Adsense

Showing posts with label MAHA SHIVARATRI POOJA. Show all posts
Showing posts with label MAHA SHIVARATRI POOJA. Show all posts

Thursday, March 11, 2021

శివాభిషేక ద్రవ్యాలు అభిషేక ఫలితం

శివాభిషేక ద్రవ్యాలు అభిషేక ఫలితం
శివుడికి అభిషేకమంటే అమితమైన ప్రీతి. అందుకే ఏ ఆలయాన్ని దర్శించినా అక్కడ శివుణ్ణి అభిషేకించుకునేందుకు ఆరాటపడతాం. సాధారణంగా నీటితోనే ఈ అభిషేకాదులు కొనసాగుతాయి. కొన్ని ప్రత్యేక సందర్భాల్లోనూ, కొన్నిసార్లు మన కోరికలననుసరించి వివిధ వస్తువులతో శివుడికి అభిషేకాన్ని జరిపిస్తుంటాం. అయితే శివాభిషేకానికి తగిన ద్రవ్యాలు.. వాటి ఫలితాలనూ కూడా తెలుసుకోవడం తెలుసుకుని ఆచరించడం విశేషం

పంచామృతాభిషేకం

పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార ఈ ఐదింటినీ కలిపి పంచామృతాలు అంటారు అంటే అమృతంతో సమానమైన ద్రవ్యాలని అర్థం. ఆవుపాలు సర్వశుభాలను కలిగిస్తాయి. ఆ ఆవుపెరుగు శారీరక ఆరోగ్యంతోపాటుగా పుష్టిని ప్రసాదిస్తుంది. ఆవునెయ్యి ఐశ్వర్యప్రదం. తేనెతో ముఖవర్చస్సు కలుగుతుంది. పంచదారతో దుఃఖాలు తొలగుతాయి. ఈ ఐదు ద్రవ్యాలను ఆ విడివిడిగా లేదా కలిపి అభిషేకించడాన్నే పంచామృతాలిషేకం అంటారు. అభిషేకించిన పంచామృతాలను తీర్థంగా స్వీకరించిన వారికి అనేక రకాల వ్యాధులు తొలగుతాయి.

భస్మాభిషేకం

ఏవస్తువైనా సరే! అగ్నిలో వేస్తే వాటి చివరిరూపం భస్మం. దానికి నాశనం ఉండదు. శాశ్వతత్వానికి  గుర్తుగా శివుడు భస్మాన్ని ధరిస్తాడు. ఆయనకు ఇష్టమైన ద్రవ్యాలలో మొదటిస్థానం భస్మానిదే భస్మోద్దూళిత విగ్రహాయనమః అని శివాష్టోతర్తంలో ఒకనామం ఉంది. దీనిని అనుసరించి శరీరమంతా విభూతి రాసుకున్న శివుణ్ణి భస్మభూషితాంగుడని భక్తులు తనివితీరా కీర్తిస్తారు. రుద్రకామ్యార్చనా అనే ఆగమగ్రంథంలో భస్మాభిషేక ప్రాధాన్యం చెప్పారు. సర్వపాపాలనూ తొలగించే భస్మాభిషేకం ద్వారా పాపాలు తొలగి పవిత్రత కలుగుతుంది. భూత, పిశాచాది బాధలు నివారణ అవుతాయి. శివుణ్ణి అభిషేకించిన భస్మాన్ని ప్రతిరోజూ నుదుటన ధరించడం ద్వారా శుభఫలితాలను పొందవచ్చు. భస్మాన్ని నీటిలో కలిపి కూడా అభిషేకించవచ్చు. దీనినే భస్మోదకం అంటారు

బిల్వాభిషేకం

సత్త్వ, రజ, తమో గుణాలకు ప్రతీకగా మూడు ఆకులు కలిగిన బిల్వాన్ని త్రిదళంఅనీ, బిల్వదళం అని అంటారు పూజాసంభారాలు ఏదీ లభించకున్నా చెంబెడు నీళ్ళుపోసి ఒక పత్రిదళాన్ని భక్తితో సమర్పిస్తే చాలు! అమితానందం చెందుతాడు భోళాశంకరుడు, లక్ష్మీదేవికి స్థానం బిల్వవృక్షం. అటువంటి బిల్వాలతో చేసే అర్చనలు, అభిషేకాలు సంపదలను పెంపొందిస్తాయి. నీటిలో బిల్వపత్రాలను వేసి ఆనీటిని లింగంపై అభిషేకించడం ద్వారా ఋణబాధలు తీరుతాయి

