Adsense

Showing posts with label Ranganath swamy. Show all posts
Showing posts with label Ranganath swamy. Show all posts

Saturday, March 25, 2023

ఆళ్వార్ ఆకలి తీర్చినశ్రీ రంగనాధుడు....!!




🌿శ్రీ మహావిష్ణువు తన పరమ భక్తులైన ఆళ్వార్ల భక్తికి మెచ్చి, స్వయంగా వచ్చి, రక్షించిన  సందర్భాలు అనేకం.

🌸అటువంటి దివ్యానుగ్రహం పొందిన మహా భక్తుడు 'కూరత్తాళ్వార్'.
ఈయన  కాంచీపురానికి సమీపాన
వున్న 'కూరం' అనే వూరిలో  పుష్యమాస పంచమి తిధినాడు జన్మించాడు.

🌿ఈయనకు కూరేశర్ , కూరాధిపర్, కూరనాదర్ శ్రీ వత్ససింహర్,శ్రీ వత్సాంకర్ అనే  యితర  నామాలు కూడా వున్నాయి.  విష్ణు పాశురాలు గానం చేయడంలో  ఘన కీర్తి
సంపాదించాడు.

🌸కూరత్తాళ్వా‌ర్ చాలా ధనవంతుడు.  ఎంతో దయాపరుడు.  అన్నీవున్న ఈయనకు సంతానం మాత్రం లేదు.
సహాయం కోరి వచ్చిన వారందరికీ లేదనకుండా  దాన ధర్మాలు చేసేవారు

🌿 యీ  కూరత్తాళ్వార్  దంపతులు .
ధనంతో వచ్చిన గర్వం మిక్కిలి
చెడ్డదని తలచిన కూరత్తాళ్వారు తమ వద్దనున్న సంపదలని
దాన ధర్మాలు చేయడంలో పూర్తిగా వినియోగించడంతో  సంపదంతా కోల్పోయి ,

🌸నిరుపేదలుగా మిగిలి పోయారు. రోజు రోజు కి తిండి గడవడమే కష్టమైంది. ఆహార సంపాదనకి మార్గం తెలియ లేదు. అంత దీనావస్ధలో కూడా
యితరుల వద్ద సహాయాన్ని అర్ధించలేదు.

🌿శ్రీ రంగనాధుని ప్రార్ధిస్తూ ఆరన ధ్యానంలోనే వుండిపోయారు.
ప్రతి రోజూ  రాత్రి వేళల్లో
శ్రీ రంగనాధుని శయనాగారానికి పంపేముందు, ఆలయంలో
'అరవణై ప్రసాదం' అనే ఒక
రుచికరమైన ప్రసాదాన్ని
నివేదన చేయడం ఆచారం.

🌸నివేదన  సమయంలో, ఆలయగంటలు మ్రోగిస్తారు. ఆ రోజూ కూడా గంటలు మ్రోగాయి. ఆ గంటల శబ్దం కూరత్తాళ్వారు చెవిలో పడింది. దంపతులు యిద్దరూ చాలా ఆకలితో
వున్నారు.

🌿ఆళ్వార్ భార్యకి దుఃఖం పొంగిరాగా, తమ దుస్థితి కి పదే పదే చింతిస్తూ రంగనాధుని స్మరించుకుంది.
ఆవిడ మనసులోని కష్టం
పరంధాముని చెవిన పడింది.

🌸కొద్ది సేపపు తర్వాత ఎవరో వచ్చి  కూరత్తాళ్వారు ఇంటి తలుపు  తట్టారు. ఆ వచ్చిన వారిని లోపలికి
ఆహ్వానించాడు కూరత్తాళ్వార్.
ఇంత రాత్రి వేళ వచ్చిన వారికి ఆతిధ్యమివ్వడానికి  పెట్టడానికి తమ వద్ద ఏమీ వుందా అని  ఆలోచిస్తూ వుండగా ,

🌿వచ్చిన వారు నేను భక్త దాసుడిని, నన్ను అందాల మణవాళదాసన్, అంటారు. మీకు  స్వామి ప్రసాదం
తీసుకుని వచ్చాను తీసుకొమ్మని  బలవంతంగా చేతిలో పెట్టి క్షణాలలో
వెంటనే కనుమరుగై  పోయారు.

🌸ప్రసాదం తీసుకొన్న కూరత్తాళ్వార్ భార్య వైపు ప్రశ్నార్థకంగా చూశాడు. కూరత్తాళ్వార్ భార్య తను మనసులో తలచినది చెప్పింది.

🌿అప్పుడు కూరత్తాళ్వారు కి విషయం  అర్ధమయింది. తమకు ప్రసాదం యిచ్చి వెళ్లినది శ్రీ రంగనాధుడేనని.

🌸ఆ అరవణ ప్రసాదాన్ని మూడు భాగములు చేసి, రెండు భాగాలు భార్యకి యిచ్చి,
ఒక భాగం తను భుజించాడు.

🌿భగవంతుని  రెండు భాగముల ప్రసాదం  భుజించిన కూరత్తాళ్వార్  భార్య గర్భవతి అయింది. సంతానమే  లేని వారికి ఇద్దరు పిల్లలు కలిగారు.
వారికి  భట్టరు, శ్రీ రామపిళ్ళై అని పేర్లు పెట్టి పెంచారు. వారు తల్లితండ్రుల వలెనే సన్మార్గాన నడిచి సత్కీర్తి పొందారు.

🌸శీమహావిష్ణువు కి దాసభక్తుడైన  కూరత్తాళ్వార్ జన్మదినోత్సవాన్ని ప్రతీ ఏటా శ్రీ రంగం రంగనాధస్వామి ఆలయంలో, కాంచిపురంలోని వరదరాజ పెరుమాళ్ ఆలయంలో  ఘనంగా నిర్వహిస్తూంటారు...స్వస్తి.