మనం ఎంత వాస్తుశాస్త్ర ప్రకారం గ్రృహము నిర్మించాలని ప్లాన్ వేసి గ్రృహ నిర్మాణం తలపెట్టినా వాస్తుశాస్ర్తవేత్తల సలహాలు పాటించిన, గృహస్తుడు తనంటూ కొన్ని విషయాలు తెలుసుకొని గృహ నిర్మాణము చేపట్టునప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం ఉత్తమం. ఎందుకంటే ప్రతిరోజు వాస్తుశాస్ర్తవేత్త మీ గృహ నిర్మాణం పరిశీలించుటకు రాడు కదా.. ముందుగా ప్రహరీలు లేకుండా గృహ నిర్మాణం చేయకూడదని గృహస్తుడు తెలుసుకోవాలి. ప్రహరీల నిర్మాణముకు పునాది తవ్వకం ఈశాన్యం నుంచి మొదలు పెట్టి ఉత్తరం, తూర్పు పశ్చిమ దక్షిణాలుగా తవ్వి చివరిగా నైరుతిలో పునాది తవ్వాలి. కట్టడం మాత్రం నైరుతి మూల మొదలు పెట్టాలి.
గ్రృహనిర్మాణానికి రాయి, ఇటుక, ఇసుక సిమెంటు వంటి వాటిని తూర్పు, ఉత్తర ఈశాన్యాలలో వేయకూడదు. ఇల్లు శాస్ర్తప్రకారం నిర్మాణం చేయునపుడు ప్రధాన గృహము నైరుతిలో నిర్మితమవుతూ వుండును. కాబట్టి తూర్పు, ఉత్తరాలలో ఖాళీ వుండుటవలన సాధారణంగా తూర్పు, ఉత్తరాలలో ఇసుక, రాయి, ఇటుక, సిమెంటు వేస్తుంటారు. ఈ విధముగా చేయుట పొరపాటు. ఆగ్నేయ, వాయువ్యాలలో వేయవచ్చు. లేదా మీ పక్క స్థలాలను ఇందునిమిత్తమై ఉపయోగించుటలో తప్పులేదు. అయితే మీ ఇంటికి వాస్తు సమ్మతమైన ప్రహరీ వుండితీరాలి.
శాస్ర్తవిరుద్దంగా ఇసుక, రాయి, ఇటుక వంటి వాటిని స్థలంలో వేసినచో గృహనిర్మాణం చిక్కులలో పడటం, ఆగిపొవడం వంటివి జరుగుతాయి. ఈశాన్యం బోరింగ్ గాని, నుయ్యి, గాని కుళాయిని గాని ఏర్పాటు చేసికొని ఆనీ టితో గృహ నిర్మాణం చేయటం ఉత్తమం. వీలైతే ఇంటికి నైరుతి గదిని ముందుగా నిర్మించి అందు సిమెంటు, కలప వంటి సరుకును ఉంచుకొని గృహ నిర్మాణం చేయటం మరీ ఉత్తమం.
ఇంటికి లింటల్ లెవెల్ సన్ షెడ్ వేయునపుడు ఉత్తరం, తూర్పు గృహలకు ఈశాన్య, వాయువ్య, ఆగ్నేయాలు తెగిపోకుండా జాగ్రత్తపడాలి. ఇంటి పైకప్పు వేయునప్పుడు నైరుతి ఎత్తుగా వుంచి, వాయువ్యం కన్నా ఆగ్నేయం ఎత్తుగాను, ఈశాన్యం కన్నా వాయువ్యం ఎత్తుగాను ఉండునట్లు లెవెల్ సరిచేసుకోవాలి. ఇదే విధంగా ఫ్లోరింగ్ విషయంలో కూడా లెవెల్ సరిచేయాలి. మట్టి కోసంగాను మరేంగాని మరే ఇతర అవసరాలకు గాని ఇంటి ఆవరణలో శాస్ర్తవిరుద్ధంగా గుంటలు తీయకూడదు.
ఇంటి గోడలకు ప్లాస్టరింగ్ చేయునపుడు ప్రతి గదికి ఈశాన్యం తగ్గకుండా చూసుకోవాలి. ఉత్తరం, తూర్పుగోడలకు ఆనుకుని షోకేసులు, రోళ్ళు, తిరగళ్ళు వంటివి ఏర్పాటు చేయకూడదు. ఇంటికి లింటిల్ లెవెల్ లోగాని, పైకప్పులోగాని ఈశాన్యం తెగిపోకుండా జాగ్రత్తపడాలి.
గోడ మందాలు ఎలా వుండాలి..?
గ్రృహనికి నిర్మించే గోడలు ఎంత మందం వుండాలి అనేది కాలానుగునంగాను, ప్రాంతానుగుణంగాను మరియు సాంకేతిక పరంగాను మారుతోంది. పూర్వం రెండు అడుగులు, రెండున్నర అడుగుల మందంతో గోడలు నిర్మించేవారు. గ్రృహనిర్మాణ వస్తువులు మారడం, సిమెంటు కాంక్రీట్ విస్ర్తుత వాడకంలోకి వచ్చిన తరువాత తొమ్మిది అంగుళాల మందంగల గోడలు ఎక్కువగా నిర్మిస్తున్నారు. రాతి గోడలు అయితే పద్నాలుగు, పదహారు అంగుళాల మందం వరకు ఏర్పాటు చేస్తున్నారు.
ఇంటిచుట్టూ ఒక రకం మందంగల గోడలను, ఇంటిలోపలి గోడలను మందం తగ్గించడంవలన కొన్ని దోషాలు వర్తిస్తున్నాయి. ఉదాహరణకు ఇంటిచుట్టూ తొమ్మిది అంగుళాల గోడ నిర్మించి ఇంటిలోపల గోడలు ఆరు, లేదా నాలుగు అంగుళాలు నిర్మిస్తూ వుండటం అలవాటుగా మారింది. ఇటువంటి సందర్బంలో దక్షిణం గోడ తొమ్మిది అంగుళాలు వుండి అదే విధంగా ఉత్తరం గోడ వుందానుకుందాం. ఉత్తరం గోడకు ఇంటిలోపల వైపుగల గోడ తొమ్మిది అంగుళాలకన్నా తక్కువగా వున్నాప్పుడు ఆ గదికి అంటే ఇంటి ఉత్తరం గదులకు దక్షిణం గోడ ఇంటి ఉత్తరం గోడ మందంకన్నా తక్కువగా వుండటం జరుగుతుంది. ఇది తప్పు.
ఇంటిగోడలన్నీ ఒకే మందంగా వుండునట్లు ఏర్పాటు చేసుకోవడం శుభకరం. ఇంటి పైకప్పుపై నిర్మించు పిట్టగోడల మందంకు సమంగా వుండాలి. ఇంటిలోని గోడలు, కప్పు ఎత్తు వరకు కాకుండా ఆరేడు అడుగుల ఎత్తువరకే కట్టడం కట్టి వదిలేయడం కొన్ని ఇళ్ళలో కనబడుతుంది. ఇది తప్పు. ఇది అసంపూర్ణ గ్రృహనిర్మాణంగా ఫలితం ఇస్తుందేగాని పూర్ణ గృహ ఫలితం ఇవ్వదు. ఇంటిగోడలలో ప్రతిగోడ ఒకే మందం కలిగి వుండాలి. మరియు పైకప్పు వరకు ఎత్తు కలిగి ఉండాలి.
గోడల మధ్య ఎత్తులో (లింటల్ లెవెల్లో) లోరూఫ్స్ నిర్మించకూడదు...!!