Adsense

Showing posts with label Sacred Mountains. Show all posts
Showing posts with label Sacred Mountains. Show all posts

Wednesday, November 13, 2024

Mount Kailash: కైలాస పర్వతం శివుని నివాసం. మానవుడికి అంతుచిక్కని మిస్టరీ

Mount Kailash: కైలాస పర్వతం  శివుని నివాసం. మానవుడికి అంతుచిక్కని మిస్టరీ.

వేల ఏండ్లుగా ఎన్నో రహస్యాలను తనలో ఇముడ్చుకున్న కైలాస పర్వతం మిస్టరీని ఇప్పటికీ ఎవరూ ఛేదించలేకపోయారు. స్వయంగా పార్వతీ పరమేశ్వరులే ఇక్కడ కొలువై ఉన్నారని హిందువుల ప్రగాఢ విశ్వాసం.

హిమాలయ పర్వత శ్రేణుల్లో ఒక భాగంగా ఉన్న ఈ శిఖరం ఎవరెస్ట్ కన్నా 2 వేల మీటర్లు తక్కువే ఉంటుంది. కానీ ఇప్పటివరకు కైలాస పర్వతాన్ని ఏ మానవ మాత్రుడూ అధిరోహించలేకపోయాడు.

సనాతన ధర్మంలో కైలాస పర్వతం చాలా పవిత్రంగా పరిగణించబడుతుంది. ఈ పర్వతంపై శివపార్వతులు గణేశుడు కార్తికేయుడితో కలిసి నివసిస్తారని నమ్ముతారు. ఇక్కడ శివుడు నిత్యం యోగ సాధనలో నిమగ్నమై ఉంటాడని అందుకే ఈ ప్రాంతంలో విచిత్రమైన వాతావరణ పరిస్థితులు ఉంటాయంటారు. కైలాస పర్వతానికి ప్రదక్షిణలు చేసేందుకు వెళ్లిన భక్తులు ఆ పర్వతం దగ్గరకు రాగానే ఓ వింత శబ్దం వెలువడిందని, అది ఓం అని వినిపిస్తుందని చెప్పారు.

మరొక పురాణం ప్రకారం.. కైలాస పర్వతం శివుని నివాసం కాబట్టి. అందుచేత జీవించి ఉన్న ఏ మానవుడూ దానిపై ఎక్కలేడు. తన జీవితంలో ఎప్పుడూ పాపం చేయని వ్యక్తి మాత్రమే కైలాస పర్వతాన్ని చేరుకోగలడు ఈ కథనాలు నిజమా లేక అసలు కారణం మరేదైనా ఉందా? అనేది చాలా కాలంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్వతారోహకులను కలవరపెడుతున్న రహస్యం. ఈ మిస్టరీని ఛేదించేందుకు ఎప్పటికప్పుడు ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి.

1999 సంవత్సరంలో, రష్యా శాస్త్రవేత్తల బృందం కైలాస పర్వత మిస్టరీని ఛేదించేందుకు ప్రయత్నించింది. ఇందుకోసం శాస్త్రవేత్తల బృందం నెల రోజుల పాటు కైలాసం దిగువన ఉండి అనేక రకాల పరిశోధనలు జరిపారు. చివరకు కైలాస శిఖరం సహజంగా ఏర్పడలేదని, అది ఒక పిరమిడ్ రూపంలో ఉండి మందపాటి మంచుతో కప్పబడి ఉందని తేల్చారు. దీనికి వారు "శివ పిరమిడ్" అని అభివర్ణించారు.

8 సంవత్సరాల ఈ పరిశోధన తర్వాత, 2007 సంవత్సరంలో, ఒక రష్యన్ పర్వతారోహకుడు సెర్గీ సిస్టికోవ్ తన బృందంతో కలిసి కైలాష్ పర్వతాన్ని అధిరోహించడానికి ప్రయత్నించాడు, కానీ అతను విఫలమయ్యాడు. దిగిన తర్వాత, అతను తన తన భయంకర అనుభవాన్ని పంచుకున్నాడు.

అవయవాలు పనిచేయవు..

