Adsense

Showing posts with label సన్ స్క్రీన్ పిల్ వల్ల ఉపయోగాలు ఏంటీ?. Show all posts
Showing posts with label సన్ స్క్రీన్ పిల్ వల్ల ఉపయోగాలు ఏంటీ?. Show all posts

Wednesday, October 16, 2024

'సన్ స్క్రీన్ పిల్' వల్ల ఉపయోగాలు ఏంటీ?


ఎండ నుంచి చర్మాన్ని రక్షించుకోవడం కోసం సన్ స్క్రీన్ లోషన్ రాస్తుంటాం. సమస్యల్లా బయటికి వెళ్లిన ప్రతి సారీ తిరిగి రాయాల్సి రావడమే! ఈ ఇబ్బంది నుంచి తప్పించుకోవడా నికి కొందరు 'సన్ స్క్రీన్ పిల్'ను వాడుతున్నారు. ఇంతకీ ఇదేంటి? వేసుకుంటే క్రీమ్ల అవసరం ఉండదా? తెలుసుకుందాం రండి.

ఓరల్ సన్ఇన్... ఇవీ మనం సాధారణంగా తీసుకునే సప్లిమెంట్ల లాంటివే. వీటిల్లో విట మిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి యూవీ కిరణాల నుంచి చర్మానికి రక్షణ కలిగిస్తాయి. వీటిల్లోని పాలి పోడియం లూకొటమీస్ ఎండకి చర్మం ఎర్రబ డటం, కణాలు దెబ్బతినడాన్ని ఆపగలదట. యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీరాడికల్స్ పోరాడ టమే కాదు చర్మకణాల ఆరోగ్యాన్ని సంరక్షి స్తాయి. దీంతో వృద్ధాప్యఛాయలు దరి చేరవు. క్యాన్సర్ ముప్పూ తగ్గుతుంది.

ఇక క్రీముల అవసరం ఉండదా... అంటే సమాధానం కష్టమే. ఎందుకంటే... ఈ పిల్స్ శరీరం మొత్తానికి కావాల్సిన సంరక్షణ ఇస్తా యన్న మాట వాస్తవమే అయినా సన్ స్క్రీన్ లోషన్నీ రాయకతప్పదు. కాకపోతే పదే పదే రాయాల్సిన శ్రమ మాత్రం తగ్గుతుంది. అలాగే, మార్కెట్లో దొరుకుతున్నా వీటికి ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఇంకా అనుమతులు రాలేదు. కాబట్టి, దొరుకుతు న్నాయి కదా అని వేసుకోవద్దనేది నిపుణుల సలహా. పైగా వీటిని కొన్నిరోజులే వాడాలి. దీర్ఘకాలం తీసుకుంటే కొత్త సమస్యలు ఎదుర వొచ్చు. కాబట్టి, వైద్యుల అనుమతితో వారు సూచించిన పరిమాణంలో వేసుకుంటేనే మేలు. వారైతే రోజులో ఎంత సేపు ఎండలో ఉంటారు? చర్మ తాజా పరిస్థితి, ఇతర అనా రోగ్యాలేమైనా ఉన్నాయా వంటివి గమనించి, సిఫారసు చేస్తారు. అప్పుడు సమస్య ఉండదు.

సమయం ఆదా అవుతుంది అని చాలా మంది వీటివైపు మొగ్గు చూపుతున్నారు. తయారీ సంస్థలూ ఇవి మేలు చేస్తాయని సూచించినా లోషన్లకు ఈ పిల్స్ ప్రత్యా మ్నాయం మాత్రం కాదు. వీటిని అదనపు రక్షణగా మాత్రమే గుర్తిస్తున్నారు నిపుణులు.