Adsense

Showing posts with label రామనవమి నాడు మకుట ధారణ సర్గ. Show all posts
Showing posts with label రామనవమి నాడు మకుట ధారణ సర్గ. Show all posts

Thursday, March 30, 2023

రామనవమి నాడు మకుట ధారణ సర్గ

శ్రీ రామనవమి నాడు మకుట ధారణ సర్గ లేదా కనీసం మకుటధారణకు సంబంధించిన ఈ శ్లోకములనైనా పారాయణ చేయడం విధి.

శ్రీ వాల్మీకి రామాయణం - యుద్ధకాండ లోని పట్టాభిషేక సర్గ నుండి మకుట ధారణ ఘట్టానికి సంబంధించిన శ్లోకాలు(64 - 67)

బ్రహ్మణా నిర్మితం పూర్వం కిరీటం రత్నశోభితమ్
అభిషిక్తః పురా యేన మనుస్తం దీప్తతేజసమ్! 64
తస్యాన్వవాయే రాజానః క్రమాద్యేనాభిషేచితాః
సభాయాం హేమక్లుప్తాయాం శోభితాయాం మహాధనైః! 65
రత్నైర్నానావిధైశ్చైవ చిత్రితాయాం సుశోభనైః
నానారత్నమయే పీఠే కల్పయిత్వా యథావిధి! 66
కిరీటేన తతః పశ్చాద్వసిష్ఠేన మహాత్మనా
ఋత్విగ్భిర్భూషణైశ్చైవ సమయోక్ష్యత రాఘవః! 67

పూర్వము బ్రహ్మ నిర్మించిన రత్నమయమైన, తేజస్సుతో ప్రకాశించుచున్న కిరీటమును సభామధ్యములో ఉన్న వివిధరత్నములు పొదిగిన పీఠముపై యథావిధిగా ఉంచెను. పట్టాభిషేక సమయమునందు పూర్వము మనుచక్రవర్తి, తరవాత క్రమముగా ఆయన వంశమునకు చెందిన రాజులందరు ఆ కిరీటమును ధరించెడివారు. ఆ మహాసభా భవనము బంగారము చేత అలంకరింపబడెను, చాల విలువైన వస్తువులతో శోభించుచుండెను. అనేక విధములైన చాలా అందమైన రత్నములతో అది చిత్రవర్ణమై ఉండెను. పిదప రత్నపీఠముపై ఉంచిన ఆ కిరీటముని తీసి వసిష్ఠుడు రాముని శిరస్సుపై అలంకరించెను. అనంతరము ఋత్విక్కులు రామునకు ఇతరాలంకారములు అలంకరించిరి