Adsense

Showing posts with label HAIR CARE FOR WOMEN. Show all posts
Showing posts with label HAIR CARE FOR WOMEN. Show all posts

Friday, April 5, 2024

స్త్రీల శిరోజాల సంరక్షణ (పూర్వ పద్ధతి) HAIR CARE FOR WOMEN (OLD PROCESSES)

స్త్రీల శిరోజాల సంరక్షణ
స్త్రీలకు సహజ సౌందర్యమిచ్చు వస్తువులలో శిరోజములు ఎన్నదగినవి. వానిని దువ్వుకొనుటలో అవలంబింపదగిన కొన్ని సలహాలను వినీత భావముతో నాసోదరీమణులకు నివేదించుచున్నాను.

శిరోజముల చిక్కుదీర్చు దువ్వెనలు పదునై న మొసలుగలిగి యుండరాదు. తీగెల బ్రష్టులతో తల దువ్వుకొనుట తగదు. బిరుసు వెండ్రుకలతో చేయబడిన బ్రష్టుల నుపయోగించుటకూడ తలకట్టునకు చెఱుపే మాడపట్టున కెదురుగాదువ్వెనను నొక్కి దువ్వరాదు. సగము మృదువుగను సగము బిరుసుగను నుండెడు దువ్వెనలను వాడ రాదు. లోహపుదువ్వెననుగాని బ్రష్షునుగాని వినియోగించుట తగదు. పండ్లవరుసలో ఎగుడు దిగుడుకల దువ్వెనను వాడుట ప్రమాదకరము.
కురులు దువ్వుకొను బ్రష్టును దువ్వెనను అమోనియా (Ammonia) కలిపిన గోరువెచ్చని నీటిలో తఱచు శుభ్రపఱచుట గమనింపదగిన విషయము. సూర్యరశ్మిలో తలకట్టు తఱచుగా అర్చుకొనుట మంచిది. సూర్యరశ్మి శిరోజములను దీర్ఘ కాలము ఆరోగ్యస్థితిలో నుంచుటకు దివ్యమైన యాషధరాజము, శిరోజముల నార బెట్టుటలో సూర్యాభీముఖముగా గూర్చుండరాదు. వీపు సూర్యుని వై వుంచి అప్పుడప్పుడు తలనిటు నటు ద్రిప్పుచుండవలెను.

శిరోజములను ముందు దువ్వెనతో దువ్వి పిమ్మట బ్రష్టును ఉపయోగించుట నాగ రికపు స్త్రీ లవలంబించు మంచిమార్గములలో నొకటి; అగుటచే నది స్త్రీజనముచే నవశ్య ముగా నవలంబింపదగినది, శిరోజములకు గూడ విశ్రాంతి యుండవలయును గావున తరచుగా దువ్వుట—అనగా రోజునకు అయిదారుసారులు అనుట— ఆరోగ్యకరమగు పద్ధతికాదు. బ్రష్టు నుపయోగించుటవలని యుపయోగములలో నొకటి తలనుండి వచ్చు నొక విధమగు నూనెను అన్ని వెంట్రుకలకు సమానముగ సర్దుబాటు చేయుటయే యనువిషయము తల దువ్వుకొనునపుడెల్ల స్త్రీలు జ్ఞప్తియందుంచుకొనవలయును,

( సేకరణ)