చైత్ర పూర్ణిమను కూడా అదృష్ట పౌర్ణమిగా పరిగణిస్తారు.
🌸ఆ రోజు ఉపవాసముండటం వల్ల కోరికలను నెరవేరడమే కాకుండా భగవంతుడి అపారమైన అనుగ్రహం పొందవచ్చని భక్తులు విశ్వసిస్తారు.
🌿ఆ రోజు చంద్రుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. పౌర్ణమి అనేది ప్రతి నెల వస్తుంది. కానీ చైత్ర పౌర్ణమికి మాత్రం సనాతన ధర్మంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.
🌸చైత్రం మాసం శుక్ల పక్ష పౌర్ణమి తిథినే చైత్ర పూర్ణిమ అని అంటారు. తెలుగు సంవతర్సంలో చైత్రం మొదటి నెల కాబట్టి రదీన్నే చంద్రమాసం అని కూడా అంటారు.
🌿చైత్ర పూర్ణిమను కూడా అదృష్ట పౌర్ణమిగా పరిగణిస్తారు. ఈ రోజు ఉపవాసముండటం వల్ల కోరికలను నెరవేరడమే కాకుండా భగవంతుడి అపారమైన అనుగ్రహం పొందవచ్చని భక్తులు విశ్వసిస్తారు.
🌸ఆ రోజు చంద్రుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. చైత్ర పూర్ణిమ ఏప్రిల్ 6 గురువారం అంటే రేపటి రోజు ఈ నేపథ్యంలో చైత్ర పూర్ణిమ అంటే ఏంటి? ఈ పండుగ ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
🌹చైత్ర పూర్ణిమ మహిమ..🌹
🌿పురాణాల ప్రకారం చైత్ర పూర్ణిమ రోజు నాడు శ్రీ మహావిష్ణువుకు విధివిధానంతో పూజలు చేయడంతో ఆయన ప్రత్యేక అనుగ్రహం పొందుతారని నమ్ముతారు.
🌸చంద్రుడికి వ్రతం చేయం వల్ల కావాల్సిన ఫలాన్ని అందజేస్తాడని ప్రతీతి. అంతేకాకుండా దానం చేయడం ద్వారా చంద్రుడు ప్రసన్నమవుతాడని విశ్వసిస్తారు.
🌿ఆ రోజు గంగానదిలో స్నానం చేయడం ద్వారా దుఃఖాలను అధిగమించవచ్చు.
పురాణాల ప్రకారం ఆ రోజు తులసి స్నానం చేయడం ద్వారా లక్ష్మీ దేవి అనుగ్రహం పొందవచ్చని ప్రస్తావించారు.
🌹చైత్ర పూర్ణిమ వ్రత విధానం..🌹
🌸ఏ ఉపవాసమైనా పూర్తి భక్తి, నిష్ఠ, విశ్వాసంతో పాటించకపోతే దాని ఫలితం లభించదు.
🌿ఇదే నియమం చైత్ర పూర్ణిమలోనూ వర్తిస్తుంది. ఇందుకోసం పౌర్ణమి రోజున బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేయడం ద్వారా ఉపవాసవ్రతమాచరించాలి. ఈ రోజు లక్ష్మీదేవిని పూజించాలి.
🌸ఇందుకోసం మీకు కనకధర స్తోత్రం పఠించవచ్చు. అనంతరం రాత్రికి చంద్రుడికి పాలు అర్పించి పూజించాలి. అనంతరం బ్రాహ్మణుడికి ఆహారం దానం చేయాలి.
🌿లేదా పేదవ్యక్తికి దానం చేయవచ్చు. ఈ విధంగా చేయడం ద్వారా చంద్రుడు సంతోషించి కోరికలను నెరవేరుస్తాడని చెబుతారు.
🌹ఆ రోజే హనుమద్విజయోత్సవం🌹
🌸చైత్ర పూర్ణిమ సద్గుణ, సానుకూల ఫలితాలను ఇస్తుందని అంటారు.
🌿రాముడు అతి ప్రీతిపాత్రుడైన ఆంజనేయుని ద్విజయోత్యవం కూడా ఈ రోజే జరుపుకుంటారు.
🌸చైత్ర పూర్ణిమను హనుమాన్ బజరంగబలి అని కూడా పిలుస్తారు. ఈ రోజున హనుమంతిడిని ప్రత్యేక పూజలు చేస్తారు.
🌿ఇలా చేయడం ద్వారా ఆంజనేయుని అనుగ్రహం పొందడమే కాకుండా సమస్త పీడనలు, భయాలు తొలుగుతాయని విశ్వసిస్తారు.
సత్యనారాయణ స్వామిని ఆరాధిస్తారు..
🌸చైత్ర పూర్ణిమ రోజు సత్యనారాయణుడిని పూజిస్తారు. ఈ రోజున ఉపవాస నియమాన్ని కూడా ఆచరిస్తారు.
🌿రామాయణం లేదా భాగవత కథను వినలేనివారు ఈ రోజు సత్యనారాయణ స్వామి కథను వివరిస్తారు.
🌸పౌర్ణమి రోజున ఈ కథను ఇంట్లో పూర్తి చేసుకోవడం వల్ల ప్రత్యేకమైన ఫలం లభిస్తుంది. అంతేకాకుండా ఇంట్లో ఆనందం, శ్రేయస్సుతో పాటు ఆయురారోగ్య ఐశ్వర్యాలు లభిస్తాయి.
చైత్ర పూర్ణిమకు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత..
🌿ప్రతి పూజా మాదిరిగానే చైత్ర పూర్ణిమకు కూడా సొంత ప్రాముఖ్యత ఉంది.
🌸ఆకాశంలో చంద్రుడు పూర్తి స్థాయిలో కనిపించడాన్నే పౌర్ణమి అంటారు. దీనర్థం చీకటిపై కాంతి విజయం సాధించడం.
🌿అంటే చెడుపై మంచి విజయం సాధించడం అని అంటారు. ఈ రోజు ప్రత్యేక పూజించడం వల్ల ప్రత్యేక ప్రయోజనాలు లభిస్తాయని, భక్తుల బాధలను తొలగిస్తారని నమ్ముతారు. ఈ రోజున దానాలు చేయడం ద్వారా మంచి ఫలితాలు లభిస్తాయి.....స్వస్తి..