Adsense

Showing posts with label నువ్వుల పొడితో చింతపండు పులిహోర Nuvvua podi chintapandu pulihora. Show all posts
Showing posts with label నువ్వుల పొడితో చింతపండు పులిహోర Nuvvua podi chintapandu pulihora. Show all posts

Monday, May 1, 2023

నువ్వుల పొడితో చింతపండు పులిహోర Nuvvua podi chintapandu pulihora

నువ్వుల పొడితో చింతపండు   పులిహోర Nuvvua podi chintapandu pulihora

కావలసినవి .

చింతపండు   --  75 గ్రాములు  గింజలను  తీసుకుని గ్లాసున్నర  వేడినీటిలో  పదిహేను నిముషములు  నానబెట్టుకోవాలి .

తదుపరి  వేరే గిన్నెలో  చిక్కగా రసం తీసుకోవాలి .

నువ్వు పప్పు  --  75 గ్రాములు.
నూనె  వేయకుండా  నాలుగు  ఎండుమిరపకాయలు వేసి  బాండిలో  వేయించుకుని  ఆ తర్వాత మిక్సీ లో  మెత్తగా  పొడి వేసుకోవాలి .

ఈ పొడి  విడిగా  ఉంచుకోవాలి .

పచ్చిమిర్చి   --  పది . తొడిమలు తీసుకుని  ఉంచుకోవాలి .
కరివేపాకు   --  ఎనిమిది   రెమ్మలు .
బియ్యము   --  ఒకటిన్నర   గ్లాసుడు .
నూనె   ---  75  గ్రాములు .

పోపుకు .

ఎండుమిరపకాయలు   --  పది
పచ్చి శనగపప్పు   --  మూడు స్పూన్లు
మినపప్పు   --  రెండు  స్పూన్లు
ఆవాలు  --  స్పూను
పల్లీలు  ---  అయిదు స్పూన్లు
జీడిపప్పు  -  పన్నెండు
ఇంగువ  --  పావు  స్పూను .
నూనె  ---   50  గ్రాములు.

తయారీ  విధానము .

ముందుగా  గిన్నెలో  గ్లాసున్నర  బియ్యము   సరిపడా  నీళ్ళు పోసి  స్టౌ  మీద  పెట్టుకొని పొడిగా  వండుకోవాలి  .

అన్నం  ఉడికే  లోపున

స్టౌ  మీద  బాండి  పెట్టి  ఓ 50 గ్రాముల  నూనె  వేసి  , నూనె  బాగా  కాగగానే   వరుసగా ఎండుమిరపకాయలు , పచ్చి  శనగపప్పు , మినపప్పు , ఆవాలు , ఇంగువ, పచ్చిమిరపకాయలు , కరివేపాకు , వేరుశనగ గుళ్ళు మరియు జీడిపప్పు వేసి  పోపు బాగా వేయించుకోవాలి.

వేగుతున్నప్పుడే     చింతపండు రసము , తగినంత  ఉప్పు మరియు కొద్దిగా  పసుపు వేసి బాగా  ఉడకనివ్వాలి .

తర్వాత  బేసిన్  లో  ఉడికిన  అన్నం  , స్పూను  పసుపు , కరివేపాకు , అర గరిటెడు  నూనె , కొద్దిగా   ఉప్పు  మరియు  ముందుగా  సిద్ధం  చేసుకున్న పోపు లో ఉడికిన చింతపండు  రసము  అన్నములో   వేసి  గరిటతో అన్నం  అంతా   పొడి  పొడిగా   కలుపు కోవాలి .

చివరగా ముందుగా  సిద్ధంగా  ఉంచుకున్న  నువ్వుపప్పు  పొడి కూడా వేసుకుని  బాగా కలుపుకోవాలి .

అంతే  చింతపండుతో నువ్వుల పొడి  , ఇంగువ  సువాసనలతో  నోరూరించే  పులిహోర  మీకు  సర్వింగ్   కు  సిద్ధం .