పారిజాత పుష్పాలు 9రకాలు
1.ఎర్ర(ముద్ద)పారిజాతం
2.రేకు పారిజాతం
3.తెల్లగా ఎర్ర కాడతో ఉండే పారిజాతం (ఎక్కువగా అందుబాటులో ఉన్నది)
4.పసుపు పారిజాతం
5.నీలం పారిజాతం
6.గన్నేరు రంగు పారిజాతం
7.గులాబీరంగు పారిజాతం
8.తెల్లని పాలరంగు పారిజాతం
9.ఎర్ర రంగు పారిజాతం
ఎరుపు రంగు పారిజాతం తో విష్ణువును ఆరాధించరాదు. ఎరుపు తమోగుణం విష్ణువు సత్వగుణం.
పారిజాత పుష్పాలు క్రింద పడిన వాటినే వాడాలి. చెట్టు నుండి కోసి వాడరాదు.
పారిజాత వృక్షం తపస్సు చేసి తన పూలను తాను ఇస్తేనే తప్ప తన నుండి ఎవరూ లాగు కోకూడదని వరం పొందినది.
రంగు,..వైశాల్యం,..గుణం,..దేవతా స్వరూపాన్ని బట్టి దేవతలను ఆరాధించాలి.
ఏ పూలను క్రింద పడ్డవి పూజకు వాడరాదు. ఒక్క తెల్లగా ఎర్రని కాడతో పారిజాత పూవు తప్ప.
భూ స్పర్శ, మృత్తికా(మట్టి)స్పర్శ
జల స్పర్శ ,హస్త స్పర్శ
తరువాత స్వామి స్పర్శ.
ఈ 5 స్పర్శల తోను
పంచ మహా పాతకాలను
పోగొట్టేదే పారిజాతం...స్వస్తి..