రుద్రాభిషేకం

శివుడి కంటి బిందువు నుండి ఆవిర్భవించినదే రుద్రాక్ష, అందులో దేవతలందరూ కొలువుంటారని పురాణాలు చెబుతున్నాయి. అటువంటి రుద్రాక్షలతో పరమేశ్వరుణ్ణి అభిషేకించిన వారి పాపాలన్నీ పటాపంచలవుతాయి. ఇక మరుజన్మంటూ ఉండదు.. అభిషేకంలో వినియోగించే రుద్రాక్షల సంఖ్య 11. 108, 1008 ఇలా శక్తిననుసరించి ఉండవచ్చు. అభిషేకం చేసిన తరువాత రుద్రాక్షలను మాలగాచేసి మెడలో ధరించవచ్చు

గంధాభిషేకం

భగవంతుడికి చేసే పదహారు రకాలఉపచారాలలో ఒకటి గంధం ఆనందానికి, ఆహ్లాదానికి, భోగానికి ప్రతీక గంధం, అంతేకాదు.. గంధం చల్లదనాన్నిస్తుంది. అందుకే గంధాన్ని దేవతలందరి అలంకరణలోనూ వాడతారు. గంధంతో ఆభిషేకించినవారికి భోగాలను ప్రసాదిస్తాడు సాంబశివుడు.

సుగంధద్రవ్యాభిషేకం

యాలకులు, కుంకుమపువ్వు, పచ్చకర్పూరం, కస్తూరి, వట్టివేరు మొదలైన చక్కటి వాసననిచ్చే ద్రవ్యాలను మెత్తటి పొడిగాచేసి ఆ పొడినిగాని, లేదా దానిని నీళ్ళతో కలిపి రుద్రుణ్ణి అభిషేకించాలి. తత్వఫలితంగా పుత్రసంతానప్రాప్తి, భోగ భాగ్యాలు, కలుగుతాయి

అన్నాభిషేకం

అన్నాభిషేకాన్నే అన్నపూజ అని కూడా అంటారు. అన్ని శివాలయాలలోనూ ఈ అన్నాభిషేకానికి విశేష ప్రాధాన్యతనిస్తారు. శుచిగా అన్నాన్ని వండి దానిలో కొంచెం పెరుగు-నెయ్యి కలిపి లింగంపై అభిషేకిస్తారు. తద్వారా అన్నపురాశి లింగాకృతిలో తయారవుతుంది. అలా ఏర్పడిన లింగాన్ని పూజించినా, దర్శించినా శుభఫలితాలు కలుగుతాయి. ఆకలిబాధలు తొలుగుతాయి. పంటలు విశేషంగా పండుతాయి. పూజానంతరం ఈ అన్నాన్ని ప్రసాదంగా పంచిపెట్టవచ్చు. లేదా నీటిలో కలపవచ్చు.

ఫలాభిషేకం

తినేందుకు మనం ఏ రకం పండ్లనైతే ఉపయోగిస్తున్నామో, అలాంటి రకపు పండ్లను శుభ్రమైన వాటిని ఎంచుకుని వాటినుండి రసాన్ని తీసి దానితో అభిషేకించడమే ఫలరసాభిషేకం. అనుకున్న పనులు విజయవంతంగా పూర్తికావడానికి ద్రాక్షపండ్ల రసం, శతృనివారణకు ఖర్జూరరసం, వైరాగ్యకాంక్షతో చేసేవారు నేరేడు పండ్ల రసం చాలాకాలంగా పీడిస్తున్న వ్యాధుల నివారణకు మామిడిపండ్ల రసం, ధనసంపదలకోసం చెరకురసం, అన్నిరకాల సంపదలకోసం కొబ్బరినీరు వాడడంద్వారా ఆయా ఫలితాలను పొందవచ్చు*


వివిధ ద్రవ్యాలతో శివలింగాభిషేకం చేసినందువల్ల కలిగే ఫలితాలు ఇవి..
చెరుకురసం - ధనప్రాప్తి
నెయ్యి - వంశవృద్ధి, ఆరోగ్యం
తేనె - పాపవిముక్తి, తేజస్సు
చక్కెర - దీర్ఘాయువు, సంతానం
బిల్వఫలాలు - సంపద 
దుఃఖనాశనం - పంచదార
కొబ్బరి నీళ్లు - సర్వ సంపదల వృద్ధి
భస్మ జలం - మహాపాప నాశనం
నవరత్న జలం - ధనధాన్య పుత్ర లాభాలు
మామిడి పళ్ల రసం - చర్మవ్యాధుల నిర్మూలనం 
పసుపు నీళ్లు - సౌభాగ్యం
నువ్వుల నూనె - అపమృత్యు భయం
పుష్పోదకం - భూలాభం
బిల్వజలం - భోగభాగ్యాలు
రుద్రాక్ష ఉదకం - ఐశ్వర్వం
 గరిక, వట్టివేరు - ధన కనక వస్తువాహనాలు
కస్తూరి, పరిమళ ద్రవ్యాలు - చక్రవర్తిత్వం

సేకరణ