విద్యావేత్త, తత్త్వవేత్త, పారిశ్రామిక వేత్త, రచయిత, అనువాదకుడు, సమాజ సేవకుడు. (మ.1891)
1829: లెవీ స్ట్రాస్, అమెరికా పారిశ్రామికవేత్త. (మ.1902)
1867: చిలకమర్తి లక్ష్మీనరసింహం, తెలుగు రచయిత. (మ.1946)
1899: ఎన్.ఎం.జయసూర్య, హోమియోపతీ వైద్యుడు, సరోజినీ నాయుడు కుమారుడు. (మ.1964)
1906: కాట్రగడ్డ బాలకృష్ణ, అసాధారణ మేధావి. (మ.1948)
1907: ఆమంచర్ల గోపాలరావు, స్వాతంత్ర్య సమరయోధుడు, చరిత్రకారుడు, చలనచిత్ర దర్శకుడు. (మ.1969)
1912: కొండూరు వీరరాఘవాచార్యులు తెలుగు సాహితీవేత్త, పండితుడు (మ.1995)
1923: దేవానంద్, హిందీ చలనచిత్ర నటుడు. (మ.2011)
1932: 13వ భారత ప్రధాని మన్మోహన్ సింగ్. పుట్టిన చోటు పంజాబ్ లోని గాహ్ (ఇప్పుడు చక్వాల్ జిల్లా, పాకిస్తాన్లో ఉంది). ఎక్కువకాలం, ప్రధాని పదవిలో ఉన్న మూడవ ప్రధాని 2639 రోజులు). (మొదటి ప్రధాని 6130 రోజులు. రెండవ ప్రధాని 5829 రోజులు).
1949: డా. దివాకర్, రోగాలకు మందులేయాల్సిన మనిషి రంగస్థలం తన నివాసమన్నాడు. నాడి పట్టుకోవలసిన వైద్యుడు నాటకాల్లో వేషాలకే ప్రాధాన్యత ఇచ్చాడు.
1960: గస్ లోగీ, వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు.

మరణాలు
1947: బంకుపల్లె మల్లయ్యశాస్త్రి, సంఘసంస్కర్త, రచయిత, పండితుడు (జ.1876)
1966: అట్లూరి పిచ్చేశ్వర రావు, కథకుడు, అనువాదకుడు, నవలా రచయిత, సాహిత్యవేత్త. (జ.1925)
1999: పి. సుదర్శన్ రెడ్డి, నిజాం పాలన వ్యతిరేక ఉద్యమకారుడు, స్వాతంత్ర్య సమరయోధుడు.
2008: పాల్ న్యూమాన్, అమెరికన్ నటుడు, చిత్ర దర్శకుడు, సాహసికుడు, మానవతావాది. (జ.1925)

జాతీయ దినాలు
-ఈక్వెడార్ జాతీయ పతాక దినోత్సవం.
-యెమెన్ రెవల్యూషన్ డే.
-చెవిటి వారి దినోత్సవం