Adsense

Showing posts with label Rama nama mahima. Show all posts
Showing posts with label Rama nama mahima. Show all posts

Thursday, March 23, 2023

రామ నామ మహిమ

 
శ్రీ రామ నామము అతి పవిత్రమైన,శక్తి వంతమైన తారకమంత్రమని పురాణ గ్రంథాలు కీర్తిస్తున్నవి.

సద్గురు శ్రీ త్యాగరాజస్వామి వారు 96 కోట్ల సార్లు
తారకమంత్రాన్ని జపించి సిధ్ధి పొందారు.
పురందర దాసు తాము రచించిన  భక్తి
పాటలలో  రామతారక మంత్రానికి సాటియైనది
మరొకటి లేదన్నారు.

రామభక్తుడైన ఆంజనేయస్వామి రామనామ మంత్రం జపించి
పలు కార్యాలలో విజయం సాధించడం మనకి తెలుసు.
ఒకసారి  కొందరు యోగులు   ఆయన వద్దకు వెళ్ళి   శ్రీ రామ తారకమంత్రం ఉపదేశించమని అడిగారు.
అప్పుడు ఆంజనేయుడు  " మీరు లౌకిక సుఖాల కోసం రామ మంత్రాన్ని ఉపయోగిస్తారు. ఆ సందర్భాలలో
మీరు నా వద్దకు వస్తే మీ కష్టాలు తొలగిపోతాయి.   అందువలన పవిత్రమైన రామనామాన్ని  భక్తి తో పరలోక ముక్తి
పొందడానికి మాత్రమే  జపించండని ఆంజనేయుడు ఉపదేశించాడు.

మరాఠా చక్రవర్తి ఛత్రపతి శివాజీ తన రాజ్యాన్ని గురువైన సమర్థ రామదాసుకి అప్పగించి, ఆయన సందేశం కోసం ఎదురుచూస్తూ నిలబడి వున్నాడు. అప్పుడు రామదాసు
" ఇకపై మన మహారాష్ట్ర  దేశంలో ప్రతీ ఒక్కరూ
" హే !రామ్'' అనే సంబోధనతోనే తమ సంభాషణ   ఆరంభించాలి. ఇది రాజాజ్ఞగా ప్రజలంతా
పాటించేలా ఆజ్ఞలు జారీ చేయమని ఆదేశించాడు.

రామనామ
రసాన్ని సదా ఆస్వాదించు.  అన్ని కష్టాల నుండి విముక్తి పొందుతావని సదాశివబ్రహ్మేంద్రులవారు అంటారు.

శ్రీ ముత్తుస్వామి దీక్షితులు వారు కాశీలో
ఒక శివ యోగి వద్ద దీక్ష ని పొందేరు.
ఆ సమయంలో గంగలో ఆయనికు ఒక వీణ
దొరికింది. శ్రీ రామ  నామము వున్న ఆ వీణ
గంగాదేవి  ఆశీర్వాదం గా తీసుకున్నారు.

భూలోకంలో ప్రజలు రామనామం జపించడం చూసిన యమధర్మరాజు  పాపులనేవారే లేకుండాపోయి తన అవసరమే లేకుండా పోతుందని
విచారించాడు....అని త్యాగరాజ స్వామి ఒక
కీర్తనలో రామనామ ఔన్నత్యాన్ని వినిపించారు.

మరియొక చోట రామ నామ జపమే
గంగాస్నానానికి సమానమని,
రామనామ స్మరణ  వదలి ఒక్క క్షణమైనా బ్రతుకులేనని
త్యాగరాజస్వామి తమ కీర్తనలలో రామనామ మహిమను వర్ణించారు.