Adsense

Showing posts with label రామనాథ స్వామి దేవాలయం. Show all posts
Showing posts with label రామనాథ స్వామి దేవాలయం. Show all posts

Saturday, September 26, 2020

రామనాథ స్వామి దేవాలయం, రామేశ్వరం ద్వీపం, తమిళనాడు

రామనాథ స్వామి దేవాలయం భారత దేశంలోని తమిళనాడుకు చెందిన రామేశ్వరం ద్వీపంలో ఉన్న ప్రసిద్ధ హిందూ శైవ క్షేత్రం. ఇది 275 పాడల్ పేత్ర స్థలములలో ఒకటి. దీనిని ప్రసిద్ధ భక్తులైన "నాయనార్లు", అప్పార్లు, సుందరార్లు అంరియు తిరుగ్నాన సంబందార్లు తమ కీర్తనలతో ఆ దేవాలయ మహిమలను కీర్తించారు. ఈ దేవాలయం 12 వ శతాబ్దంలో పాండ్య రాజ్యంలో విస్తరింపబడింది. ఈ దేవాలయ ముఖ్య విగ్రహాలు జఫాన రాజ్యానికి చెందిన జయవీర చింకైరియన్, ఆయన తర్వాత వారైన గుణవీర చింకైయన్ లచే పునరుద్ధరింపబడింది. ఈ దేవాలయం మిగిలిన భారతదేశంలోని హిందూ దేవాలయాల కంటే అతిపెద్ద వరండా కలిగియుంది.ఈ దేవాలయం రామేశ్వరం అనే ద్వీప పట్టణంలో ఉంది. ఇది శైవులకు, వైష్ణవులకు, స్మార్థులకు ప్రసిద్ధ క్షేత్రంగా భాసిల్లినది. ఈ దేవాలయం 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. ఈ దేవాలయంలో శివుడు "జ్యోతిర్లింగం"గా కొలువబడుతున్నాడు. "జ్యోతిర్లింగం" అనగా దీప స్తంభం అని అర్థం.
రామనాథ స్వామి దేవాలయంరామనాథ స్వామి దేవాలయం
తమిళనాడు రాష్ట్రంలో దేవాలయ స్థానం
పేరు
ప్రధాన పేరు :
రామనాథస్వామి తిరుకోయిల్
ప్రదేశము
దేశం:
భారత దేశము
రాష్ట్రం:
తమిళనాడు
జిల్లా:
రామనాథపురం జిల్లా
ప్రదేశం:
రామేశ్వరం
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:
రామనాథస్వామి (శివుడు)
నిర్మాణ శైలి, సంస్కృతి
వాస్తు శిల్ప శైలి :
ద్రావిడ నిర్మాణశైలి
ఇతిహాసం
సృష్టికర్త:
పాండ్య , జాఫ్న రాజులు

ఇతిహాసాల ప్రకారం రామాయణంలో రాముడు విష్ణువు యొక్క ఏడవ అవతారం. రామేశ్వరంలో శ్రీ రాముడు సేతువు నిర్మించి లంకాధి నేతైన రావణాసురుడు పరిపాలించిన లంకకు చేరాడు. ఇక్కడ రాముడు నిర్మించిన సేతువుని రామసేతువు అని పిలుస్తారు. రావణాసురిడిని నిహతుడిని చేశాక తనకి అంటిన బ్రహ్మ హత్యాపాతకం నిర్మూలించు కోవడం కొరకు రామేశ్వరము లింగ ప్రతిష్ఠ చేయాలను కుంటాడు రాముదు శివుణ్ణి కొలుచుటకు పెద్ద లింగాన్ని ప్రతిషించాలనుకొని హనుమంతుని హిమాలయాల నుండి లింగాన్ని తేవలసినదిగా ఆజ్ఞాపిస్తాడు. ఆయన తెచ్చే లోపుగానే కాలాతీతం అయినందున రాముని భార్య సీత చిన్న లింగాన్ని తయరుచేసి తెస్తుంది. ఈ లింగమే గోపురంలో కొలువ బడుతున్నదని నమ్మకం. ఈ లింగాన్ని రామనాథేశ్వర స్వామిగా ప్రతిష్ఠించాడు రాముడు. రామేశ్వరము శైవులకు, వైష్ణవులకు అత్యంత పవిత్ర స్థలము 

దేవాలయం గురించి సవరించు
ఈ దేవాలయ ప్రధాన దైవం "రామనాథస్వామి" (శివుడు). ఈ దైవం లింగాకారంలో ఉంటుంది.ఈ దేవాలయ గర్భగుడిలో రెండు లింగాలు ఉంటాయి. వాటిలో ఒకటి రాముని భార్య సీతమ్మవారు తయారుచేసిన ఇసుక లింగం, రెండవది హనుమంతుడు కైలాసము నుండి తెచ్చిన విశ్వలింగం.రాముడు "విశ్వలింగాన్ని" మొడట పూజించాలని సూచించాడు. ఆనాటి నుండి ఈ సాంప్రదాయం కొనసాగుతుంది.

