Adsense

Showing posts with label Astavidha Vivahalu. Show all posts
Showing posts with label Astavidha Vivahalu. Show all posts

Saturday, March 25, 2023

సనాతన సంస్కృతిలో అష్టవిధ వివాహాలు



యాజ్ఞవల్క్య స్మృతి ననుసరించి పూర్వీకులు ఎనిమిది విధాలైన వివాహాలను శాస్త్ర సమ్మతం చేసారు. ఈ వివాహాల వలన వదూవరులు సుఖ సంతోషాలు పొందుతారని తెలియజేసారు . అవి

బ్రాహ్మ :- విద్యాచారాలు గల వరునికి కన్యనిచ్చి చేసే వివాహం
దైవ :- యజ్ఞయాగాదులు జరిపించిన పురోహితునికి ఇవ్వవలసిన రుసుమునకు బదులుగా కన్యాదానం చేయడం
ఆర్ష :- కన్యాశుల్కంగా వరుడినుంచి ఒక జత ఆవు-ఎద్దులను తీసుకుని పెళ్ళి చేయడం
ప్రాజాపత్య :- కట్నమిచ్చి పెళ్ళి చేయడం
ఆసుర :- వరుడు ధనమిచ్చి వధువును కొనడం
గాంధర్వ :- ప్రేమ వివాహం
రాక్షస :- వధువును ఎత్తుకెళ్ళి పెళ్ళి చేసుకోవడం
పైశాచ :- వధువును నిద్రిస్తున్నప్పుడో, మత్తులో ఉన్నప్పుడో ఆమె అభీష్టానికి వ్యతిరేకంగా అపహరించడం

(వీటిలో మొదటి నాలుగు రకాలు ధర్మశాస్త్రాలు ఆమోదించినవి కాగా చివరి నాలుగు రకాలను ధర్మశాస్త్రాలు ఆమోదించలేదు.)🌸

🌾బ్రాహ్మం
ప్రతిఫల రహితంగా యోగ్యుడైన వరునకు అలంకరించబడిన కన్య ను ఇచ్చి వివాహం చెయ్యడం.. తలిదండ్రులు శక్తి కొలది వస్త్రభూషణాదులతో తమ కూతురు ను అలంకరించి తగిన సమర్దుడైన వరుని చూసి కూతురి చేతిని అతని చేతిలో కలపి పాణిగ్రహణం చేస్తారు.

🌾దైవం
యజమాని గృహంలో దైవ యజ్ఞం చేసి యజ్ఞాంతములో ఋత్విజునికి ధారాపూర్వకంగా కన్యను ఇచ్చి వివాహం చెయ్యడం.

🌾ప్రాజాపత్యం
కేవలం సంతానం కోసం చేసుకునే వివాహం. వదూవరులు ఒకచోట సుఖంగా ధర్మాచరణ చేసుకొంటూ జీవిస్తారనే బుద్దితో వరునికి కన్యనిచ్చి వివాహం చేయడం. ఈ ప్రక్రియలో కట్నం, కన్యాశుల్కం అనే ప్రసక్తి ఉండదు.

🌾ఆర్షం
వేదవిహితంగా చేసుకునే వివాహం. కన్య తల్లి దండ్రులకు వరుడు కొన్ని ఉపకరణాలు అనగా ఆవు లేదా ఎద్దు లేదా కొన్ని మేకలు ఇలా ఇచ్చి కన్యను/కన్యాదానమును గ్రహించడం.

🌾ఆసురం
వదువు వైపువారికి శుల్కమును/ధనము ఇచ్చి కన్యాధానము గ్రహించడం.

🌾గాంధర్వం
వధూవరులు ఇష్టపడి చేసుకునే వివాహం. పెద్దల అనుమతితో ప్రమేయము లేక ఇరువురు ఇష్టముతో పాణిగ్రహణము చేసుకొనడం.

🌾పైశాచం
కన్యకు ఇష్టం లేకపోయినా బలవంతంగా చేసుకునే వివాహం. వదువు ఏమరుపాటుగా ఉన్నపుడు గాని, నిద్రిస్తున్నపుడు గాని, చేసుకొనే ఈ వివాహాన్ని అధమాధమమైనదిగా పరిగణిస్తారు.

🌾రాక్షసం
కన్య ఆమె బందువుల ఇష్టాలతో ప్రమేయం లేకుండా వారిని ఎదిరించి, బెదిరించి చేసుకొనే వివాహం.

🌾ఇలాంటి వివాహాలు పలు పురాణాలలో కానవస్తాయి. ఈ విధములైన అష్ట విధ వివాహాలు యాజ్ఞవల్కస్మృతిలో కానవస్తాయి.

🌾ఇవే కాక హిందూ సాంప్రదాయంలో స్వయంవరం అనే మరొక సాంప్రదాయ వివాహం చూడచ్చు.

🌾శివదనుస్సును విరిచి శ్రీరాముడు సీత ను పెళ్ళాడినది. మత్యయంత్రమును ఎక్కుపెట్టీ ద్రౌపదిని అర్జునుడు చేపట్టినది ఈపద్దతినే.
హరే కృష్ణ గోవిందా.