Adsense

Showing posts with label Paneer burji kurry. Show all posts
Showing posts with label Paneer burji kurry. Show all posts

Monday, May 1, 2023

పనీర్‌ బుర్జీ కర్రీ Paneer burji kurry

పనీర్‌ బుర్జీ కర్రీ

కావలసినవి
పనీర్‌- అరకేజీ, టొమాటో- ఒక కేజీ, నెయ్యి- రెండు టేబుల్‌స్పూన్లు, బిర్యానీ ఆకుల - రెండు, ఎండు మిర్చి- మూడు, యాలకులు- ఐదు, జాపత్రి- కొద్దిగా, లవంగాలు- నాలుగైదు, మిరియాలు- పావు టీస్పూన్‌, అల్లం వెల్లుల్లి పేస్టు- మూడు టీస్పూన్లు, జీలకర్ర- రెండు టీస్పూన్లు, పచ్చి మిర్చి- మూడు, ఉల్లిపాయ- ఒకటి, మెంతి పొడి- ఒక టీస్పూన్‌, జీడిపప్పు - అర కప్పు, క్రీమ్‌- అర కప్పు, కారం- ఒక టీస్పూన్‌, జీలకర్ర పొడి- ఒక టీస్పూన్‌, కొత్తిమీర- ఒక కట్ట, ఉప్పు- తగినంత, నిమ్మరసం- కొద్దిగా.
తయారీవిధానం
కొంత పనీర్‌ను క్యూబ్‌లుగా, మిగతా పనీర్‌ను గుజ్జుగా చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం పట్టించి పక్కన పెట్టుకోవాలి. టొమాటోలను ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. పాన్‌లో నూనె వేసి బిర్యానీ ఆకు, ఎండు మిర్చి, జాపత్రి, యాలకులు, లవంగాలు, మిరియాలు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి వేగించాలి. కాసేపు వేగిన తరువాత టొమాటో ముక్కలు, తగినంత ఉప్పు వేసి చిన్న మంటపై ఉడికించాలి. జీడిపప్పును మిక్సీలో పొడి చేసుకొని టొమాటో గ్రేవీలో కలిపి చిన్న మంటపై ఉడికించాలి. ఇప్పుడు పనీర్‌ గుజ్జు వేసి కలపాలి. కాసేపు ఉడికిన తరువాత దింపి పక్కన పెట్టుకోవాలి. మరొక పాన్‌లో నెయ్యి వేసి జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లంవెల్లుల్లి, ఉల్లిపాయలు వేగించాలి. ఉల్లిపాయలు గోధుమరంగులోకి మారిన తరువాత కారం, జీలకర్రపొడి, మెంతిపొడి వేసి కలపాలి.
టొమాటో, జీడిపప్పు పేస్టు వేసి కలియబెట్టాలి. క్రీమ్‌, నిమ్మరసం వేసి మరికాసేపు ఉడికించాలి. ఇప్పుడు పనీర్‌ క్యూబ్‌లు వేసి చిన్నమంటపై కాసేపు ఉడికించాలి.
పక్కన పెట్టుకున్న పనీర్‌ గుజ్జు వేసి కొత్తిమీరతో గార్నిష్‌ చేసుకుంటే బుర్జీ రెడీ.