Adsense

Showing posts with label Lord Shiva. Show all posts
Showing posts with label Lord Shiva. Show all posts

Thursday, March 23, 2023

నటరాజు పరమ శివుని అవతారం...!!




🌿సకల నాట్యాలకు అధిపతి. లోహంతో గానీ, రాతితో చెక్కిన నటరాజు విగ్రహాలు దక్షిణ భారతదేశంలో శివాలయాల్లో తరచుగా దర్శనమిస్తాయి.

🌸పదవ, పదకొండవ శతాబ్దంలో దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన చోళుల కాలానికి చెందిన ఇత్తడి విగ్రహాల్లో నటరాజ విగ్రహం నాలుగు చేతులతో రూపొందించబడి ఉంటుంది.

🌿 జడలు గాలిలో ఎగురుతూ ఉంటాయి. మరుగుజ్జు బొమ్మపై నిలుచుని నాట్యం చేస్తున్నట్లుగా ఉంటుంది.

🌸ఈ మరుగుజ్జు , అపస్మార పురుషుడు ( మానవులోని అజ్ఞాని) కి చిహ్నం. కుడి వైపున వెనుక ఉండే చేయి ఢమరుకాన్ని కలిగి ఉంటుంది.

🌿ముందుకు ఉండే కుడి చేయి అభయ ముద్రను సూచిస్తుంటుంది. వెనుక వైపునున్న వామ హస్తం అగ్ని ని కలిగి ఉంటుంది.

🌸ముందువైపు ఉండే ఎడమచేయి గజహస్తం ముద్రలో ఉంటుంది. జులపాలు నలువైపులకు విసిరివేసినట్లు ఉంటాయి.

🌿 ఝటాజూటంలో గంగాదేవి, అర్థ చంద్రాకారం ఇమిడి ఉంటాయి. ఆయన ఆకారం మొత్తం గుండ్రటి ప్రభామండలంలో అమర్చబడి ఉంటుంది...