సంతానం కలగన జంటకు ఉత్తమ పరిష్కారం మోపిదేవి సుబ్రహ్మణ్యస్వామి దర్శించటము.
మీ చుట్టుపక్కల ఉన్న పుట్ట దగ్గరకు వెళ్లి తొమ్మిది మంగళవారాలు ఆపైన మీ ఇష్టం మధ్యాహ్నం వరకు భోజనం చేయకుండా అక్కడ పూజ చేసి పుట్ట మట్టిని చెవులకు పెట్టుకొని రాత్రివేళ మంచం మీద కాకుండా కింద నిద్రించటం ఉత్తమం ఇలాంటి రోజున.
సంతానానికి సుబ్రహ్మణ్య స్వామికి ఉన్న సంబంధాన్ని శాస్త్రం ఏ విధంగా చెప్తుంది మీరు కింద చూడవచ్చు.
కుండలినీ శక్తికి ప్రతీకగా నాగేంద్రుని ఆరాధిస్తున్నాం. యోగ, మంత్ర శాస్త్రాలను పరిశీలిస్తే - శివశక్తాత్మకమైనది కుండలిని.
అది ఆరు చక్రాల నుండి ప్రసరించే చైతన్యం. ఇది 'షణ్ముఖస్వామి' గా దీపించే సర్పరూప చైతన్యం. పౌరాణికంగా కుమారస్వామి కొంతకాలం, ఒక 'వల్మీకం' లో సర్పరూపంగా తపస్సు చేసిన గాథ ఉంది.
తదాది ఆయనను సర్పంగా ఆరాధించడం సంప్రదాయమయ్యింది.
'సుష్ఠు బ్రహ్మణ్య' -
సుబ్రహ్మణ్య వేద మంత్రములన్నిటి చేత సుష్ఠుగా (పరిపూర్ణంగా) తెలియబడే పరతత్వం - 'సుబ్రహ్మణ్యుడు'. వేద, యజ్ఞ, తపో, జ్ఞానాలకు 'బ్రహ్మము' అని పేరు. వాటిని శోభనముగా (చక్కగా) రక్షించువాడు సుబ్రహ్మణ్యుడు అని అర్థం.
బ్రహ్మదేవుడు ఒకసారి సృష్టికర్తననే అహంతో కుమారస్వామిని చులకనగా చూశాడు. ఆ అహాన్ని పోగొట్టేందుకు శివతేజ స్వరూపుడైన స్వామి బ్రహ్మను బంధించాడు.
తిరిగి శివుని మాటపై విడిచిపెట్టాడు. బ్రహ్మ బంధితుడైన కొద్ది కాలం - భూకాలమాన ప్రకారం కొన్ని యుగాలు కుమారస్వామియే సృష్టిని నిర్వహించాడు.
తద్వారా బ్రహ్మలోని అహంకారం శమించింది. దాంతో స్వామిని శరణు వేడి గురువుగా భావించాడు.
శివాంకం పై కూర్చొని కుమారస్వామి బ్రహ్మకు ఉపదేశం చేసాడు. ఓంకారమే సుబ్రహ్మణ్యమనీ,
శివశక్త్యాత్మక పరబ్రహ్మ పరబ్రహ్మ స్వరూపమే తాననీ ఈ అర్థమే 'సుబ్రహ్మణ్యనామం'లో ఉందని వివరించాడు. ఈ విషయాన్ని శివుడు కూడా ఉపదేశం పొందాడు. కుమారస్వామి శివునకు అభిన్నుడు.
శివాంకం సమారుహ్య
సత్పీఠకల్పం
విరించాయ మంత్రోపదేశం చ కార॥ - అని ఈ ఘట్టాన్ని వివరించారు.
దీనిని బట్టి గురువు స్థానంలో ఉన్న కుమారస్వామి ప్రతిరూపమే సుబ్రహ్మణ్యస్వామి కావున సంతానానికి ఈయన ఆదిదేవతగా గుర్తించవచ్చు.
- సేకరణ