Adsense

Showing posts with label Brahma Muhurta. Show all posts
Showing posts with label Brahma Muhurta. Show all posts

Sunday, April 2, 2023

బ్రాహ్మీముహూర్తం - Brahma Muhurta

  


పూజలకు, అర్చనలకు, ఉపాసనలకు, 'సంధ్య' సమయం పరమ శ్రేష్ఠమైనదిగా నిర్ణయించబడినది. ఇక్కడ 'సంధ్య' అంటే 'సంధి కాలం' అని అర్థం. త్రి సంధ్యోపాసన అత్యంత ఫలదాయకమైనది. ఇవి 3 రకాలు

1. ప్రాతః సంధ్య, 2. మధ్యాహ్న సంధ్య, 3. సాయం సంధ్య.

1. ప్రాతః సంధ్య- ఇది మరలా 3 విధాలు.

(అ) ఉత్తమం (బ్రాహ్మీ ముహూర్తం),
(ఆ) మధ్యమం (తారక రహితం),
(ఇ) అధమం (సూర్యోదయం అనంతరం - అంటే సూర్యోదయానికి ముందు ఘడియల సమయంలో)

2. మధ్యాహ్న సంధ్య - మిట్ట మధ్యాహ్నానికి 1/2 ఘడియల ముందు 1/2 ఘడియల తర్వాత.

3. సాయం సంధ్య- ఇది మరలా 3 విధాలు.

(అ) ఉత్తమం - సూర్యాస్తమయానికి 3 ఘడియల ముందు;
(ఆ) మధ్యమం - సూర్యస్తమయకాలం,
(ఇ) అధమం- నక్షత్రాలు కనిపించిన తరువాత.

అన్ని సంధ్యలలో 'బ్రాహ్మీముహూర్త' కాలమే ప్రశస్తమైనది.
బ్రాహ్మీ ముహూర్తమంటే తెల్లవారుఝామున 3:30 గంటల నుండి 4:45 గంటల మధ్య సమయంగా చెప్పవచ్చు.

ఈ సమయంలో ప్రకృతి సత్త్వగుణం స్వభావాన్ని కలిగి ఉంటుంది. నిశ్శబ్దమైన, కల్మష రహితమైన వాతావరణం, ప్రశాంతత మనస్సుకు కొత్త శక్తిని కలిగిస్తుంది. అందుకే ఈ సమయం అన్ని రకాల పూజా, ధ్యాన, జప, తపాదులకు అనుకూలమని చెప్పబడింది.

భారతీయ కాలగణనంలో ఒక రోజు సూర్యోదయం నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు 60 ఘడియల కాలంగా విభజింపబడింది. ఇందులో 30 ఘడియలు పగలుగానూ, 30 ఘడియలు రాత్రిగానూ చెప్పబడింది.