THE COMPLETE BLOG FOR PEOPLE // NEWS, DEVOTIONAL, TECHNOLOGY, LIFE STYLE, SPORTS, ENTERTAINMENT, SCIENCE, ONLINE EARNING, RIDDLES, SILLY QUESTIONS, IMPORTANT DAYS, BEAUTY TIPS, HEALTH
Adsense
Showing posts with label Subramanya swamy Pooja. Show all posts
Showing posts with label Subramanya swamy Pooja. Show all posts
Thursday, March 23, 2023
సుబ్రహ్మణ్యుని పాదములను స్మరిస్తే మనస్సుకు శాంతి కలుగుతుంది ....!!
🌿ఒక సారి జగద్గురువులు శ్రీ ఆది శంకరాచార్యుల వారు సుబ్రహ్మణ్య దర్శనం కోసమై తిరుచెందూర్ వెళ్లారు. అక్కడ ఆయన ఇంకా సుబ్రహ్మణ్య దర్శనం చేయలేదు, ఆలయం వెలుపల కూర్చుని ఉన్నారు.
🌸అప్పుడు ఆయనకి ధ్యానములో సుబ్రహ్మణ్య స్వామి
వారి దర్శనము అయ్యింది.
వెంటనే శంకరులు సుబ్రహ్మణ్య భుజంగం చేశారు.
ఈ భుజంగ స్తోత్రము ద్వారా..ఎన్నో దోషాలు పోగొట్టుకోవచ్చు.
🌿మనల్ని, మన వంశాలనీ పట్టి పీడించేసే కొన్ని దోషాలు ఉంటాయి,
అటువంటి వాటిలో నాగ దోషం లేదా కాల సర్ప దోషం ఒకటి .
దీనికి కారణం మనం తప్పుచేయకపోవచ్చు,
ఎక్కడో వంశంలో తప్పు జరుగుతుంది,
దాని ఫలితము అనేక విధాలుగా అనుభవిస్తూ ఉండవచ్చు.
🌸ఉదాహరణకు, సంతానము కలుగక పోవడం, కుష్ఠ రోగం మొదలైనవి.
అటువంటి దోషములను కూడా పోగొట్టే సుబ్రహ్మణ్య శక్తి ఎంత గొప్పదో, శంకరులు ఈ సుబ్రహ్మణ్య భుజంగము ద్వారా తెలియజేశారు.
🌿ఎంతో అద్భుతమైన స్తోత్రం ఇది.చివరిలో సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం ఉన్నది, వీలుంటే ఒకసారి భక్తితో పటించండి
🌸ఈ సంసారము అనే మహా సముద్రము నుండి మనలను కడతేర్చడానికి నేనున్నాను మీకు అని అభయం ఇవ్వడానికే స్వామి ఇక్కడ నివాసము ఉంటున్నారు.
🌿అందుకే శంకర భగవత్పాదులు స్వామిని “మహాంబోధితీరే మహాపాపచోరే. అని కీర్తించారు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రములో.
🌸అంతటి శక్తి ఈ తిరుచెందూర్ క్షేత్రమునకు ఉన్నది.
అలానే శరవణభవ అనే నామానికి ఉన్న ప్రాశస్త్యం ఏమిటో తెలుసుకుందాం
🌸శ్రీ సుబ్రహ్మణ్యం శరణం ప్రపద్యే “శరవణభవ”…
ఓం శ్రీ వల్లిదేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః.
🌿శ – లక్ష్మీబీజము అధిదేవత శంకరుడు
ర – అగ్నిబీజము అధిదేవత అగ్ని
వ – అమృతబీజము అధిదేవత బలభద్రుడు
ణ – యక్షబీజము అధిదేవత బలభ్రద్రుడు
భ – అరుణ బీజము అధిదేవత భద్రకాళీదేవి
వ – అమృతబీజము అధిదేవత చంద్రుడు
🌸షడాననం చందన లేపితాంగం మహారసం దివ్య మయూర వాహనం రుదస్య నూనుం సురలోకనాథం శ్రీ సుబ్రహ్మణ్యం శరణం ప్రపథ్యే.
🌿శ – శమింపజేయువాడు
ర – రతిపుష్టిని ఇచ్చువాడు
వ – వంధ్యత్వం రూపుమాపువాడు
ణ – రణమున జయాన్నిచ్చేవాడు
భ – భవసాగరాన్ని దాటించేవాడు
వ – వందనీయుడు అని ‘శరవణభవ’కు గూఢార్థం....
Subscribe to:
Posts (Atom)