Adsense

Showing posts with label తలమీద ఎక్కువ దోమలు తిరుగుతాయి ఎందుకు కారణం ఏమిటి?. Show all posts
Showing posts with label తలమీద ఎక్కువ దోమలు తిరుగుతాయి ఎందుకు కారణం ఏమిటి?. Show all posts

Sunday, September 22, 2024

తలమీద ఎక్కువ దోమలు తిరుగుతాయి ఎందుకు కారణం ఏమిటి?

ఏదైనా పార్క్ కు లేదా, దోమలు ఎక్కువ ఉన్న ప్రదేశంలో సాయంత్రం వేళ..కేవలం తలపైనే దోమలు తిరుగుతాయి. ఇలా తలమీద రౌండ్ గాఈ దోమలు ఎందుకు తిరుగుతాయ్ ?

🍀. కార్బన్ డయాక్సైడ్….. మనం శ్వాసించే గాలిలో ఉండే కార్బన్ డయాక్సైడ్ దోమలకు ఆకర్షణీయంగా ఉంటుంది.

🍀. వెచ్చదనం….. మన తలలు మిగిలిన శరీరం కంటే వేడిగా ఉండటం వలన దోమలు వాటి వైపు ఆకర్షితమవుతాయి.

🍀. చెమట…. చెమటలో ఉండే లాక్టిక్ యాసిడ్ దోమలకు ఆకర్షణీయంగా ఉంటుంది.

🍀. జుట్టు….దట్టమైన నల్లటిజుట్టు దోమలకు దాగడానికి మంచి ప్రదేశం.

🍀. పరిమళాలు…. తలకు రాసుకొనే షాంపూ, సుగంధ ద్రవ్యాలు మరియు ఇతర సౌందర్య సాధనాల వంటి పరిమళాలు దోమలను ఆకర్షిస్తాయి.

🍀. రక్త ప్రవాహం….మన తలలో రక్త ప్రవాహం ఎక్కువగా ఉంటుంది, దీని వల్ల దోమలకు రక్తాన్ని గుర్తించడం సులభం అవుతుంది.

🍀. సమయం… సాయంత్రం మరియు తెల్లవారుజాము సమయాల్లో దోమలు చాలా చురుగ్గా ఉంటాయి.