Adsense

Showing posts with label Dasa maha vidyalu. Show all posts
Showing posts with label Dasa maha vidyalu. Show all posts

Thursday, March 23, 2023

దశ మహా విద్యలు

🌿తంత్ర శాస్త్రంలో ప్రప్రదమంగా చప్పుకో దగినవి దశమహావిద్యలు. దశమహావిద్యలు అని పేర్కొనబడిన మంత్ర విద్యలకు 10 మంది దేవతలు అధిపతులుగా ఉన్నారు.

🌸దక్షిణాచారము లేదా వామాచారము అని పిలువబడే తాంత్రిక విధానాలు అదర్వణవేదం నుండి తీసుకొనబడ్డాయి.ఒక మంత్ర దేవత మానవ రక్షణకు మరియు నాశనానికి కూడా ఉపయెాగించటం జరుగుతుంది.

🌿పరమ శివుని భార్య అయిన సతీదేవి తండ్రి దక్షప్రజాపతి తలపెట్టిన యజ్ఙంకు వెళ్ళుటకు నిర్ణయించుకుని పరమ శివునితో చెప్పగా,

🌸 శివుడు దక్షప్రజాపతి ఆంతర్యము ఎరిగినవాడై పిలుపు లేని చోటుకు వెళ్ళరాదని వారించెను. వెంటనే సతీదేవి కోపంతో పరమ శివునికి తన నిజరూపమైన ఆదిపరాశక్తి య్అవతారము దాల్చి మహా శివుని ముందు తన శక్తితో 10 అవతారాలతో 10 వైపులా శివుని అడ్డుకుంది.

🌸ఈ 10 అవతారాలే దశమహావిద్యలు. ప్రతి అవతారమునకు ఒక పేరు, కధ, లక్షణము మరియు మంత్రము కలదు.

🌸ఈ 10 అవతారాలతో ఆదిపరాశక్తి పరమశివుడిని 10 దిక్కులా బంధించి తన శక్తిని చూపించింది.

🌿ఈ అవతారాలలో అమ్మవారు ఒక వైపు భయంకర రూపంతో కనిపిస్తూనే మరోవైపు అందమైన శక్తి స్వరూపిణిగా సర్వ విద్యలకు అధినాయకిగా చెప్పబడినది.

🌸దశమహావిద్యలు పేరుకు తగ్గట్టుగ అపారమైన జ్ఙాన మూర్తులుగా తెలుపబడ్డారు. ప్రతి ఒక అవతారము ఒక ప్రత్యేకతను కలిగి ఉంది.

🌿ఆధ్యాత్మికతను తరించుకున్నవారికి ఈ దశమహావిద్యలు ఎంతో ప్రేమ, ధైర్యము, జ్ఙానముతో కనిపిస్తాయి.

🌸తాంత్రికులకు ఆరాధ్య దేవతలుగా ఈ పది మంది దేవతలు ప్రాముఖ్యం చెంది ఉన్నారు.

🌿వీరిలో మొదటి ఐదుగురు దేవతలు ఉగ్రదేవతలుగా గుర్తించబడ్డారు. కానీ వారు నిజానికి దయామయులుగా ఉంటారు.

🌸మిగిలిన ఐదుగురు దేవతలు శాంత స్వరూపులుగా కనిపిస్తారు.
దశమహావిద్యలు అని పేర్కొనబడిన పది మంది ఆదిపరాశక్తి అంశల యొక్క కథలు, మంత్రాలు మరియు ఆ దేవతల యొక్క స్వరూపాల గురించి నియమ బద్ధంగ పఠించినపుడు ఆయా మంత్రాల యొక్క అధిష్టాన దేవతలయిన దశమహావిద్యలు అనుగ్రహిస్తాయి.


దశమహావిద్యాధిపతి దేవతలు
మహాకాళి


🌿దశమహావిద్యలలో మొదటగా పేర్కొన బడినది మహాకాళి. భయంకర ఆకారంతో, తంత్ర శాస్త్రంలో ప్రత్యేక స్థానం కలిగి ఉంది

తార

🌸తార, తాంత్రిక దేవతలలో అత్యంత శక్తివంతమైనది మరియు ఉగ్రమైనదిగా భావించబడుచున్నది.

ఛిన్నమస్త

🌿దుర్గాదేవి యొక్క తాంత్రిక స్వరూపము, ఈమె రూపము అనేక లక్షణాలకు చిహ్నంగా కనిపిస్తుంది.

త్రిపుర సుందరి

🌸మూడు లోకాలకు గాను ఈమె అత్యంత సౌందర్యవతి. ఈమె ఆదిమహావిద్యగా
పేరుగాంచినది.

భువనేశ్వరి:

🌿భువనానికి అధినాయికగా ఈమెను పేర్కొంటారు. ఈ దేవతను పూజించిన వారికి సమస్త భయాలు తొలగిపోతాయి.

త్రిపురభైరవి

ఈ అవతారంలో ఆదిపరాశక్తి సృష్టి యొక్కలయకు ప్రతిరూపంగా ఉంటుంది.ధూమవతి:
దశమహావిద్యలలో అతి విచిత్రమైన అవతారం ఇది.ఈమె ఒక వితంతువుగా తంత్ర శాస్త్రంలో పేర్కొనబడినది.

బగలాముఖి:
ఈ మహాశక్తి శత్రువుల యొక్క నాలుక బయటకు లాగి విసిరివేస్తుంది.
మాతంగి: సరస్వతీ దేవి యొక్క తాంత్రిక అవతారంగా మాతంగి పిలువబడుతుంది.

కమల
మహాలక్ష్మి కి మరోపేరే కమల అని గుర్తించాలి...
👍సర్వేజనాసుఖినోభవంతు 🙏