కైలాసం నందు పార్వతీదేవి పరమశివునితో
ఏకాంతంగా క్రీడించు సమయంలో
అగ్నిభట్టారకుడు రావడం వల్ల ,
అగ్నిని చూసిన శివుడు దూరం జరగడం వల్ల
శివుని వీర్య పతనం జరిగింది.
క్రీడా భంగంతో పాటూ ,
అగ్ని వల్ల వీర్య పతనం కావడం వల్ల
ఆ వీర్యాన్ని అగ్నిని ధరించమని
లోక కళ్యాణం కొరకు
పార్వతీదేవి అజ్ఞాపించగా ,
అగ్ని శివుని వీర్యాన్ని భరించి
కుమారస్వామి జననానికి
కారణభూతుడైనందువలన
ఉమాశివాగ్ని పూజ చేయాలని
బ్రహ్మ పురాణం నందు తెలుపబడింది.
▫️
తులసిమొక్కను నాటండి
భగవద్గీతను చదవండి.
గోమాతను పూజించి సంరక్షించండి.