మంగళమో గౌరీ
మంగళమో దేవీ !
మంగళమయము నీ
మహనీయ చరితము
మదిలోన తలచెద
మము బ్రోవు గౌరీ || మంగళమో గౌరీ ||
శంశరి : భక్తవ శంకరి,
దురితనా శంకరి!
హరియించు సంకటములనూ. ||మంగళమో గౌరీ ||
మంగళకరుడైన
మదన వేరికి నీవు
మరులు కొల్పిన దేవి
మము దయ జూడుమా ||మంగళమో గౌరీ||
కమల దళేక్షణ
విమలసద్గుణ చరిత
కరుణించి గ్రహియించు
కర్పూర హారతి ||మంగళమో గౌరీ||
కామిత ఫలదాయి
కల్యాణి సావిత్రి
కామదహనుని రాణి
కలుష సంహారిణి ||మంగళమో గౌరీ||
పంకజలోచని !
పాప వినాశనిః
భక్త రక్షణి !
ఇహ పరసౌఖ్య దాయిని ||మంగళమో గౌరీ||