Adsense

Showing posts with label Guntur District. Show all posts
Showing posts with label Guntur District. Show all posts

Tuesday, March 28, 2023

కేతవరం, గుంటూరు జిల్లా..!!




🌿ఆంధ్ర దేశంలో నృసింహ క్షేత్రాలు మిక్కుటం.అందులో పంచ నారసింహ క్షేత్రాలు గా వేదాద్రి, మంగళగిరి, వాడపల్లి, మట్టపల్లి, కేతవరం ఉన్నాయి. కేతవరం తప్ప మిగిలిన నాలుగూ తేలిగ్గానే వెళ్ళిరావచ్చు.

🌸 ఇంచుమించు అన్నీ కృష్ణా పరీవాహక ప్రాంతంలోనే ఉన్నా కేతవరం మాత్రం కొంచెం సాహసించి వెళ్లాల్సిన ప్రదేశం!

🌿కేతవరం నృసింహుడు  కృష్ణ ఒడ్డున కొండపై వెలిసిన
స్వయంభువు! పక్కనే రాజ్యలక్ష్మి అమ్మవారు.

🌸వర్షాకాలం ఈ స్వామి ని సేవించుకోవాలంటే మరీ కష్టం.
సరైన దారి ఇంకా ఏర్పాటు చేయలేదు.

🌿విజయవాడ నుంచి వచ్చేవారు చిల్లకల్లు సెంటర్ లో హైవే దిగి రేబల్లె వెళ్లి అక్కడినుంచి పడవలో కృష్ణ దాటి కేతవరం చేరి సుమారు 200 మెట్లు ఎక్కితే స్వామి దర్శనం.
హైదరాబాద్ వాళ్ళు కోదాడ దగ్గర మేళ్ల చెరువు* నుండి రేబల్లె రావాలి.

🌸మేము మరో మార్గం లో అంటే వయా గుంటూరు, బెల్లం కొండ వచ్చి, అక్కడ నుంచి ముందుగా ఏర్పాటు చేయబడ్డ జీపు లో ( మామూలు కార్లు వెళ్లలేవు ) దాదాపు అరగంట  ప్రయాణం చేసి డైరెక్ట్ గా కొండపైన ఆలయానికి చేరుకున్నాం.

🌿ఇదొక దారి..కాకపోతే నిర్మానుష్యంగా అడవి మధ్య లో ఉంటుంది ప్రయాణం. కానీ ఈ ప్రయాణం చేసి తీరాల్సిందే! బాగుంటుంది.

🌸దారంట చేతులకు అందే బొప్పాయి 5లల్లుకుతోటలు, మిర్చి, మొక్కజొన్న పొలాలు, బంతి & చేమంతి వనాలు.
ఒక్కమాటలో చెప్పాలంటే వనాలు తప్ప జనాలు కనపడని ప్రదేశం!

🌿మరో  ముఫ్యానియన్స్ వజ్రాలు ..నిజమే..ఈ ప్రదేశం లో వజ్రాలు దొరుకుతాయని నానుడి! తీవ్రం గా వర్షం వచ్చినప్పుడు అక్కడి రాళ్లనుండి బైట పడతాయని చెప్పారు. మేము వెళ్లిన రోజు వర్షం పడిందిగానీ చిరుజల్లు మాత్రమే!

🌸బహుశా స్వామి వారు  వజ్ర నఖ(గోళ్లు) నారసింహ కాబట్టి నఖాలు పెరిగినప్పుడల్లా ఆయన అక్కడ తీసిపడేస్తూ ఉంటాడు కాబోలు!! అవే వజ్రాలు గా దొరుకుతున్నాయని నా విశ్వాసం.

🌿పనిలేక  గోళ్ళు గిల్లుకునేవారు అక్కడికి వెళితే వజ్రాలు దొరికే అవకాశం ఉంది
ఈ ఆలయ ఆర్చక స్వామి ప్రతి రోజూ రేబల్లె నుండి సొంత పడవ లో కృష్ణ దాటి  కేతవరం వచ్చి అన్ని మెట్లూ ఎక్కి ఉదయం  9 నుండి 3 వరకు స్వామి సేవలో ఉంటారు.

🌸 రోజూ పట్టుమని పదిమంది పది రూపాయలు కూడా వచ్చే ఆలయం  కాదది.  అయినా నిత్యం ఎంతో భక్తి శ్రద్ధలతో దీక్షగా తన బాధ్యతల నిర్వహణ లో లీనమవ్వడం చూసి ఎంతో ముచ్చటేసింది.

🌿ఈ అర్చక స్వామి సంపూర్ణ దాసోహ లోగుట్టు ఆ పెరుమాళ్ళకే ఎరుక!
శని, ఆదివారాల్లో కొద్దిమంది భక్తులు వస్తూ ఉంటారట!

🌸యుగాల నాటి ఈ ఆలయాన్ని భద్రంగా కాపాడుకోవాల్సిన బాధ్యత లేకపోగా ఎండోమెంట్స్ వారి పూర్తి అలక్ష్యం ఈ ఆలయ నిర్వహణ లో స్పష్ఠముగా కనిపిస్తోంది.

🌿హడావుడిగా కాకుండా తీరిగ్గా ఈ క్షేత్రానికి వస్తే ఇటు ప్రకృతి ఒళ్ళో అటు పరమాత్మ గుళ్ళో కాలక్షేపమ్ చేసి మరీ వెళ్లొచ్చు. ..స్వస్తీ.

నోట్ :

ఏమీ దొరకవు కాబట్టి  మంచి నీళ్లతో సహా తెచ్చుకోవాలి.