1. "ఎప్పటికైనా నీకాళ్లమీద నీవు నిలవబడడం నేర్చుకో” దీనినే భగవద్గీతలో " ఉద్ధరేదాత్మ నాత్మానం” అన్నారు.
2. పట్టుదల వుంటే ఏ పనీ కాకపోదు అందుకే పెద్దలు "కృషితో నాస్తి దుర్భిక్షమ్" అన్నారు.
3. "నీవు సుఖపడి ఒకళ్లను సుఖపెట్టడమే పరమ ధర్మం” స్వయంతీర్వా పరాంస్తారయేత్" అంటే ఇదేకదా!
4. "నీలాగా ఒకరిని చూచుకో అందులో చాలా సుఖం ఉన్నది?" "ఆత్మ వత్సర్వభూతాని యళ్ళ పశ్యతి” అనే భగవద్గీతా వాక్యంకూడా ఇదే చెపుతూంది,
5. " అంతరాత్మ మంచిదే అని చెబుతూన్నపుడు ఆ పని చెయ్యటంలో సందేహించకు భగవంతు డనే వాడుంటే ఆపని న్యాయబద్ధమైనపుడు నిన్నూ నీపనినీ ఎందు కాశీర్వదించడు!" గౌతమ బుద్ధుని ఆజీవిత ప్రభోదం ఇదే అని ఇప్పటికి మనం తెలుసుకోగల్గితే సంతోషమే.
6. మనస్సులో ఒకటి తలిచి పైకి ఒకటి చెయ్యకు అంతరాత్మను మోసం చెయ్యకుండా మానసిక సంకల్పాన్ని ఆచరణలో పెట్టడమే పరాయణము, "మనసా కాయేనా వాచా సమానోభవ' అనే ఆచా ర్యుల వాక్యమే ఇందుకు ప్రమాణం,
7. "ఏదైనా మంచిదని తోచినపుడు వెంటనే చెయ్యి, ఆలస్యం కూడదు" "భుభశ్య శీఘ్రం" అని మన పెద్దలు అందుకే చెప్పారు.
8. “ఒక్కొక్కపుడు ఆలోచనకంటే ఆచరణలో విజయం ఉంటుందని గమనించు” “ధైర్యే సాహ・శ్రీః" అని ఊరికే అన్నారా!
9. "సంతృప్తికిమించిన వస్తు నీ ప్రపంచంలో లేదు. సంతుష్టుడీ మూడు జగముల బూజ్యుండు" అని భాగవతం ప్రమాణం పల్కుతుంది.
10. కష్టం అనేది ఈశ్వరప్రసాదం, కష్టం వచ్చినపుడు నిన్ను నీవుకాని, ఒరులను కాని నిందించకు. కష్టసమాయాలలో పట్టుదలతో నిలువబడు. అపుడే విజయానికి అర్హుడవౌతావు” “కష్ట్ ఫలీ'” అనేవాక్యం ఊరికే పుట్టిందా మఱి!
11. కష్ట సుఖాల్లో ఒక్క విధంగా ఉండగల్గడం ప్రయత్నించైనా నేర్చుకో "యః - సుఖదుః భేషు సమస్సంగ వివర్ణిత:... మేప్రియోన్నర:'' అని కృష్ణ పరమాత్మ సెలవిచ్చారు.
12. "పని చెయ్యడమే నీవంతు ఫలాఫలాలు దేవునిమీద వదులు. ఫల సంగము దుఃఖ హేతువు" "కర్మణ్యే వాధికారస్తే మాఫలేషు కదాచన” అని అధికారిక వచనం చెప్పేదికూడా ఈఉత్కృష్టధర్మాన్నే,
13. అపజయమే విజయసౌధానికి బాట. ఆ అపజయానికి వెరువక అభివృద్ధి పదంలో ముందుకు సాగిపోవుటే ధీమంతుల లక్షణం. అటువంటివారే ఎప్పటికైనా కార్యసాధకు లౌతారు. "ధరణి ససాధ్యము లేదు సోత్సాహమతుల కెపుడు” అనేవాక్యం దీన్ని ఉద్భోదిస్తూంది.
14. ప్రజాసేవలోనే అన్ని పరమార్ధాలూ ఉన్నాయి. తోడి మానవులకు నేవచెయ్యడంలోనే ఈశ్వరుడుకూడా సంతుష్టు డౌతాడు. "కుర్యాద్విద్వాం సధాత్ శక్తశ్చి కీర్తుల్లోక సంగ్రహమ్" అనే భగవద్గీతా వాక్యాని కింతకంటే వేరే యర్థమేమి ?"