THE COMPLETE BLOG FOR PEOPLE // NEWS, DEVOTIONAL, TECHNOLOGY, LIFE STYLE, SPORTS, ENTERTAINMENT, SCIENCE, ONLINE EARNING, RIDDLES, SILLY QUESTIONS, IMPORTANT DAYS, BEAUTY TIPS, HEALTH
Adsense
Showing posts with label cookery. Show all posts
Showing posts with label cookery. Show all posts
Wednesday, December 28, 2022
Wednesday, July 28, 2021
భోజన నియమాలని తెలుపగలరు BHOJANA NIYAMALU - MEALAS, LUNCH, DINNER
జ: మన శాస్త్రంలో ఎన్నో భోజన విధులని తెలిపారు. మనకున్నన్ని భోజన నియమాలు మరెక్కడ కనపడవు. ఎక్కడ నాగరికత ఉంటుందో అక్కడ నియమం ఉంటుంది.
తిన్న ఆహారంలో -
స్థూల భాగం - మలినంగా మారుతుంది.
సూక్ష్మ భాగం - ప్రాణశక్తిగా మారుతుంది.
అత్యంత సూక్ష్మ భాగం - మనసుగా మారుతుంది.
అందుకే మన పెద్దవాళ్ళు ఆహార విషయంలో ఇన్ని నియమాలు పెట్టారు. మనం తిన్న ఆహారమే మన మనస్సును నిర్మాణం చేస్తుంది కాబట్టి ఆహార విషయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం.
మన శాస్త్రాలలో చెప్పిన భోజన విధులలో కొన్ని
● ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలాగ తినరాదు.
● చప్పుడు చేస్తూ తినడం, త్రాగడం చేయరాదు.
● ఆచమనం చేస్తున్నప్పుడు చప్పుడు చేస్తూ తాగుతే రక్తపాన దోషం వస్తుంది.
● పంక్తిలో కూర్చున్నప్పుడు ఇతరులు లేవకుండా లేవకూడదు.
● ఎడమ చేతిలో పట్టుకొని నుంచోని తింటే గోమాంస భక్షణ దోషం వస్తుంది.
● తింటున్న అన్నాన్ని నిందించారదు.
● ఎంత కోపం వచ్చినా విస్తరిని త్రోయరాదు.
● భోజనానికి కూర్చునే ముందు కాళ్ళు, చేతులు, నోటిని శుభ్రం చేసుకోవాలి.
● బిగుతుగా వున్న దుస్తులను, తలపైనా టోపి వంటివి ధరించరాదు.
● తూర్పుముఖంగా కూర్చుని భుజిస్తే ఆయుష్షు పెరుగుతుంది. దక్షిణ ముఖంగా చేస్తే కీర్తికరం. పశ్చిమాభిముఖం సంపత్కరం. ఎప్పుడైనా సరే ఉత్తరం వైపు తిరిగి భుజించారాదు. కొన్ని చోట్ల - సమూహ భోజనాలలో కొన్ని సడలింపులు చెప్పారు.
● పూర్ణిమ, అమావాస్యలలో రాత్రిపూట భోజనం చేయరాదు.
● చెప్పులు వేసుకొని భుజించారాదు. మంచం మీద కూర్చొని తినరాదు. అది విషం వలె బాధిస్తుంది.
● భగవంతునికి నివేదించని ఆహారాన్ని స్వీకరించరాదు.
● తినరాని వాటిని, నివేదన చేయని వాటిని, అపరిశుద్ధమైన వాటిని తినరాదు.
● నిందిస్తూ తినరాదు. చెడు ఆహారం తినరాదు. శత్రువులు తెచ్చిన ఆహారం తినకూడదు.
● భోజన పదార్థములన్నీ ఆకులోగానీ, కంచంలోగానీ వడ్డించిన తరువాత నీటిని కుడిచేతిలోనికి తీసుకొని మంత్రాన్ని జపించి ఆ నీటిని భోజనంపై చల్లవలెను. అనంతరం మళ్లీచేతిలోకి నీరుతీసుకొని
మధ్యాహ్నమైతే - *"సత్యంత్వర్తేన పరిషించామి"* అనీ,
రాత్రి అయితే - "ఋతంత్వా సత్యేన పరిషించామి"
అని అంటూ కుడిచేతిని, ఎడమ చేతి వైపు నుంచి కుడిచేతి వరకూ ప్రదక్షిణగా విస్తరిచుట్టూ నీటిని విడువలెను.
తర్వాత ఐదుసార్లు అన్నం కొద్దికొద్దిగా తీసుకొని ప్రాణాహుతులు పఠిస్తూ నోటిలో వేసుకొని నమలకుండా మింగవలెను.
ఈ విధంగా చేయలేనివారు కనీసం భోజన సమయంలో ఈ క్రింది శ్లోకాలనైనా పఠించవలెను.
"త్వదీయం వస్తుగోవింద తుభ్యమేవ సమర్పయే
గృహాణ సముఖోభూత్వా ప్రసీద పరమేశ్వర"
అంటే - "ఓ గోవిందా! నీ వస్తువును నీకే సమర్పిస్తున్నాను. నీవు నాయందు ప్రసన్నుడవై ప్రసన్నముఖముతో దీనిని గ్రహించు" అని అర్థం.
*బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మణాహుతమ్
బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధి నా"
ఈ శ్లోకాలను పఠించిన అనంతరం భోజనం చేయవలెను.
భోజనం చేయడం ముగించిన అనంతరం -
"అమృతాపిధానమసి రౌరవే అపుణ్యనిలయే పద్మార్బుద
నివాసినాం అర్థినాం ఉదకం దత్తం అక్షయ్య ముపతిష్ఠతు"
అనే శ్లోకం చెప్తూ నీటిని అప్రదక్షిణంగా విస్తరిచుట్టూ తిప్ప వలెను.
భోజనం చేసి లేచిన అనంతరం చేతులు, కాళ్ళను కడుక్కోవడంతో పాటు నోటియందు నీటిని పోసుకొని పుక్కలించవలెను.
అనంతరం -
అగస్త్యం వైనతేయఞ్చ శమఞ్చ బడబానలమ్
ఆహార పరిపాకార్థం స్మరే ధ్బీమఞ్చ పఞ్చమమ్"
అనే శ్లోకాన్ని పఠించవలెను.
అంటే అగస్త్యుడు, గరుత్మంతుడు, శనీశ్వరుడు, బడబానలుడు, భీములను స్మరించడం వల్ల ఆహారం సమంగా జీర్ణంకాగలదు అని అర్థం.
🌷🌷🌷🌷🌷🌷🌷
Subscribe to:
Posts (Atom)