సింగాడాలు (Water Chestnuts) దుంపజాతిలా కనిపించే కాయలు. ఈ కాయలు నీటిలో కాస్తాయి. నలుపుగా వుండి చూడటానికి చిన్న చిన్న గబ్బిలాలులా కనిపిస్తాయి. ఒక్కొక్క కాయ చిన్న సమోసా పరిమాణంలో వుంటుంది. వీటిని పచ్చిగా కాని, ఉడకబెట్టుకొని లేదా కూర వండుకొని గాని తింటారు. పైన నల్లని మందమైన పొరను తీసి దుంప వంటి భాగాన్ని తింటారు. పోషకాలు, ఖనిజలవణాలు పుష్కలంగా లభ్యమయ్యే వీటివలన శరీరానికి చలువ చేస్తుంది. శరీర పుష్టికి ,బీపీ,ఎసిడిటీ వంటి రుగ్మతలకు మందుగా పనిచేస్తుంది. ఉత్తర భారతదేశంలో విరివిగా శీతకాలం ప్రారంభం నుండి ఇవి దొరుకుతాయి. హైదరాబాద్, వరంగల్ ప్రాంతాలలో వీటి వాడకం ఎక్కువ.
చిత్రాలలో సింగాడా ఆకారాన్ని చూడవచ్చు.