Adsense

Showing posts with label బాల్కనీలో తమలపాకు... Show all posts
Showing posts with label బాల్కనీలో తమలపాకు... Show all posts

Wednesday, April 10, 2024

బాల్కనీలో తమలపాకు..


జీర్ణశక్తి మెరుగుపరిచే ఔషధగుణాలున్న తమలపాకును పెరట్లో లేదా బాల్కనీలో పెంచుకోవచ్చు. తగు జాగ్రత్తలు పాటిస్తే పచ్చని తమలపాకు మీకెదురుగా ఉంటుంది. తమలపాకు మొక్కను పెంచుకోవడానికి పెరట్లో చోటులేనప్పుడు బాల్కనీలో తొట్టెలో నాటొచ్చు. రోజంతా ఎండ పడే ప్రాంతంలో కాకుండా ఉదయం లేదా సాయంత్రం రెండుగంటలపాడు నీరెండ పడేలా ఉంటే ఈ మొక్క ఏపుగా ఎదుగుతుంది. తీవ్రమైన ఎండ వేడిని, పొడి
వాతావరణాన్ని ఇది తట్టుకోలేదు. దీనికి పెద్ద తొట్టెను ఎంచుకోవాలి. లేదంటే ఎరువులుగా కలిసి ఉండేలా చూడాలి. మట్టి గుల్లగా, తొట్టెలో తేమ దూరం కాకుండా జాగ్రత్తపడాలి. రోజూ నీటిని అందించాలి. అలాగని నీరు ఎక్కువగా నిల్వ ఉండకూడదు. లేదంటే ఫంగస్ చేరే ప్రమాదం ఉంది. తొట్టె లడుగున రెండు మూడు రంధ్రాలు చేస్తే, అదనపు నీరు బయటకు పోతుంటుంది. తొట్టె మధ్యలో మొక్క పాకడానికి వీలుగా మాస్సిక్ తప్పనిసరి. నాటిన మూడునాలుగు వారాల్లో కొత్తచిగుర్లతో నవనవలాడుతూ గుబురుగా ఎదగడం ప్రారంభమవుతుంది. హైడ్రోజన్ ఎక్కువ శాతం ఉండే ఎరువు ఈ మొక్కకు అవసరం. రసాయన ఎరువుల జోలికి వెళ్లకపోవడం మంచిది. మూడు నెలలకొకసారి ఆవుపేడ, ఆకులు వంటి వాటితో తయారుచేసే సేంద్రియ ఎరువులను అందించాలి. ఆకులపై చేరే చీడపురుగుల బెడద నివారణకు, ఎక్కువ నీటిలో తక్కువ సబ్బునీరు, వేపనూనె కలిపి ఆ మిశ్రమాన్ని చల్లితే చాలు. ఆకులు చెదపట్టినట్లు మారితే వాటిని గిల్లేసి దూరంగా పడేయాలి. అంటు కట్టొచ్చు... మొక్క నుంచి చిగుర్లున్న కొమ్మను కత్తిరించి విడిగా తీయాలి. చిగుర్లను మాత్రం ఉంచి, మిగతా ఆకులను తీసేసి నీటిని నింపిన గాజు గ్లాసులో ఉంచితే వారంలో కొమ్మకు వేర్లు మొదలవుతాయి. దీన్ని విడిగా తొట్టెలో ఉంచితే చాలు. అలాగే వేర్లున్న కణుపుల వద్ద ఒక కొమ్మను కత్తిరించాలి. భూమిలో వేర్లు ఉండేలా కొమ్మను వాలుగా పాతి, నీటిని అందిస్తే చాలు. మూడు నాలుగు వారాల్లో చిగురిస్తుంది. దీన్ని తీసి తొట్టెలో నాటుకోవచ్చు. మొక్క పొడవుగా పెరుగుతున్నప్పుడు చివర్లు కత్తిరించి వాటిని వేరే చోట నాటుతుంటే మొక్క అడుగుభాగాన కొత్త ఆకులు చిగురిస్తాయి.