Adsense

Showing posts with label Telugu Language. Show all posts
Showing posts with label Telugu Language. Show all posts

Sunday, March 26, 2023

తెలుగు భాషలోని వాగ్దేవతలు ..వారి అద్భుత శక్తులు..!!

తెలుగు భాషలో వాగ్దేవతల యొక్క వర్ణమాల.. దాని అంతర్నిర్మాణం

'అ నుండి అః' వరకు ఉన్న 16 అక్షరాల విభాగాన్ని 'చంద్ర ఖండం' అం😔టారు. ఈ చంద్రఖండంలోని అచ్చులైన 16 వర్ణాలకు అధిదేవత 'వశిని' అంటే వశపరచుకొనే శక్తి కలది.

🌸'క' నుండి 'భ' వరకు ఉన్న 24 అక్షరాల విభాగాన్ని 'సౌర ఖండం' అంటారు.

🌸'మ' నుండి 'క్ష' వరకు ఉన్న 10 వర్ణాల విభాగాన్ని ' అగ్ని ఖండం' అంటారు.

🌸ఈ బీజ శబ్దాలన్నీ జన్యు నిర్మాణాన్ని క్రోమౌజోములను ప్రభావితం చేయగలుగుతాయి.

🌸సౌర ఖండంలోని ' క 'నుండి 'ఙ' వరకు గల ఐదు అక్షరాల అధిదేవత కామేశ్వరి. అంటే కోర్కెలను మేలుకొలిపేది అని అర్ధం.

🌸'చ' నుండి 'ఞ' వరకు గల ఐదు వర్ణాలకు అధిదేవత 'మోదిని' అంటే సంతోషాన్ని వ్యక్తం చేసేది.

🌸'ట' నుండి 'ణ' వరకు గల ఐదు అక్షరాల అధిదేవతా శక్తి 'విమల'. అంటే మలినాలను తొలగించే దేవత.

🌸'త' నుండి 'న' వరకు గల ఐదు అక్షరాలకు అధిదేవత 'అరుణ' కరుణను మేలుకొలిపేదే అరుణ.

🌸'ప' నుండి 'మ' అనే ఐదు అక్షరాలకు అధిదేవత 'జయని'. జయమును కలుగ చేయునది.

🌸అలాగే అగ్ని ఖండంలోని 'య, ర,ల, వ అనే అక్షరాలకు అధిష్టాన దేవత ' సర్వేశ్వరి'. శాశించే శక్తి కలది సర్వేశ్వరి.

🌸ఆఖరులోని ఐదు అక్షరాలైన 'శ, ష, స, హ, క్ష లకు అధిదేవత 'కౌలిని'

🌸ఈ అధిదేవతలనందరినీ 'వాగ్దేవతలు' అంటారు. అయితే ఈ ఏడుగురే కాకుండా అన్ని వర్ణాలకు ప్రకృతిలో ఒక రూపం, ఒక దేవతాశక్తి ఉంది. ఎందుకంటే శబ్దం బ్రహ్మ నుండి ఉద్భవించింది. అంటే బ్రహ్మమే శబ్దము. ఆ బ్రహ్మమే నాదము.

🌸మనం నిత్యజీవితంలో సంభాషించేటప్పుడు వెలువడే శబ్దాలు మనపై, ప్రకృతి పై ప్రభావం చూపుతాయి.

🌸అదే మంత్రాలు, వేదం అయితే ఇంకా లోతుగా ప్రభావం చూపుతుంది. భూమి మీద పుట్టిన ప్రతి జీవి ఈ శబ్దాల్ని ఉచ్ఛరించి అమ్మవార్లును అర్చిస్తున్నాయి.

🌸కాబట్టి మనం స్తోత్రం చదువుతున్నా, వేద మంత్రాలు, సూక్తులు వింటున్నా మనం ఈ విషయం స్ఫురణలో ఉంచుకుంటే అద్భుతాలను చూడవచ్చు.

🌸మనం చదివే స్తోత్రం ఎక్కడో వున్న దేవుడిని/దేవతను ఉద్దేశించి కాదు, మనం చదివే స్తోత్రమే ఆ దేవత. మనం చేసే శబ్దమే ఆ దేవత. మన అంతఃచ్ఛేతనలో ఉండి పలికిస్తున్న శక్తియే మన ఉపాస్య దేవత. ఆ శబ్దం వలన పుట్టిన నాదం దేవత. ఎంత అద్భుతం. ఇది మన తెలుగు వైభవం. ఇది సనాతన ధర్మం. ఇది మనకు మాత్రమే పరిమితమైన అపూర్వ సిద్ధాంతం..