Adsense

Showing posts with label Sita. Show all posts
Showing posts with label Sita. Show all posts

Sunday, March 31, 2024

అహల్యా, ద్రౌపదీ, సీతా, తారా, మండోదరి గురించి తెలుసుకుందాం. Let's learn about Ahalya, Draupadi, Sita, Tara and Mandodari

 అహల్యా, ద్రౌపదీ, సీతా, తారా, మండోదరి తథా పంచకన్యా స్మరేన్నిత్యం మహాపాతక నాశనమ్.

అహల్య, ద్రౌపదీ, సీత, తార, మండోదరి ఈ ఐదుగురు పుణ్య మాత మూర్తులను రోజూ స్మరించినట్లయితే మహాపాతకాలు కూడా నాశనమవుతాయని ఈ శ్లోక భావం. ఈ నలుగురు పతివ్రతా మూర్తుల గురించి తెలుసుకుందాం.

అహల్య
అహల్య గౌతమ మహర్షి భార్య..! ఈమె వృత్తాంతము రామాయణములో పేర్కొనబడినది. శాపము వలన రాయిగా మారిన అహల్య, రాముని పాదధూళి సోకి శాప విమోచనమై తిరిగి స్త్రీ రూపము ధరించిందని కొన్ని రామాయణ వృత్తాంతాలలో పేర్కొనబడినది.

ద్రౌపదీ..
పూర్వ జన్మలలో ఆమె వేదవతి, ఆ తరువాత మౌద్గల్య ముని భార్య ఇంద్రసేన. ఆ తరువాతి జన్మలో ఆమె కాశీరాజు కుమార్తె అనామికగా జన్మించింది. పతికోసం ఘోరమైన తపస్సు చేసింది. పరమశివుడు ప్రత్యక్షమై ఏం కావాలని అడిగాడు. పతి అన్న పదాన్ని ఐదుసార్లు పలికింది ఆమె. ఐదుగురు పతులను అనుగ్రహించాడు శివుడు. నీకు ఐదుగురు పతులున్నా అది ధర్మవిరుద్ధమని ఎవరూ భావించరు అని, ఆమె కోరుకొన్న విధంగా ఐదుగురితో సుఖించటానికి తగ్గ యవ్వనం, కామభోగేచ్ఛ, వారిని సేవించేందుకు అవసరమైన శుశ్రూషాభావం, కన్యాత్వం, సౌభాగ్యం అనుగ్రహించాడు. మరుజన్మలో ఆమె యజ్ఞం చేస్తున్న ద్రుపదుడికి అగ్నిగుండంలో లభించింది.

సీతాదేవి! వాల్మీకి మహర్షే శ్రీ రామాయణాన్ని "సీతాయాశ్చరితం మహత్'' అని వెల్లడిచేశారు.

క్షమ..దయ...ధైర్యం...వివేకం... ఆత్మాభిమానం కలబోసిన ఉదాత్తమైన స్త్రీ పాత్ర 'సీత'. ఆమె లేనిదే రామాయణం లేదు. ఒక ఇల్లాలిగా తన భర్త బాధ్యతలో, కర్తవ్య దీక్షలో తను కూడా పాలుపంచుకొని ఆదర్శ గ హిణిగా మెలిగిన మహాసాధ్వి 'సీతాదేవీ'. రాముడు అరణ్యవాసానికి వెళ్లినప్పుడు భర్త అడుగుజాడల్లో తనూ నడిచి, అతని కష్టసుఖాల్లో పాలు పంచుకోవడానికి సిద్దమైన ధర్మపత్నిగా తన ధర్మాన్ని నిర్వర్తించింది. రావణ చరలో బందీ అయినప్పటికీ కూడా తన భర్తపై కల వాత్సల్యాన్ని ప్రేమను వదులుకోలేదు. రావణ వినాశనానికి, ధర్మ స్థాపనకు కారణం అయింది. దయాశాలి, అభిమానవతి, క్షమాగుణి, ధైర్యశాలి అయిన సీతామాత గుణగణాలను రామాయణంలో అడుగడుగునా వాల్మీకి మహర్షి ఎన్నో సందర్భాలలో చెప్పారు.

