Adsense

Showing posts with label Monday is the most auspicious day for Lord Shiva...!. Show all posts
Showing posts with label Monday is the most auspicious day for Lord Shiva...!. Show all posts

Thursday, March 7, 2024

శివుడి"కి, అత్యంత ప్రీతికరమైనరోజు సోమవారం...! Monday is the most auspicious day for Lord Shiva...!

శివుడి"కి,  అత్యంత ప్రీతికరమైనరోజు సోమవారం...!

"సోమ" అంటే.,
        "స+ఉమ"
"ఉమ"తో కూడినవాడు అనే అర్థం .......!

"శివుడు" శుభాలను ప్రసాదిస్తూ వుంటాడు....!
"పార్వతీ దేవి" సంతాన సౌభాగ్యాలను రక్షిస్తూ, వుంటుంది.......!

అందువలన "సోమవారం" రోజున "పార్వతీ "పరమేశ్వరులను అత్యత భక్తిశ్రద్ధలతో, ఆరాధించాలని "ఆధ్యాత్మిక గ్రంధాలు" చెబుతున్నాయి......!

           ఈ రోజున అంతా ఆ స్వామికి, "పూజాభిషేకాలు" జరుపుతుంటారు......!

ఇక కొంతమంది ఇంట్లో చిన్న పరిమాణంలో, గల "శివలింగాన్ని" ఏర్పాటు చేసుకుని,

పూజామందిరంలోనే స్వామికి "పూజాభిషేకాలు" నిర్వహిస్తుంటారు....!
ఇక ఎవరిలోనైనా ఆ "సదాశివుడికి" కావలసినది అంకితభావమే.....!

చిత్తశుద్ధితో పూజించాలేగాని, ఆయన అనుగ్రహించనిది లేదు......!!

          ఇలా "ఆదిదేవుడికి" సంతోషాన్ని కలిగించడం వలన, ఆ ఇంట ఎప్పటికీ "లేమి" అనే మాట వినిపించదని చెప్పబడుతోంది.....!

అంటే ఆ "స్వామి" అనుగ్రహం వలన "దారిద్ర్యం" అనేది ఇక ఆ ఇంటి దరిదాపుల్లోకి, రాదు.....!

ఈ కారణంగానే దారిద్ర్యాన్ని దహించేవాడిగా ఎంతోమంది భక్తులు ఆయనని సేవిస్తారు.....!

"సోమవారం" రోజున "పార్వతీ పరమేశ్వరులను" పూజించడం వలన "సమస్త పాపాలు" పటాపంచలై పోవడమే కాకుండా, "సంపదలు ......సౌఖ్యాలు" లభిస్తాయని స్పష్టం చేయబడుతోంది......!

             "శివపూజలో " ప్రధానమైన అంశం, అభిషేకం, శివుడు "అభిషేక ప్రియుడు".

"హాలాహలాన్ని" కంఠమందు ధరించాడు...! "ప్రళయాగ్ని" సమానమైన మూడవ కన్ను కలవాడు.....! నిరంతరం "అభిషేక జలం" తో "నేత్రాగ్ని" చల్లబడుతుంది......!

అందుచేతనే "గంగను, చంద్రవంక" ను తలపై ధరించాడు శివుడు.
                                   
        ఓం నమః శివాయ!