Adsense

Showing posts with label Daughter of.radha Krishna. Show all posts
Showing posts with label Daughter of.radha Krishna. Show all posts

Sunday, April 2, 2023

రాధాకృష్ణల కుమార్తె



పూర్వకాలంలో గోలోకమందు రాధాకృష్ణుల శరీరం నుంచి వారి అంశభూతమై ఆవిర్భవించి భోగ మోక్షఫలములను జీవకోటికి ప్రసాదింపచేయుటకై సుందరాతిసుందరమై, నవయౌవన స్ఫూర్తితో, శరత్కాల చంద్రబింబము వంటి ముఖము, దివ్యశోభతో శ్రీకృష్ణుని పార్శ్వభాగమందు వచ్చి నిలిచినది గంగ.

శ్రీకృష్ణుని ప్రక్కన ఉన్న రాధాదేవికి ఈమెను చూచి కోపం వచ్చింది. ఆ కోపమునకు గంగ భయపడినదై జలరూపమును ధరించి శ్రీకృష్ణుని చరణకమలములో ప్రవేశించి శ్రీకృష్ణుని శరణుపొందినది.

యోగ సామర్థ్యముచేత జలరూపమునంతా ఉపసంహరించినది. అంతటితో జగత్తులో జలభాగము నశించి అందరికీ గొంతులు ఎండిపోవడం మొదలు పెట్టింది. జలజంతువులన్నీ నశిస్తున్నాయి. అప్పుడు దేవతలు భీతులై పరమాత్మను శరణుపొందారు.

పరమాత్మ అభిప్రాయాన్ని గుర్తించి రాధాదేవిని స్తుతి చేశారు. అమ్మా రాధాదేవీ! మీ రాధాకృష్ణుల అంశభూతయై గంగ అవతరించినది. ఆ కారణముగా నీకు గంగ కుమార్తె. ఆమెను నీవు కుమార్తెగా స్వీకరించు.

ఇలా బ్రహ్మ చేత స్తుతించబడిన రాధాదేవి గంగను కుమార్తెనుగా స్వీకరించినది. అప్పుడే శ్రీకృష్ణస్వామి యొక్క పాదము యొక్క బొటనవ్రేలి గోటి నుంచి ఉదక రూపముగా గంగ బయటకు వచ్చినది.