దక్షిణ భారత దేశంలోని ప్రాచీన దేవాలయాల వలెనే ఈ దేవాలయానికి కూడా అతి పెద్ద ప్రహరీ గోడ నాలుగు వైపులా ఉంది. తూర్పు నుండి పశ్చిమ ప్రాకార గోడల మధ్య దూరము 865 అడుగులు, దక్షిణం నుండి ఉత్తర ప్రాకార గోడ ల మధ్య దూరము 657 అడుగులు. దేవాలయానికి నాలుగు దిక్కుల పెద్ద పెద్ద గాలి గోపురాలు ఉన్నాయి. ఈ దేవాలయం అంతరంలో పెద్ద వరండాలు కలిగి, మధ్యలో అధికంగా ఐదు అడుగుల పైన వేదికలపై భారీ మండపాలు ఉన్నాయి.

రెండవ కారిడార్ ఇసుకరాయి స్తంభాలు, దూలాలు, పైకప్పుతోనూ తయారైనది. మూడవ కారిడార్ యొక్క పశ్చిమ వైపు, పశ్చిమ గోపురం నుండి సేవుమాథవ విగ్రహానికి పోవు చదునైన మార్గం మధ్యలో ఒక ఏకైక నిర్మాణము చదరంగ బోర్డు వలె ఉంటుంది. ఇది "చొక్కట్టన్ మండపం"గా ప్రసిద్ధి చెందింది. ఇచట ఉత్సవ విగ్రహాలను వసంతోత్సవంలో ఉంచుతారు. రామనాథుని సేతుపతి చే నిర్వహింపబడుతున్న ముఖ్య పండగలైన అయిన ఆది (జూలై-ఆగష్టు) , మాసి (ఫిబ్రవరి-మార్చి) తర్వాత ఆరవ రోజున కూడా ఈ మండపంలోనే విగ్రహాలను ఉంచుతారు.

బయటి కారిడార్ సముదాయము 6.9 మీటర్లు ఎత్తు, 400 అడుగుల తూర్పు పడమరలకున్నూ , 640 అడుగులు ఉత్తర దక్షిణలకున్నౌ కలిగి ప్రపంచంలోనే పెద్దదిగా చరిత్ర సృష్టించింది. అంతర కారిడార్ 224 అడుగుల తూర్పు పడమరలకున్నూ, 352 అడుగులు ఉత్తర దక్షిణలకున్నూ విస్తరించి ఉంది.] వాటి వెడల్పు 15.5 అడుగుల నుండి 17 అడుగులు తూర్పు పడమరలకున్నూ , 14.5 నుండి 17 అడుగుల వెడల్పుతో 172 అడుగులు ఉత్తర దక్షిణాలకున్నూ విస్తరించి ఉంది.ఈ కారిడార్ల మొత్తం పొడవు 3850 మీటర్లు ఉంటుంది. అందులో సుమారు 1212 స్తంభాలు బయటి కారిడార్లో ఉంటాయి.వాటి ఎత్తు భూమినుండి పైకప్పు మధ్య భాగానికి సుమారు 30 అడుగులు ఉంటుంది. ముఖ్య గోపురం లేదా "రాజగోపురం: 53 మీటర్ల ఎత్తు ఉంటుంది. అనేక స్థాంబాలు వ్యక్తిగత కూర్పుతో చెక్కబడినాయి.

ఆలయ సముదాయంలో , రామేశ్వరం చుట్టూ గల విగ్రహాలు సవరించు
ఇచట రామనాథస్వామి , విశాలాక్షి దేవతల విగ్రహాలు విడివిడిగా ఉన్నాయి. ఇవి ఒక కారిడార్ తో వేరుచేయబడినాయి. ఇచట విశాలాక్షి,పర్వతవర్ధిని,ఉత్సవ విగ్రహం,శయన గృహం పెరుమాళ్, మొహానపతి విగ్రహాలు విడివిడిగా ఉన్నాయి. ఈ దేవాలయంలో వివిధ రకాల మండపాలు ఉన్నాయి. అవి అనుప్పు మండపం, సుక్రవార మండపం, సేతుపతి మండపం, కళ్యాణ మండపం , నంది మండపం. జ్యోతిర్లింగాలు.

దేవాలయ పుష్కరణి
రామేశ్వరం తీర్థములు
భారతదేశం లోని తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరం చుట్టూ గల ద్వీపాలలో 64 తీర్థాలు (పవిత్ర జల భాగాలు) ఉన్నాయి. స్కాంద పురాణం ప్రకారం, వాటిలో 24 ముఖ్యమైనవి. ఈ తీర్థాలలో స్నానమాచరించడం తపస్సుతో సమానంగా భావిస్తారు పర్యాటకులు. వాటిలో 22 తీర్థములు రామనాథస్వామి దేవాలయంలోనే ఉన్నవి. 22 అనే సఖ్య రాముని యొక్క అమ్ములపొదిలో గల 22 బాణములను సూచిస్తుంది.వాటిలో ప్రధాన తీర్థం "అగ్ని తీర్థం".