THE COMPLETE BLOG FOR PEOPLE // NEWS, DEVOTIONAL, TECHNOLOGY, LIFE STYLE, SPORTS, ENTERTAINMENT, SCIENCE, ONLINE EARNING, RIDDLES, SILLY QUESTIONS, IMPORTANT DAYS, BEAUTY TIPS, HEALTH
Adsense
Showing posts with label శ్దక్షిణామూర్తి నవరత్నమాలా స్తోత్రం. Show all posts
Showing posts with label శ్దక్షిణామూర్తి నవరత్నమాలా స్తోత్రం. Show all posts
Friday, March 31, 2023
శ్రీ దక్షిణామూర్తి నవరత్నమాలా స్తోత్రం
గురువు అనగా అజ్ఞానమును రూపుమాపి జ్ఞాన జ్యోతిని ప్రకాశింపజేసి ఆత్మోన్నతిని కలుగజేసేవాడు. అటువంటి గురువులకే గురువు, గురుశ్రేష్ఠుడూ దక్షిణామూర్తి.
ఎవరైతే ఆధ్యాత్మిక సాధనలో పరిపుష్టులో వారు మాత్రమే దక్షిణామూర్తి వైభవాన్ని తెలుసుకోగలరని ఆదిశంకరుల వాక్కు.
ఇది అది అని లౌకిక విషయాలు కాదు. ఆయన ఇవ్వలేని దంటూ ఏదీ లేదు.
ఏదైనా అపారంగా వర్షిస్తాడు.
పరమ కారుణ్యమూర్తి ఉపాసనాపరంగా మనల్ని వెంట ఉండి నడిపించే శక్తి ఆయన..
అయితే ఆయనను ఆరాధించే వారు ఎవరూ కూడా లౌకిక విషయాలు అడగలేరు. ఎందుకంటే ఆయన పాదాలను మనం పట్టే స్థితికి వచ్చాము అంటే మనకు లౌకిక విషయాల పట్ల కోరికలను కోరుకునే స్థితి ఉండదు.
అంతా నీ కృప స్వామి ఏది ఇచ్చినా నీవే. కాపాడినను నీవే, కష్టపెట్టినా నీవే.
అని నమ్మి అన్నింటినీ సాక్షి గా చూసే స్థితి ఉన్న వారే ఆయన అనుగ్రహానికి పాత్రులౌతారు.
అలాంటి దక్షిణామూర్తి స్తోత్రం మన ఉన్నతి కోసం.
ఆదిశంకరుల అనుగ్రహ విరచితం.
శ్రీ దక్షిణామూర్తి నవరత్నమాలికా స్తోత్రమ్
మూలేవటస్య మునిపుఙ్గవసేవ్యమానం ముద్రావిశేషముకులీకృతపాణిపద్మమ్ |
మన్దస్మితం మధురవేష ముదారమాద్యం తేజస్తదస్తు హృది మే తరుణేన్దుచూడమ్ ॥ 1॥
శాన్తం శారదచన్ద్ర కాన్తి ధవళం చన్ద్రాభిరమాననం చన్ద్రార్కోపమ కాన్తికుణ్డలధరం చన్ద్రావదా తాంశుకమ్ ।
వీణాపుస్తకమక్ష సూత్రవలయం వ్యాఖ్యానముద్రాంకరైర్బిభ్రాణం కలయే హృదా మమ సదా శాస్తారమిష్టార్థదమ్॥ 2॥
కర్పూరపాత్రమరవిన్దదళాయతాక్షం కర్పూరశీతలహృదం కరుణావిలాసమ్ ।
చన్ద్రార్ధశేఖరమనన్తగుణాభిరామ- మిన్ద్రాదిసేవ్యపదపఙ్కజమీశమీడే ॥ ౩॥
ద్యుద్రోధః స్వర్ణమయాసనస్థంముద్రోల్లసద్బాహుముదారకాయమ్ ।
సద్రోహిణీనాథ కళావతంసం భద్రోదధిం కఞ్చన చిన్తయామః ॥ 4 ॥
ఉద్యద్భాస్కరసన్నిభం త్రిణయనం శ్వేతాఙ్గరాగప్రభం బాలం మౌఞ్జిధరం ప్రసన్నవదనం న్యగ్రోధ మూలేస్థితమ్ ।
పిఙ్గాక్షం మృగశావకస్థితికరం* *సుబ్రహ్మసూత్రా కృతిమ్ భక్తానామభయప్రదం భయహరం శ్రీదక్షిణామూర్తికమ్ ॥ 5॥
శ్రీకాన్తద్రుహిణోపమన్యు తపన స్కన్దేన్ద్రనన్ద్యాదయః ప్రాచీనాగురవోఽపియస్య కరుణాలేశాద్గతా గౌరవమ్ ।
తం సర్వాదిగురుం మనోజ్ఞవపుషం మన్దస్మితాలఙ్కృతం చిన్ముద్రాకృతిముగ్ధపాణినళినం చిత్తం శివం కుర్మహే ॥ 6॥
కపర్దినం చన్ద్రకళావతంసం త్రిణేత్రమిన్దుపతి మాననోజ్వలమ్ ।
చతుర్భుజం జ్ఞానదమక్షసూత్ర-పుస్తాగ్నిహస్తం హృది భావయేచ్ఛివమ్ ॥ 7॥
వామోరూపరి సంస్థితాం గిరిసుతామన్యోన్యమాలింగితాం శ్యామాముత్పల ధారిణీ శశినిభాంచాలోకయన్తం శివమ్ ।
ఆశ్లిష్టేన కరేణ పుస్తకమధో కుంభం సుధాపూరితం ముద్రాం జ్ఞానమయీం దధానమపరైర్ముక్తాక్షమాలాం భజే॥ 8 ॥
వటతరునికట నివాసం పటుతరవిజ్ఞాన ముద్రితకరాబ్జమ్ ।
కఞ్చనదేశికమాద్యం కైవల్యానన్దకన్దళం వన్దే ॥ 9 ॥
ఇతి శ్రీ దక్షిణామూర్తి నవరత్నమాలా స్తోత్రం సమ్పూర్ణమ్ ॥
Subscribe to:
Posts (Atom)