Adsense

Showing posts with label 12 సూర్యులు. Show all posts
Showing posts with label 12 సూర్యులు. Show all posts

Monday, April 3, 2023

మన ఆథ్యాత్మిక గ్రంథాల ప్రకారం.. మొత్తం12 మంది సూర్యులు According to our spiritual texts.. total 12 suns


*ఏడాదిలోని ఒక్కో నెలకు ఒక్కో సూర్యుడు ప్రాధాన్యత వహిస్తాడు*.

1. చైత్ర మాసంలో వచ్చే సూర్యుడి పేరు ధాత’.
2. వైశాఖంలో అర్యముడు,
3. జ్యేష్టమాసంలో మిత్రుడు,
4. ఆషాఢంలో వరుణుడు,
5. శ్రావణంలో ఇంద్రుడు,
6. భాద్రపదంలో వివస్వంతుడు,
7. ఆశ్వయులో త్వష్ణ,
8. కార్తీకంలో విష్ణువు,
9. మార్గశిరంలో అంశుమంతుడు,
10. పుష్యంలో భగుడు,
11. మాఘంలో పూషుడు,
12. ఫాల్గుణంలో పర్జజన్యుడు.

ఆ నెలల్లో సూర్యుడి తీక్షణతను బట్టి ఆ పేర్లు వచ్చాయని చెబుతారు.

భూమి నుంచి 14.98 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యుని కిరణాల ప్రయాణ వేగం..
ఒక సెకనుకు 3 లక్షల కిలోమీటర్లు.
అవి భూమిని చేరడానికి పట్టే కాలాన్ని
8 నిమిషాలుగా అంచనా కట్టారు ఖగోళశాస్త్రవేత్తలు.

బాల్యంలో హనుమంతుడు సూర్యుణ్ణి..
పండు అనుకుని తిందామనే ఉద్దేశంతో అక్కడికి ఎగిరి వెళ్లాడట.
అందుకోసం హనుమ వెళ్లిన దూరాన్ని..
‘యుగ సహస్ర యోజన పరాభాను’ అని తులసీదాస్‌ హనుమాన్‌ చాలీసాలో చెబుతారు.

దీన్ని లెక్క కడితే... ‘
యుగం.. 12000 ఏళ్లు,
సహస్రం.. 1000,
యోజనం.. 8 మైళ్లు,
మైలు... 1.6 కిలోమీటర్లు వెరసి దాదాపు
15 కోట్ల కిలోమీటర్లు.
ఇది ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్న 14.98 కోట్ల కిలోమీటర్లకు దాదాపు సరిపోతుంది.

సూర్యకాంతి ఏడు వర్ణాల కలయిక అని వైజ్ఞానికులు చెబుతుంటే, ఆయన ఏడు గుర్రాలున్న రథం మీద లోక సంచారం చేస్తాడని వేదవాజ్మయం చెబుతోంది.

ఆ ఏడు గుర్రాల పేర్లు..
1. గాయత్రి,
2. త్రిష్ణుప్పు,
3. అనుష్టుప్పు,
4. జగతి,
5. పంక్తి,
6. బృహతి,
7. ఉష్ణిక్కు..

వీటి రూపాలు సప్త వర్ణాలకు సరి పోలుతాయి.

రామరావణ యుద్ధం సమయంలో అలసిపోయిన శ్రీరాముడికి అగస్త్య మహాముని ‘ఆదిత్య హృదయం’ ఉపదేశించినట్లు రామాయణంలో ఉంది.

ఇందులో 30 శ్లోకాలున్నాయి.
వీటి స్మరణ వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం బాగుంటుందని చెబుతారు.

సూర్యుడి రథానికి ఉన్న ఇరుసు పగలు, రాత్రికి
ప్రతీక అని, చక్రాలకున్న ఆరు ఆకులు రుతువులకు,
ధ్వజం ధర్మానికి ప్రతీకలని పురాణాల్లో ఉంది.

అందుకే సూర్యుడి జన్మదినాన్ని ఆయన పేరుతో కాకుండా రథ సప్తమి అని పిలుస్తారు.