Adsense

Showing posts with label పిల్లలపెంపకం విషయంలో రామాయణం ఏం చెపుతున్నది?. Show all posts
Showing posts with label పిల్లలపెంపకం విషయంలో రామాయణం ఏం చెపుతున్నది?. Show all posts

Saturday, March 23, 2024

పిల్లలపెంపకం విషయంలో రామాయణం ఏం చెపుతున్నది?

శ్రీ రాముడు సీతాదేవి నగలను లక్ష్మణుడికి చూపించి “ఇవి మీ వొదిన కేయూరాలేగదా!   ఒక్కసారి నువ్వు కూడా గురుతు పట్టు” అంటే అప్పుడు లక్ష్మణస్వామి అంటారు కదా ....
"నాహం జానామి కేయురే           
నాహం జానామి కుండలే           
నూపురే త్వభి జానామి           
నిత్యం పాదాభివందనాత్"
.
దీనర్ధం ఏమిటంటే.. “ఓ అన్నా!వదినగారు భుజానికి పెట్టుకునే కేయూరాలుగానీ గానీ, చెవులకు పెట్టుకునే కుండలాలు గాని నే నెరుగను, కానీ  ఆవిడ పాదాలకు పెట్టుకునే నూపురాలను మాత్రం గుర్తు పట్టగలను. ఎందుకంటే ఆ తల్లి పాదాలకు నిత్యం నమస్కారం చేస్తాను కాబట్టి!”

పరస్త్రీని కన్నులెత్తి చూడని సంస్కారం

అసలు ఆడువారి ముఖంలో ముఖంపెట్టి కళ్ళలోకి సూటిగా చూస్తూ ఎందుకు మాట్లాడాలి ?

ఈవిధమైన శీల సంపద లక్ష్మణుడికి ఎక్కడనుండి వచ్చింది ?

తల్లి సుమిత్రాదేవి పెంపకం!!

రాముడితో అడవికి వెళ్ళేటప్పుడు        ఆ మహాతల్లి కొడుకుకు ఏమని చెపుతుందో తెలుసా !

"రామం దశరధం విధ్ధి,
మాం విధ్ధి జనకాత్మజాం,
అయొధ్యాం అటవీం విధ్ధి
గచ్చ తాత యధాసుఖం"

రాముణ్ణి దశరధుడనుకో,
సీతను నన్ననుకో!
అడవిని అయొధ్య అనుకో
హాయిగా వెళ్ళిరా నాన్నా!

ఇంత సంస్కారమున్న తల్లి పెంచింది కాబట్టే  లక్ష్మణుడు అంత శీలవంతుడయ్యాడు.
చీరతొలగి మత్తులో ఉన్న తారతో మాట్లాడవలసివచ్చినప్పుడు... తలవంచుకుని మాట్లాడిన అద్భుత శీలసౌందర్యం లక్ష్మణస్వామిది!

నేడు ప్రతి తల్లి  తెలుసుకోవలసిన సత్యం ఇది కాదా !

పిల్లలను ఈవిధంగా పెంచితే దేశంలో ఏ ఆడబిడ్డయినా ఎందుకు బాధపడుతుంది?
నిర్భయ లాంటి ఘటనలు ఎందుకు చోటు చేసు కుంటాయి?  బంగారుతల్లుల జీవితాలు ఎందుకు చిదిమి వేయబడతాయి ?
రామాయణం, రామకధలు విరివిగా ప్రచారం చేయండి !

పరస్త్రీని ఇష్టం లేకుండా చెరబడితే దండన ఏదో ! స్త్రీలతో ఎలామెలగాలో అన్నీ తెలుస్తాయి !
.          సర్వం శ్రీకృష్ణార్పణమస్తు!
                       

లోకా సమస్తా సుఖినోభవన్తు!