తారాదేవి!
వాలి భార్య తారాదేవి. సుగ్రీవుడి భార్యను వాలి చెరబట్టి, అతన్ని రాజ్యబహిష్క్రుతున్ని చేసినప్పుడు అది తప్పని వాలికి చెప్పింది. అన్నదమ్ములు కలహించుకుంటే రాజ్యానికి చేటని హితవు చెప్పింది. కానీ వాలి వినలేదు. దాంతో రామబాణానికి నేలకొరిగాడు. మరణించిన పతిదేవుని చూసి తాను కూడా చనిపోతానని తన పతిభక్తిని చాటుకుంది. ధర్మం ప్రకారం సుగ్రీవున్ని రాజ్యానికి రాజును చేసింది. కిష్కింధ రాజ్య పాలనకు మహారాణిగా తన సలహాలను చెప్పింది. రామకార్యానికి సుగ్రీవున్ని సమాయిత్తం చేసింది. మాటలు ఆచితూచి ఎలా మాట్లాడాలో రామాయణం చెప్తుంది అంటారు. కొన్ని ఘట్టాలు ఉదాహరణలు గా చూసి చాలా నేర్చుకోవాలి అని అనిపించక మానదు. ముఖ్యం గా సుందరకాండలో హను మంతుల వారు మాట్లాడిన తీరు, వాలి భార్య తార మాట్లాడే తీరు చదివితే తెలుస్తుంది. సుగ్రీవుడు అప్పుడే దెబ్బలుతిని పోయినవాడు మరల తిరిగి వచ్చి, సింహనాదం చేస్తూ వుంటే వాలిని వెళ్ళవద్దని, బలమైన కారణం వున్నది కనకే సుగ్రీవుడు తిరిగి వచ్చాడని నిశిత పరిశీలనతో చెబుతుంది. హెచ్చ రిస్తుంది. వాలి వినడు చని పోతాడు. ఆతర్వాత కూడా రామకార్యం మరిచి పోయాడని సుగ్రీవుడిపై కోపగించిన లక్ష్మణుడిని తన సంభాషణా చాతు ర్యంతో చల్లపరుస్తుంది. ఆమె ఆ సమ యంలో చెప్పిన మాటలు చూడండి. చాలా కాలం కష్టాలు పడ్డాడు. ఇప్పుడే ఆయన రాజు అయ్యాడు. రాముని దయ వల్ల రాజ్యం, రుమా, నేనూ దక్కాము. భోగాలనుభవిస్తున్నా, రాముని పని మానలేదు సుమా' అంటూ మాటాడగల్గిన చతుర తార . ఇలా తారాదేవి ప్రస్తావన రామాయణంలోని సుందరకాండలో అద్భుతంగా వివరించబడి ఉంది.

మండోదరి దేవి!!
రామాయణం జరగడానికి కీలకమైన వ్యక్తులలో ఒకరు రావణాసురుడు. అతడు ఎంతటి శివభక్తుడైనా సరే పరస్త్రీని వాంఛించడం అనే ఒకే ఒక్క దుర్గుణం వల్ల నాశనమైనాడు. అతడి భార్యే మండోదరి దేవి. రావణాసురుడు ఎంతటి అసురుడో ఈమె అంతటి మహాపతివ్రత. మాయాసురుడు కుమార్తె. రావణాసురుడు ఈమెను మోహించి అపహరించి పెళ్ళాడాడు. ఈమెకు పుట్టిన కొడుకు పేరు ఇంద్రజిత్తు. మండోదరి దేవి మిక్కిలి సౌందర్య రాశి. కేవలం బాహ్య సౌందర్యరాశి మాత్రమేగాదు అంతస్సౌందర్యం కూడా కలిగింది. అందుకే సీతమ్మ తల్లిని వెతుక్కుంటూ వచ్చిన హనుమంతుడు రావణుడితో కూడి ఉన్న ఈ స్త్రీరత్నాన్ని చూసి ఆమే సీతాదేవి అనుకున్నాడు కూడా. రావణాసురుడు సీతమ్మని అపహరించి తెచ్చినప్పుడు పరస్త్రీ వ్యామోహం వద్దని, నీతిని, ధర్మాన్ని కర్తవ్యాన్ని రావణాసురునికి బోధించింది. రావణాసుర వధానంతరం భర్తతో పాటు ప్రాణత్యాగం చేయ డానికి సాహసించింది.