Adsense

Showing posts with label An unprecedented fig tree.!!. Show all posts
Showing posts with label An unprecedented fig tree.!!. Show all posts

Sunday, March 17, 2024

అపూర్వమైన అత్తి వృక్షం.!! An unprecedented fig tree.!!

అపూర్వమైన అత్తి వృక్షం.!!

అత్తివృక్షం చరిత్ర అపూర్వమైనది.
అత్తి కలపతో చేయబడిన
విష్ణు మూర్తి శిల్పం  ఈనాటకీ  కాంచీపురం వరదరాజస్వామి  ఆలయ పుష్కరిణిలో నుండి 42 సంవత్సరాలకి
ఒకసారి భక్తుల దర్శనార్ధం
బయటకు తీసుకుని రాబడుతున్నది.

అంతటి విశిష్టమైన అత్తి కలప కి జ్యోతిష్య పరంగా
కూడా అత్తి వృక్షం నవగ్రహాలలోని శుక్రుని అంశగా చెప్పబడింది.

శుక్రుని ఆధిపత్యం కలిగినది అత్తి వృక్షం. ఈ అత్తి వృక్షం మిక్కిలి
శక్తి వంతమైనది. 

శుక్రుని  చేతలు  వ్యత్యాసంగా వుంటాయి. శుక్రుడు ప్రత్యక్షంగా
ఎవరితోను విరోధం పెట్టుకోడు.

మరుగున దాగి ఎదుర్కొంటాడు.
అలాగే  ఈ అత్తి వృక్షం
పువ్వు పూయడం కనిపించదు. కాని కాయలని చూస్తాము.

అందువలననే అత్తి వృక్షం
శుక్రుని అంశ  అంటారు.

దాంపత్యం లో కలతలు
వున్నవారు,  సమస్యలు
వున్నవారు,  జాతకంలో
శుక్రగ్రహం నీచ స్ధానాల్లో
వున్నవారు,  చెడుఫలితాలు అనుభవిస్తున్న వారు ,
పరిహారం గా ఇంటిలో
ఒక అత్తి మొక్క ని నాటి
పెంచ వచ్చును. 

ఈ పరిహారం ద్వారా కూడా
సమస్యలు తీరి ఇంట
సుఖ శాంతులు లభిస్తాయి. అత్తి వృక్షం వలన కలిగే వైబ్రేషన్స్ వలన భార్యాభర్తల మధ్య ఐక్యత కలిగిస్తుంది. 

అత్తి కలపతో చేసిన పీట
మీద ఆశీనులై చేసే ధ్యానము ,  భూమ్యాకర్షణ శక్తి కి లోను కాదు.

మనం ఉచ్ఛరించే మంత్ర శక్తి
యొక్క సంపూర్ణ ఫలం మనకి దక్కుతుంది.

మంత్రం:

న మంత్రం నో యంత్రం
తదపి చ న జాని స్తుతి మహో;'
"
న ఛ  ఆవాహనం  ధ్యానం
తదపి ఛ న జానే స్తుతి-కదాః'

'న జానే ముత్ర్తిస్తే తదపి
ఛ న జానే విలబనమ్;'

'పరమ్ జానే
మాతాస్తవదను చరణమ్
క్లేశ హరణం'.