Adsense

Showing posts with label Rishi konda. Show all posts
Showing posts with label Rishi konda. Show all posts

Thursday, March 30, 2023

టీటీడీ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం, విశాఖపట్నం జిల్లా : రుషికొండ


 


💠 సువిశాల సాగర తీరం.. పైగా సుందర పర్యాటక ప్రాంతం.. ఆధ్యాత్మిక నగరి కూడా.. అలాంటి విశాఖలో మరో అద్భుతానికి వేదిక  అయింది

💠 వైజాగ్‌లో ఇప్పటి వరకు సింహాచలం దేవస్థానమే చాలా మందికి తెలుసు.
ఆ తర్వాత వైజాగ్ అంటే అందరూ బీచ్ అనుకుంటారు.. ఆ తర్వాత కైలాసగిరిని సందర్శిస్తున్నారు....అలాంటి విశాఖ వాసులకు తిరుమల వెంకన్న దర్శనం కావాలంటే మాత్రం గంటల తరబడి ప్రయాణించి తిరుమల  ఏడుకొండలకు చేరుకోవాలి. కానీ ఇప్పుడు ఆ వైకుంఠవాసుడే విశాఖ తరలివచ్చాడు
భక్తులను కరుణించేందుకు విశాఖపట్నం లో తిరుమల వెంకన్న కొలువుదీరాడు

💠 ఉత్తరాంధ్ర వైకుంఠంగా విశాఖలో ఒక వెంకటేశ్వర క్షేత్రం ఉండాలనే ఉద్దేశ్యంతో టీటీడీ 2019లో ఈ ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించింది .

💠 తిరుమల తిరుపతి దేవస్థానం వివిధ ప్రాంతాల్లో ఆలయాలను నిర్మిస్తోంది.
హిందూ ధర్మాన్ని విస్తరించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తోంది. ఇందులో భాగంగా ప్రముఖ పర్యాటక ప్రదేశంగా గుర్తింపు పొందిన రుషికొండపై ఆలయాన్ని టీటీడీ నిర్మించింది. ఏడు కొండలవాడి వైభవానికి ప్రతీకగా నిలిచేలా నిర్మాణాన్ని చేపట్టింది.

💠 విశాఖపట్నంలోని ,రుషికొండలో సముద్రానికి అభిముఖంగా కొండపై తిరుమల తిరుపతి దేవస్థానం (T.T.D ) నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం భక్తుల దర్శనాలకు సిద్ధమైంది

💠 ఎండాడలో ( రిషికొండ)  వేంకటేశ్వరస్వామి నిర్మాణం కోసం ప్రభుత్వం 10 ఎకరాల భూమిని కేటాయించింది. నిర్మాణంకు అయ్యే నిధులను తిరుమల తిరుపతి దేవస్థానం సమకూర్చింది. రూ.28 కోట్లతో వేంకటేశ్వరస్వామి ఆలయం నిర్మాణం టిటిడి మాదిరిగానే తీర్చిదిద్దారు.

💠 తిరుమలలో మాదిరిగానే ఈ ఆలయంలో కూడా పూజలు, సేవలు, ఇతర ఉత్సవాలు నిర్వహిస్తారు.

💠 ఆలయం ప్రారంభమైన నాటి నుంచే టీటీడీ దివ్యక్షేత్రం వేంకటేశ్వరుని దివ్యదర్శనం, స్వామి సేవలతో పాటు లడ్డూలు అందుబాటులోకి వచ్చాయి.

💠 తిరుమల -తిరుపతి  వెళ్లలేనివారు ఇక్కడ స్వామి వారి దర్శనం చేసుకోవచ్చు.
ప్రసాదాలు,ప్రత్యేక పూజుల చేయ్యించుకోవచ్చు.
 
💠 తిరుమలలో ఏ విదమైన పూజలు నిర్వహిస్తారో ఇక్కడ కుడా అలాంటి సేవలను ఎర్పాటు చేసారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఎర్పాట్లు చేసారు.

💠 విశాఖలో ఆలయం  అచ్చం తిరుమలను తలపిస్తోంది. రుషికొండ దగ్గర ఉన్న ఘాట్ రోడ్డు, మెట్ల మార్గం.. ఇలా చూస్తే మరో తిరుమలలా అనిపిస్తోంది అంటారు ఆ ఆలయాన్ని చూసిన భక్తులు..

💠 తిరుమలలో శిల్ప కళాకారులు తయారుచేసిన శ్రీవేంకటేశ్వరస్వామి, ఆంజనేయ స్వామి, శ్రీవారి పాదాలు, భూదేవి ఇతరత్రా విగ్రహాలను విశాఖకు తీసుకువచ్చారు. ఇక్కడికి స్వామి వారి ఆభరణాలనూ పంపింది టీటీడీ.

💠 ఈ ఆలయంలో నిత్యం పూజా కార్యక్రమాలను నిర్వహించేందుకు వీలుగా ఇద్దరు అర్చకులను నియమించింది.
కొండ కింది భాగంలో టిక్కెట్ కౌంటర్లు, ప్రసాద కౌంటర్లు, కల్యాణోత్సవ వేదిక, కార్యాలయాలను అందుబాటులోకి తెచ్చారు

💠 ఈ ఆలయానికి ఎదురుగా తిరుమల తరహాలో ఆంజనేయస్వామి ఆలయాన్ని సైతం నిర్మించారు.
ఇరువైపులా శ్రీదేవి, భూదేవి ఆలయాలను నిర్మించారు.

💠 ఈ ఆలయానికి మరో ప్రత్యేక కూడా ఉంది అంటున్నారు. ఆలయానికి ఉన్న నాలుగు వైపుల నుంచి ఎటు నుంచి చూసినా ఒకేలా కనిపించేలా నిర్మించారని చూసిన భక్తులు చెబుతున్న మాట..

💠 ఈ ఆలయ నిర్మాణంతో  సుప్రభాత సేవతో మొదలుకొని..పవళింపు సేవ వరకు శ్రీ వెంకటేశ్వరుడి నామస్మరణతో విశాఖ నగరం పులకించనుంది.

💠 ప్రధాన దేవాలయాన్ని ఒకటిన్నర ఎకరం స్థలంలో నిర్మించారు.
మొదటి అంతస్తులో మహాలక్ష్మి, గోదాదేవి సమేతంగా వెంకటేశ్వర స్వామి కొలువై ఉంటారు. ఇక స్వామి వారికి ఇరువైపులా అమ్మవార్ల ఆలయాలు ఉంటాయి.
దిగువ అంతస్తులో ధ్యాన మందిరం, కల్యాణోత్సవ మండపం ఏర్పాటు చేశారు.

💠 ఇక్కడి ఆలయంలో శ్రీనివాసుడి విగ్రహం 7 ఆడుగుల ఎత్తులో ఉంటుంది.
స్వామివారి ఆలయంలోనికి ప్రవేశించే చోట శ్రీవారి పాదాలను చెక్కారు .


💠 ఈ ఆలయాన్ని సందర్శించేందుకు వెళ్లేవారికి.. ఆధ్యాత్మిక భావన కలడంతో పాటు.. అందమైన సముద్రాన్ని చూసే అవకాశం కూడా ఉంటుంది.