Adsense

Showing posts with label bali temple. Show all posts
Showing posts with label bali temple. Show all posts

Sunday, December 8, 2024

Bali Temple : ఈ ఆలయానికి కనిపించని విషసర్పాలు కాపలా..! సముద్రపు అల వస్తే మెట్లు కనిపించవు.

ఇండోనేషియా సమీపంలో ఉండే బాలి దేశం పేరు మీరెప్పుడైనా విన్నారా..? ఈ దేశం మాత్రమే కాదు చుట్టూ అనేక దేశాలు ఉంటాయి. అవన్నీ దీవుల్లో ఉంటాయి.

ఈ దీవులన్నీ హిందూ మహాసముద్రం పరిధిలోకి వస్తాయి. అయితే బాలి దేశం దీవుల చుట్టూ ఆవరించి ఉన్న సముద్రాన్ని మాత్రం జావా సముద్రమని పిలుస్తారు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.. ఈ బాలి దేశంలో మహాసముద్రంలో ఉండే ఓ చిన్నపాటి కొండపై ఓ హిందూ దేవాలయం ఉంది. ఇది చాలా ఏళ్ల కిందటి నాటిదని చెబుతారు. ఈ దేవాలయం ప్రత్యేకత ఏమిటంటే..

బాలిలోని తబనాన్ అనే ప్రాంతంలో మహాసముద్రంలో కొండపై ఉన్న ఆలయాన్ని తనాహ్ లాట్ టెంపుల్ అని పిలుస్తారు. ఇది హిందూ దేవాలయం. ఇక్కడ సముద్రం, భూమి రెండూ కలసి దైవంగా ఏర్పడ్డాయని నమ్ముతారు. ఈ ఆలయం చుట్టూ మహాసముద్రం ఉండడం వల్ల పెద్ద ఎత్తున అలలు వస్తుంటాయి. ఒకసారి అల వస్తే ఆలయం మెట్లన్నీ అందులో మునిగిపోతాయి. అల వెళ్లగానే ఆ మెట్లు మనకు కనిపిస్తాయి. ఆ సమయంలోనే ఆ ఆలయంలోకి వెళ్లాల్సి ఉంటుంది. లేదంటే అల వచ్చినప్పుడు మెట్లపైనే ఉంటే ఆ అలతోపాటే సముద్రంలోకి వెళ్తారు.

ఇక ఈ ఆలయం చుట్టూ ఉన్న చిన్న చిన్న దీవులను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దారు. దీంతో ఇక్కడికి టూరిస్టులు కూడా పెద్ద ఎత్తున వస్తుంటారు. కాగా ఈ ఆలయం కింది భాగంలో అత్యంత పురాతన వస్తువులు ఎంతో విలువైనవి ఉన్నాయట. కానీ వాటికి కంటికి కనిపించని విష సర్పాలు కాపలాగా ఉంటాయట. ఎవరైనా ఆ వస్తువులను దొంగిలించాలని చూస్తే అవి కాటు వేసి చంపుతాయని ఇక్కడి స్థానికులు చెబుతారు. ఇక ఈ ఆలయంలో ఉండే మరో విశేషమేమిటంటే.. ఈ ఆలయం మొత్తం ఒకే రాయిపై ఉంటుంది. పెద్ద బండను ఆలయంగా చెక్కారు.

దీంతో ఆలయ పరిసరాలు చాలా ప్రకృతి మనోహరంగా ఉంటాయి. ఇక ఉదయం, సాయంత్రం వేళ్లలో సూర్యోదయం, సూర్యాస్తమయాలను చూసేందుకు రెండు కళ్లు చాలవంటే నమ్మండి. అంతటి సుందరంగా ఈ ఆలయ పరిసరాలు దర్శనమిస్తాయి. అయితే ఈ ఆలయానికి వెళ్లాలంటే చాలా ఎక్కువ ఖర్చు పెట్టాల్సి ఉంటుందట. ఎందుకంటే ఇక్కడ ప్రాణాపాయ పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి.. రక్షణ చర్యలకు ఆ మాత్రం ఎక్కువ డబ్బును పర్యాటకుల నుంచి వసూలు చేస్తారు లెండి. ఏది ఏమైనా ఈ ఆలయ విశిష్టతలు భలే ఆశ్చర్యంగా ఉన్నాయి కదూ.

(సేకరణ)