సెర్గీ సిస్టికోవ్ మాట్లాడుతూ.. 'కొంత ఎత్తుకు చేరుకున్న తర్వాత, నాతో సహా నా మొత్తం జట్టుకు తీవ్రమైన నొప్పితో తల పగిలిపోతున్నట్లు అనిపించింది. దవడ కండరాలు బిగుసుకుపోయాయి. నాలుక లోపలే స్తంభించిపోయాయి. మాట్లాడాలనుకున్నా కానీ మా గొంతు నుంచి శబ్దం బయటకు రాలేదు. అప్పుడు మా కాళ్లు కూడా అచేతనంగా మారిపోయాయి. ఏదో అదృశ్య శక్తి మా అవయవాలన్ని పనిచేయకుండా ఆపినట్టు మాకు అనిపించింది. వెంటనే దిగమని ఒకరికొకరు సంకేతాలు ఇచ్చుకున్నాం. మేము కిందకు రావడం ప్రారంభించినప్పుడు, మా అవయవాలన్నీ సాధారణ స్థితికి వచ్చాయి. దిగిన తర్వాత మాకు ఉపశమనం లభించింది' అని తెలిపాడు.

బ్రిటీష్ పర్వతారోహకుడు కల్నల్ విల్సన్ కూడా కైలాస పర్వతాన్ని అధిరోహించడానికి ప్రయత్నించాడు, కానీ అతనికి కూడా అది సాధ్యపడలేదు. విల్సన్ తన అనుభవాన్ని వివరిస్తూ, 'పర్వతంపై దట్టమైన మంచు పొర ఉంది. పైకి ఎక్కడానికి ముందుకు చూడగానే వెంటనే మంచు కురుస్తోంది. దీని తరువాత, మార్గం కనిపిస్తుంది. ఈ హిమపాతం చాలా సేపు కొనసాగింది దీంతో నేను క్రిందికి దిగవలసి వచ్చింది. చాలా రోజుల పాటు ఇదే తంతు. ఏదో శక్తి మమ్మల్ని ముందుకు వెళ్లకుండా ఆపుతున్నట్లు అనిపించింది. చివరికి నా ప్రయత్నాన్ని ఆపేసి తిరిగి వెళ్లాల్సి వచ్చింది' అని తెలిపాడు.

ఎక్కితే ముసలివాళ్లు అవుతారు..

దీని తరువాత కైలాస పర్వతం రహస్యాలను ఛేదించడానికి చైనా చాలా మంది పర్వతారోహకులను పంపింది. కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు, బౌద్ధులు, జైనులు దీనిని ఎంతగా వ్యతిరేకించారు.చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వం వెనక్కి తగ్గవలసి వచ్చింది. నాటి నుంచి నేటి వరకు ఈ పర్వతాన్ని అధిరోహించే ధైర్యం ఎవరూ చేయలేదు.

ఎవరైతే ఈ పర్వతాన్ని అధిరోహించాలని ప్రయత్నిస్తారో, వారి తలపై వెంట్రుకలు, గోర్లు వేగంగా పెరుగుతాయని చెప్పారు. వయసు వేగంగా రావడం మొదలవుతుంది. ముఖంలో వృద్ధాప్యం కనిపించడం ప్రారంభమవుతుంది. ముందుకు వెళ్లడానికి ప్రయత్నించే ఏ వ్యక్తి అయినా భ్రాంతికి గురవుతాడు. అతను ముందుకు వెళ్ళే మార్గాన్ని చూడలేడు. అతని అవయవాలు ఒక్కొక్కటిగా పనిచేయడం మానేస్తాయి. ఎక్కే వ్యక్తికి అకస్మాత్తుగా గుండె వేగంలో మార్పు వస్తుంది. ఈ పర్వతం చుట్టూ ఉన్న నిలువు రాళ్లు, మంచుకొండలతో ఏర్పడింది, దీని కారణంగా పైకి ఎక్కడానికి మార్గం కనిపించదు. ఈ పర్వతం వాలు 65 డిగ్రీల కంటే ఎక్కువగా ఉంటుంది, ఈ నిర్మాణం వల్ల పైకి ఎక్కడం అసాధ్యం అవుతుంది.