కావలసిన పదార్థాలు:-1
నానబెట్టిన బియ్యం-ఒక కప్పు, 2. జీడిపప్పు పొడి- అర కప్పు, 3. కొబ్బరి తురుము-అరకప్పు, 4. నానబెట్టిన బాదం పప్పులు - ఇరవై, 5. పాలు మూడు కప్పులు, 6. నెయ్యి- పావు కప్పు, 7,ఏలకులపొడి- అర స్పూను, 8. వేగించిన తెల్ల నువ్వులు-ఒక స్పూను, 9. పసుపు - అర స్పూను, 10. పటిక బెల్లం తురుము-ఒక కప్పు,
తయారు చేయు విధానం:- నానబెట్టిన బియ్యాన్ని నీళ్లు వంచి అరగంట సేపు గుడ్డమీద నీడలో ఆరబెట్టాలి. ఇప్పుడు బియ్యాన్ని మెత్తగా మిక్సీ పట్టాలి. స్టవ్ మీద బాండీ పెట్టి 2 1/2 కప్పులు పాలు పోసి పసుపు కూడా వేసి బాగా తెర్లించాలి. అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతుండాలి. పాలు తెడ్లాక పటిక బెల్లం తురుము వెయ్యాలి. ఇది బాగా కలిసిపోయాక తెల్లనువ్వులు వేసి ఆ తర్వాత బియ్యం పిండి, గోధుమపిండి, కొబ్బరి తురుము మూడింటిని కలిపి కొంచెం కొంచెంగా పోస్తూ ఉండలు కట్టకుండా కలుపుతుండాలి.
దీనిలో ఏలకుల పొడి, నెయ్యి వేసి కలపాలి. ఈ మిశ్రమం బాగా ఉ డికి దగ్గర యాక దించి ప్లేట్లో పొయ్యాలి. వేడి తగ్గాక మీడియం సైజు బాల్స్ లాగా చేసి వాటిని చేత్తో జాగ్రత్తగా కొంచెం వెడల్పుగా వత్తి మధ్యలో గుంటగా చేసి బాదంపప్పుతో అలంకరించాలి ఇలా పిండి మొత్తాన్ని చేసుకోవాలి ఈ బాదుషా భూచక్రాలు మంచి కలర్ ఫుల్ గా ఉండి రుచి చాలా అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా. మంచిది.