Adsense

Showing posts with label Home Decoration. Show all posts
Showing posts with label Home Decoration. Show all posts

Sunday, March 19, 2023

"ఆదర్శ హిందూ గృహం"అంటే




👌1.  ఇంటి పై ఓంకార చిహ్నముండాలి.
👌 2. ఇంటి పై కాషాయ ధ్వజం ఎగరాలి.
👌3. ఇంటి వాకిట్లో తులసి ఉండి రోజు సేవించాలి. 
👌4. ఇంట్లో దేవతల, మహనీయుల చిత్ర పటములు మాత్రమే ఉండాలి. 
👌5, ఇంటి ఆవరణ, పరిసరాల పరిశుభ్రత, ముగ్గులు వ్యవస్థితంగా ఉండాలి. 
👌6. ఇంటి లో శుద్ధ త్రాగునీటి వ్యవస్థ, మురుగునీరు పోవుటకు వ్యవస్థ పుండాలి. 
👌7. ఇంటి ఆవరణ లో ఆకు కూరలు, కూరగాయలు మరియు వేప వంటి   నీడ మొక్కల పెంపకము జరగాలి. 
👌8. ఇంటి వారంతా ప్రాతః కాలం లేచుట, వెంటనే కాలకృత్యాలు తీర్చుకొని వ్యాయామం, యోగ చేయాలి. సూర్యోదయం అయిన తరువాత సూర్యునికి నమస్కరించడం. పిల్లలు ఉదయం 4 గంటలకు లేచి 2 గంటలు పాఠ్య పుస్తకాలు చదువు కుంటే బాగా జ్ఞాపకముంటుంది ఇందుకోసం రాత్రి త్వరగా పడుకోవాలి. పెద్దలు అచరణ ద్వారా పిల్లలకు ఈ విషయాలు నేర్పుట. 
👌9. ప్రతి నిత్యము స్నానము, కుంకుమ ధారణ, దేవునికి నమస్కరించుట, కలిగి ప్రార్ధించుట, అందరి క్షేమము, దేశ క్షేమము కాంక్షించుట. 
👌10. కుటుంబ సభ్యులు నియమితంగా మందిర దర్శనము చేసుకొనుట. 
👌11. పిన్నలు తమ ఇళ్లలోన పెద్దలకు, తల్లి దండ్రులకు (పండుగ ఇతర ప్రత్యేక సందర్భాలలో) పాదాభివందనం చేయుట, ఆశీర్వచనం తీసుకొనుట.
👌12. భోజనం ముందు భగవంతుని స్మరించి భుజించుట. 
👌13. ఇంటి వారంతా కనీసం ఒక పూట కలిసి భుజించుట. 
👌14. ఇంటి వారంతా ఆత్మీయంగా కలిసి మెలసి ఉండటం, విమర్శలు మానుట, పరస్పర గౌరవం, పరామర్శలతో జీవించుట.
👌15. ఇంట్లో అతిధి మర్యాదలు పాటించుట.
👌16. కుటుంబ వాతావరణం సంస్కారప్రదం గా ఉండటం, అరుపులు కేకలు కాక పరస్పరము ప్రేమ పూర్వకముగా సంభాషించుట, అనుభవాలు పంచుకొనుట. 
👌17. ఇరుగు పొరుగు వారితో సత్సంబధము కలిగి ఉండటము. 
👌18. ఇంటి వారంతా సామాజిక హిందూ సమరసతను పాటించుట,   
👌19. ఇంట్లో బాల బాలికలు, యువతి యువకులు విద్యార్జన చేయడం, గురుభక్తి కలిగి యుండి, సరస్వతి ప్రార్ధన చేయుట. 
👌20. మాతృ భాషలు, సంస్కృతం అభ్యసించుట, మాట్లాడుట. 
👌21. ఇంటిలో సత్గ్రంథ శ్రవణం, ప్రవచనము పట్ల ఆసక్తి, ప్రతి హిందూ గృహంలో రామాయణ, మహాభారతం, భాగవతం, భగవద్గీత గ్రంథాలు ఉండడము 
👌22. ఇంట్లో యోగి పత్రికల పఠనము, వార్తలు వినుటలో ఆసక్తి, మమ్మీ, డాడి, అంకుల్, ఆంటీ పదాలను వాడకుండుట. 
👌23. భజన సమయంలో మొబైల్ ఫోన్లు వాడకుండుట, టెలివిజన్ వాడకుండుట, వారంలో ఒక రోజు దూరదర్శన్ చరవాణిలు వాడకుండా ఉండటము. 
👌24. ఇంట్లో స్వదేశీ వస్తువులు వాడుట, విదేశీ వ్యామోహానికి దూరంగా ఉండటం, అనుకరణకు దూరంగా ఉండటము  
👌25. ఇంటి లో మిత వ్యయమును పాటించుట. పొదుపు చేయడం, ఖర్చు లేక్క వ్రాయుట. మాతృ ఋణం, పితృ ఋణం, ఋషి ఋణం, దేవ ఋణం తీర్చుకోగలగడం, పిల్లలకు దానమిచ్చే గుణం నేర్పడము. 
👌26. ధర్మ సేవా కార్యములు కోసం ఖర్చు చేయడము. 
👌27. ఇంట్లో వారంతా పొగాకు, మధ్యపానము, జూదము, దుర్వ్యసనములకు దూరంగా ఉండుట. 
👌28. తమ వీధి శుభ్రత, బాగోగులు పట్టించుకునుట. 
👌29. ఇంటివారంతా సమాజ హిత కార్యములలో పాల్గొనుట. 
👌30. సంఘ విద్రోహులు అదుపు చేయడం లో కర్తవ్యము పాటించుట. 
👌31. అన్ని పండుగలను నిజమైన స్పూర్తితో భక్తిశ్రద్ధలతో జరుపు కొనుట. పుట్టిన రోజును మనదైన పద్ధతులలో దీపం వెలిగించి జరుపుకొనుట. 
👌32. పెళ్లి వంటి శుభకార్యాలలో దుబారా ఆడంబరాలు లేకుండా చేసుకోనుట. సంస్కృతి ప్రతిబింబించే కార్యక్రమములు నీర్వహించుట. 
👌33. మనదైన పంచాంగం ననుసరించి పండుగలు, మహాత్ముల జయంతిని, మన పుట్టిన రోజులు జరుపుకొనుట. 
👌34. మన వేష భాషలందు భారతీయ సంస్కారం కలిగియుండుట. 
👌35. అన్నింటిలో పరహితము, ధర్మహితము, దేవహితము, విశ్వహితములకు ప్రాధాన్యతనిచ్చుట
👌36. ప్రతిఒక్కరూ సజ్జనుల తో స్నేహం చేయడం, సత్సంగములలో పాల్గొనడం, సాధకుడిగా జీవించడం.  చివరగా, 
👌37. చాణుక్యుడు గృహస్థాశ్రమం గురించి అర్థశాస్త్రంలో చెప్పిన క్రింది శ్లోకం అందరూ గుర్తు పెట్టుకోవాల్సిందే!
 
*సానందంసదనం సుతాశ్చ సుధియః* *కాంతా ప్రియా భాషిణీ !*
*సన్మిత్రం సుధనం సయోషితిరతశ్చాజ్ఞాపరా సేవకాః |*
*ఆతిథ్యం శివపూజనం ప్రతి దినం మృష్టాన్న పానం గృహే*.
*సాధుః సంగముపాసతేహి సతతం ధన్యోగృహేభ్యో నమః* ||

భావము: 
1. ఇల్లు ఆనందానికి నిలయం,
2. పిల్లలు బుద్ధి మంతులు,
3. ఇల్లాలు ప్రియ భాషిణి,
4 చక్కటి స్నేహితులున్నారు,
5. సత్సంపాదన,
6. పత్నితోనే శారీరక సంబంధం,
7. ఆజ్ఞను పాలించే సేవకులు,
8. అతిధులను పిలిచి ఆతిధ్యమివ్వడము,
9. ప్రతి రోజు దేవతార్చన,
10. ఇంటనే మృష్టాన్న భోజనము
11. సాధుసంతులు ఇంటికి నిత్యమూ రావడం.
  ఈ పై విషయాలను పాటిస్తే ఇల్లు స్వర్గ తుల్యమవుతుంది.  ఒక దీపంతో మరియొక దీపం వెలిగించాలి.  నీలో దీపం వెలిగించు, నీవే వెలుగై వ్యాపించు

సర్వే జనాః సుఖినోభవంతు
లోకా సమస్తా సుఖినోభవన్తు
శుభమస్తు